DailyDose

నేటి అసెంబ్లీ విశేషాలు-23/01

AP Assembly Special Coverage-Telugu Political News

1.నేటి అసెంబ్లీలో జగన్ కీలక వ్యాఖ్యలు
శాసనమండలి కొనసాగాలా? వద్దా? సోమవారం జరగనున్న చర్చలుఅసెంబ్లీ సోమవారానికి వాయిదా వేసిన స్పీకర్ 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో మమ్మల్ని గెలిపించారుశాసనసభలో 86 శాతం మార్కులు వచ్చాయిప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం మాది మండలి లో నిన్న జరిగిన ఘటనలు నన్ను బాధించాయిపాలకులు కాదు సేవకులం అని చెప్పినట్టుగా నడుచుకుంటున్నాంఏడు నెలలుగా ప్రజల కోసమే పని చేస్తున్నాం చట్టాలు చేయడానికి ఈ సభ ఏర్పాటయింది మండలి చట్టబద్దంగా వ్యవహరిస్తుందని నమ్మాము. మండలి నుంచి సలహాలు, సూచనలు వస్తాయనుకున్నాం. లేదా బిల్లును తిప్పి పంపిస్తారని అనుకున్నాం. నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపే అధికారం లేదని చైర్మన్ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపారు.గ్యాలరీ లో ఉండి మండలిని చంద్రబాబు నడిపించిన తీరు బాధాకరంనిన్న శాసనమండలిలో చైర్మన్ ప్రసంగించిన వీడియో శాసనసభలో ప్రదర్శనవీడియో లో చైర్మన్ మాట్లాడిన ప్రతి వ్యాఖ్యను మరోసారి శాసనసభలో వివరించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డివిచక్షణ అధికారాన్ని చట్టాన్ని అతిక్రమించడానికి వాడారని స్పష్టంగా అర్థమవుతోందితప్పు అని తెలిసి కూడా.. తప్పు ఒప్పుకొని కూడా.. నా విచక్షణ అధికారాన్ని ఉపయోగించి అదే తప్పును ఉద్దేశపూర్వకంగా చేస్తా అంటున్న మాటలను చూస్తే “హత్య చేయడం తప్పు అయినా నేను హత్య చేస్తానని అంటుంటే ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?”ఆ తప్పుని ఇక చేయకుండా మనం ఆలోచించాలా వద్దా?దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందివిడిపోయిన ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా అనేది ఆలోచించాలిసనసభలో ఎంతోమంది మేధావులు, డాక్టర్లు, లాయర్లు, రైతులు, జర్నలిస్టులు, విజ్ఞులు ఉన్నారు. ఇంత మంది మేధావులు ఇక్కడే ఉన్నప్పుడు మండలి అవసరమా అన్న విషయాల పైన కూడా ఆలోచించాలిమండలి కోసం సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రంలో ఇంత ఖర్చు అవసరమా?మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా ప్రతి మంచి పనిని ఎలా జరగకుండా చేయాలి, ఎలా ఆపాలి ఎలా డిలే చేయాలి అని రూల్స్ ను సైతం ధిక్కరిస్తూ ఉన్న ఇలాంటి మండలి కొనసాగించాలా వద్దా అన్నది సీరియస్గా ఆలోచించాలి.ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా.. చట్టసభల నిబంధనలకు వ్యతిరేకంగా.. ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు వ్యతిరేకంగా..చట్టం రూల్స్ తో సంబంధం లేకుండా పని చేస్తున్న మండలి ఇక కొనసాగించడం అవసరమా అని గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.మండలి ప్రజల కోసం నడుస్తోందా? ఓడిపోయిన నాయకుల కోసం నడుస్తోందా అని ఆలోచించాలి?ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్రంలో ఎక్కడినుంచైనా చట్టాలు చేయవచ్చు .పాలన సాగవచ్చు. దివంగత జయలలిత గారు ఊటీ నుంచి పాలన సాగించారుప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడితే అడ్డుకోవడం ఏంటి?ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ కోసం బిల్లు పెడితే వ్యతిరేకిస్తారాకేవలం రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తుంటే మండలి కొనసాగాలా వద్దా అని ఆలోచించాలిరు అనుమతిస్తే సోమవారం సభ పెట్టాలని కోరుతున్నాం : వైఎస్ జగన్సోమవారానికి సభను వాయిదా వేసిన శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాంమండలి కొనసాగాలా వద్దా అనే అంశంపై సోమవారం జరగనున్న సుదీర్ఘ చర్చలు… కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం
2. అసెంబ్లీలో ఇవాళ వైఎస్ జగన్ ప్రసంగం ఇదీ…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా.. విద్యా చట్టం సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై మొదట సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రసంగిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల విద్యాబోధన అవసరమని ఆయన చెప్పుకొచ్చారు.
