2050 నాటికి సముద్రాల్లో చేపలకన్నా… ప్లాస్టిక్ సంచులే ఎక్కువగా ఉంటాయట. దీనికి… సూపర్‌మార్కెట్లలో ప్యాకేజింగ్ కోసం వాడే ప్లాస్టిక్ సంచుల వాడకం కూడా ఒక కారణమే. ఇలా ప్యాకింగ్ కోసం ప్లాస్టిక్‌ని అధికంగా వాడుతున్న దేశాల్లో వియత్నాం కూడా ఒకటి. సూపర్ మార్కెట్లలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి వియత్నాం చక్కని ప్రత్యామ్నాయాలు పాటిస్తోంది. కాయగూరలని, ఆకుకూరలని ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కవర్లని వాడకుండా అరటి ఆకులని వాడుతోంది. బెండకాయలు, బీన్స్, మాంసం వంటి వాటిని తాజా అరటి ఆకుల్లో చుట్టి అరటినారతో ప్యాక్ చేస్తున్నారు. భూమిలో త్వరగా కలిసిపోయే ఆకులని వాడి పర్యావరణానికి ప్రమాదం లేకుండా చేస్తున్నాయి అక్కడి సూపర్‌మార్కెట్లు.
వియాత్నాంలో మాంసం అరటి ఆకుల్లో చుట్టి ఇస్తారు
Related tags :