* జగన్ మామ అండగా ఉన్నాడు!
‘ఇంగ్లీష్ మీడియంతోనే విద్యార్థుల భవిష్యత్‌కు పునాది. పేద విద్యార్థుల కల సాకారం చేసేందుకు ఇంగ్లీష్ మీడియం తెస్తున్నాం. తొలి నుంచి ఇంగ్లీష్ మీడియం చదవుకుంటే పై చదువులకు వచ్చేసరికి మెరుగైన ఫలితాలొస్తాయి. ఇంగ్లీష్ భాష వస్తేనే మెరుగైన జీవితాలొస్తాయి. పేదలకు ఇంగ్లీష్ మీడియం అందకూడదని ప్రతిపక్షం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. మంచి జీతాలు రావాలంటే ఇంగ్లీష్ మీడియంలో చదువు అవసరం. పేదపిల్లలు అందరికీ జగన్ మామ అండగా ఉన్నాడు’ అని అసెంబ్లీలో వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
3. వైసీపీ నేతల కీలక సమావేశం
శాసన మండలిలో నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేతలు కీలక సమావేశమయ్యారు. నిన్న మండలి చైర్మన్‌ చేసిన ప్రకటనపై నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు. విచక్షణాధికారాలను ఉపయోగించి చేసిన ప్రకటన కావడంతో చెల్లుబాటు అవుతుందా..? లేదా..? అని వైసీపీ నేతలు పరిశీలిస్తున్నారు. మండలి చైర్మన్‌ ప్రకటనను అసెంబ్లీ తీర్మానంతో అధిగమించవచ్చా..? అనే అంశంపైనా చర్చిస్తున్నారు. సీఎం జగన్‌తో భేటీ తర్వాత వైసీపీ నేతలు భేటీ అయ్యారు. గవర్నర్‌ కలిసి బుధవారం జరిగిన పరిణామాలపై వివరించాలనే యోచనలో వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
4. పేదల జీవితాలు బాగుపడకూడదనే కుట్రతోనే..-అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
పేద, బడుగు వర్గాల పిల్లలకు ఇంగ్లిష్‌ విద్యను అందించేందుకు ఉద్దేశించిన ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లు చరిత్రాత్మకమైనదని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలో తప్పనిసరిగా విద్యాబోధన జరగాలంటూ ఈ బిల్లు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించి.. శాసనమండలికి పంపించిందని, మండలిలోని పెద్దలు ఈ బిల్లును మరింత కూలకశంగా చర్చించి.. సూచనలు, సలహాలు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా బిల్లు మీద నాలుగు సవరణలు ప్రతిపాదిస్తూ మండలి తిరిగి శాసనసభకు పంపిందని తెలిపారు. ఇంగ్లిష్‌ మీడియాన్ని ఎత్తివేయాలని, లేదా తెలుగు మీడియం తీసుకోవాలా? ఇంగ్లిష్‌ మీడియమా? అన్న నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వదిలేయాలని సవరణలు పంపారని, శాసనమండలిలో తనకు మెజారిటీ ఉండటంతో చంద్రబాబు ఈ విధంగా దురుద్దేశంతో ఈ బిల్లును తిప్పి పంపారని ఆర్కే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు.
5.అసెంబ్లీ ని బహిష్కరించిన తెదేపా
శాసన సభ శాసన మండలిలో బుదవారం నాడు చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా గురువారం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని తెదేపా నిర్ణయం తీసుకుంది రనెడు సభల్లోనూ బుధవరం నాడు ఉద్రిక్తతా పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు భౌతిక దాడులు జరుగుతాయా> అనే వరకూ పరిస్థితి వెళ్ళింది కానీ తోపులాటలు జరిగాయని కొంతమంది సభ్యులు చెబుతున్నారు అయినాషేద్యుల్ లో లేకుండా సమావేశాలను పొడిగించారని తము హాజరు కావాల్సిన అవసరం లేదన్నది తెదేపా భావనగా ఉంది. గురువారం నాడు టీడీఎల్పీ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని తెదేపా ఇప్పతిఎక్ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది.
6. సీఎంకు విచక్షణాధికారాలు లేవా?:కొడాలి నాని
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే పరిపాలన వికేంద్రీకరణ కూడా అవసరమని అనేక కమిటీలు నివేదికల్లో పేర్కొన్నాయని.. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. శాసన మండలిలో తెదేపా వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. బుధవారం మండలిలో జరిగిన పరిణామాలపై శాసనసభలో జరిగిన చర్చలో నాని మాట్లాడారు.‘‘మండలిలో తెదేపాకు 34 మంది సభ్యులు ఉన్నారని మాకు తెలియదా? అక్కడ కూడా ఈ బిల్లులపై చర్చ జరగాలనే ప్రవేశపెట్టాం. ఏమైనా సలహాలు, సూచనలు చెబుతారని భావించాం. కానీ.. తెదేపా అధినేత చంద్రబాబు గ్యాలరీల్లో కూర్చొని ఛైర్మన్‌ షరీఫ్‌ను సైగలతో ప్రభావితం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తారని పెద్దల సభ (శాసన మండలి) పెట్టారు. ఇప్పుడు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితే వస్తే అప్పటి సీఎం ఎన్టీఆర్‌ మండలిని రద్దు చేశారు. ఈ బిల్లులు ఆమోదం పొందితే ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెంది జగన్‌కు మంచి పేరొస్తుందనే భయం చంద్రబాబుది. అందుకే మండలిలో ఈ విధంగా చేశారు. ఛైర్మన్‌ విచక్షణాధికారాలతో అలా చేశారని చెబుతున్నారు. సీఎంకు విచక్షణాధికారాలు లేవా? తీర్మానం పెట్టి కార్యాలయాలను విశాఖ తరలించాలనుకుంటే ఆపగలిగే శక్తిసామర్థ్యాలు ఎవరికైనా ఉన్నాయా? వచ్చేసారి చంద్రబాబు శాసనసభ గ్యాలరీల్లోనూ కూర్చొనేలా చేయాలి. మండలిని ఉంచాలా? వద్దా? అనేదానిపై సీఎం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’’ అని నాని వ్యాఖ్యానించారు.
7. ఇంగ్లీష్ మీడియం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ‘ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం’ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. మండలిలో సూచించిన సవరణలు తిరస్కరించిన అసెంబ్లీ.. ఎలాంటి సవరణలు లేకుండానే శాసన సభ ఆమోదించింది.ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల విద్యాబోధన అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. పేద విద్యార్థుల కోసం రైట్‌ టు ఇంగ్లీష్‌ విధానం తీసుకొచ్చామన్నారు. ఇంగ్లీష్‌ మీడియం బిల్లును శాసన మండలిలో అడ్డుకున్నారని సవరణలు చేస్తూ అసెంబ్లీకి తిప్పి పంపారన్నారు. ఇప్పుడు మళ్లీ మండలికి బిల్లు పంపుతామని మండలి బిల్లు అడ్డుకున్నా చట్టంగా మారుతుందని ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు.
8. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో శాసనమండలి చైర్మన్ షరీప్ కామెంట్స్.వైసీపీ సభ్యులు ఆవేశపూరితంగా మాట్లాడారు తప్ప ఉద్దేశపూర్వకంగాకాదు.మూడురాజదానుల ఒక రాజధానాఅనే విషయంపై నేనేమి కామెంట్ చేయను.బిల్లులపై నాకున్న విశే అధికారంతోనే సెలక్షణ్ కమిటీకి సిపార్స్ చేసాను.