DailyDose

అమెరికాలో విమానం కూలి నలుగురు మృతి-నేరవార్తలు

Flight Crash Kills Four In USA-Telugu Crime News

*అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా కరోనా మున్సిపల్‌ ఎయిర్‌పోర్ట్‌ లో విమానం కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. కరోనా ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం ఉదయం చిన్నపాటి సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్ అవుతుండగా, విమానం గాలిలో ప్రయాణించలేకపోయింది. ఆ తర్వాత విమానం ఫెన్స్‌ను తాకుతూ కుప్పకూలి విమానాశ్రయానికి తూర్పున ఉన్న బారికేడ్‌ను తాకింది. 80 గ్యాలన్ల ఇంధనాన్ని మోస్తున్న విమానం, ఆపై పల్టీలు కొట్టి మంటల్లో చిక్కుకుంది తర్వాత మంటలు చెలరేగాయి. పైలట్‌కు విమానంపై కంట్రోల్‌ తప్పిందని రన్‌వేపై చాలా వేగంగా విమానం పరిగెత్తిందని ప్రమాద ఘటనను వీక్షించిన మరో పైలట్‌ దొర్తీ వోల్‌ చెప్పారు.
*హర్యానాలోని పల్వాల్ లో ఓ మహిళ తెగువ చూపించింది. తానిచ్చిన ఫిర్యాదుపై చర్య తీసుకోవడం లేదంటూ కానిస్టేబుల్ పై దాడికి దిగింది. అందరూ చూస్తుండగానే కానిస్టేబుల్ తో వాదనకు దిగింది. ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని ప్రశ్నించింది. తన భర్త దగ్గర డబ్బులు తీసుకుని అమ్ముడుపోయారని ఆ మహిళ ఆరోపించింది.
* తనపై లైంగిక వేధింపులు జరగడంతో అవమానంతో కుంగిపోయిన ఇంటర్ విద్యార్థి ఉరి వేసుకొని చనిపోయిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. 18 ఏళ్ల ఇంటర్ బాలుడిని.. అతడి తోటి విద్యార్థులు మరియు హాస్టల్ సిబ్బంది గత కొన్ని రోజులుగా లైంగికంగా హింసించడంతో ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
*ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయిని మరొకరికి ఇచ్చి పెళ్లి చేశారనే కోపంతో శ్రీనివాస్ అనే వ్యక్తి యువతి ఇంట్లోవాళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలు కాలిపోయి చనిపోగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు.
*ఇబ్రహీంపట్నం లో దారుణం. తాత నానమ్మలే కుంచాల హేమ (16) అనే మైనర్ బాలికను హత్య చేసిన నాయనమ్మ, తాతయ్య. హత్య చేసి మృతదేహాన్ని గుంటూరు తీసుకెళ్లి కాల్చివేసిన నాయనమ్మ, తాతయ్య. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు…
*తెలంగాణలో గురువారం ఉదయం వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా పది మంది గాయపడ్డారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
*తిర్యాని మండలం ఏదులపాడు గ్రామం ట్రాక్టర్ బోల్తా పడి మడవి ఉదయ్ (17)అనే యువకుడు మృతి.పత్తి ముళ్ళ కోసం వెళ్తున్నా క్రమంలో ట్రాక్టర్ బోల్తా.ట్రాక్టర్ పై ఉన్న ఇద్దరు కూలీలు. ఒకరికి తీవ్ర గాయాలు. ఆస్పత్రికి తరలింపు.ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
*గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు, కంటైనర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
*ఉత్తర ఢిల్లీలోని నారాయణ ప్రాంతంలో ఈరోజు ఉదయం పిల్లలతో వెళుతున్న స్కూలు బస్సును, డీటీసీకి చెందిన క్లస్టర్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు.
*మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో ఐఈడీ బాంబు పేలింది. వెస్ట్ నాగమహాల్‌లోని గార్మెంట్ దుకాణం సమీపంలో బాంబు పేలడంతో ఆ షాపు ధ్వంసమైంది. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించాయి.
* అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చికలగురికి దగ్గర గురువారం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
* గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* హైదరాబాద్‌ నగర శివారు మైలార్‌ దేవ్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. దానమ్మ దోపిడి ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోదాంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఎగిసి పడుతున్న మంటలతోపాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆర్పేందుకు రాజేంద్రనగర్‌ అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
* కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఉమ్మడిదేవరపల్లి వద్ద గురువారం ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరువూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉమ్మడిదేవరపల్లి వద్దకు రాగానే స్టీరింగ్‌ ఫెయిల్‌ కావడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లి మోరీని డీకొట్టి ఆగిపోయింది. అయితే పక్కనే ట్రాన్స్‌పార్మర్‌ ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆ సమయంలో బస్సులో 40-50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. కొద్దిలో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
* వరకట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేయడంతో వివాహిత తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మండలంలోని పెద్దకాల్వ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
*మేడికొండూరు కూరపాడు గ్రామంలో కంటెయినర్ ఢీ కొట్టిన మాచర్ల ఎక్స్ ప్రెస్ 8 మందికి తీవ్ర గాయాలు ఓవర్ టేకింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. బస్సు డ్రైవర్, కంటైనర్ డ్రైవర్ పరిస్థితి విషమం. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.
*జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండల పరిధిలోని దెయ్యాల వాగు వద్ద ప్రమాదం జరిగింది. ఆగిఉన్న చెరకు ట్రాక్టర్‌ను, కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు…
*ప్రమాదంలో గాయపడిన సయ్యద్ (వెంకటాపురం ఇస్మాయిల్ కిరాణా షాపు యజమాని) ప్రమాదవశాత్తు అదుపుతప్పి కల్వర్ట్ ను ఢీకొన్న సంఘటన ములుగు జిల్లా ఎటు నగరం మండలం చిన్నబోయినపల్లి శివారులో తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలంలోని చెందిన దామోదర్ (TV9 రిపోర్టర్) మృతి, వెంకటాపురం మండలం సయ్యద్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలు. వైద్యశాలకు తరలించారు…
* ఆగిఉన్న ఓ చెరుకు ట్రాక్టర్ను అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదం గద్వాల మండలం, దెయ్యాల వాగు వద్ద చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.
*ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ మృతి చెందారు. మృతుడు దామోదర్గా(35)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్దేవుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో పాడైపోయిన రబ్బరు టైర్ల గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మంటలు పక్కనే ఉన్న మరో ప్లాస్టిక్ గోదాంకు అంటుకున్నాయి.
*ఆర్థిక కారణాలు, మనస్పర్థలు ఆ కుటుంబం పాలిట మృత్యుపాశాలయ్యాయి. పొద్దుపొడవకుండానే ముగ్గురి జీవితాలు తెల్లారిపోయాయి. వ్యక్తిగత కక్షతో ఓ బంధువు రాక్షస చర్యకు 3 నిండు ప్రాణాలు బలైపోయాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో గాఢనిద్రలో ఉన్న ఓ కుటుంబంపై.. ఆత్మీయుడిగా మెలగాల్సిన వ్యక్తి పెట్రోలు పోసి నిప్పటించాడు.
*దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘మంగళూరు విమానాశ్రయంలో బాంబు’ కేసు నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు గాలింపు ముమ్మరం చేయడంతో బాంబు పెట్టింది తానేనంటూ ఆదిత్యరావు బుధవారం ఉదయం బెంగళూరులోని డీజీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయాడు.
*వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో జరిగిన అవినీతిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తూ సహకార శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి దీనిపై సీబీఐ విచారణ చేయించడానికి అనుమతి ఇవ్వాలని సహకార శాఖ రిజిస్ట్రార్ గత సెప్టెంబరు 27న ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
*ఝార్ఖండ్లో గిరిజనులు సాగిస్తున్న పథల్గఢీ ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఓ గ్రామసభలో తమను వ్యతిరేకించిన ఏడుగురిని ఉద్యమకారులు అపహరించి, చంపేశారు. పశ్చిమ సింహ్భూమ్ జిల్లా, బురుగురీకెరాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమ నేలపైనా, నదులపైనా, ప్రజలపైనా ప్రభుత్వానికి హక్కులు ఉండకూడదని, గ్రామసభలకే సర్వాధికారాలు దఖలుపడాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి గిరిజనులు పథల్గఢీ ఉద్యమం చేపడుతున్నారు. గ్రామానికి చెందిన ఏడుగురిని ఉద్యమకారులు తమతో పాటు తీసుకెళ్లి తర్వాత కత్తులు, కర్రలతో దాడిచేసి చంపేశారు. హత్యకు గురైనవారిలో స్థానిక పంచాయతీ ప్రతినిధి కూడా ఉన్నారు.
*ఒంటరి మహిళపై కొందరు మృగాళ్లు దారుణంగా హత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం వెలుగులోకి వచ్చింది. గొంతులో బియ్యం పోసి ఆపై నోట్లో వస్త్రాలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
*ప్రముఖ సైకిల్ తయారీ కంపెనీ అట్లాస్ అధినేత సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్ (57) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దిల్లీలోని ఔరంగజేబు మార్గంలోని తన నివాసంలో నటాషా కపూర్ సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని బలవన్మరణం చెందారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా.. పోలీసులు ఈ వివరాలను బుధవారం వెల్లడించారు. ఆమె మృతదేహాన్ని గంగారాం ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
*కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. మనువరాలు హేమ(16)ను ఆమె నానమ్మ, తాతయ్య హత్యచేశారు. అనంతరం మృత దేహాన్ని గుంటూరు తీసుకెళ్లి కాల్చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*ఆర్థిక కారణాలు, మనస్పర్థలు ఆ కుటుంబం పాలిట మృత్యుపాశాలయ్యాయి. పొద్దుపొడవకుండానే ముగ్గురి జీవితాలు తెల్లారిపోయాయి. వ్యక్తిగత కక్షతో ఓ బంధువు రాక్షస చర్యకు 3 నిండు ప్రాణాలు బలైపోయాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో గాఢనిద్రలో ఉన్న ఓ కుటుంబంపై.. ఆత్మీయుడిగా మెలగాల్సిన వ్యక్తి పెట్రోలు పోసి నిప్పటించాడు
*దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘మంగళూరు విమానాశ్రయంలో బాంబు’ కేసు నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు గాలింపు ముమ్మరం చేయడంతో బాంబు పెట్టింది తానేనంటూ ఆదిత్యరావు బుధవారం ఉదయం బెంగళూరులోని డీజీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయాడు.
*ఝార్ఖండ్లో గిరిజనులు సాగిస్తున్న పథల్గఢీ ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఓ గ్రామసభలో తమను వ్యతిరేకించిన ఏడుగురిని ఉద్యమకారులు అపహరించి, చంపేశారు. పశ్చిమ సింహ్భూమ్ జిల్లా, బురుగురీకెరాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమ నేలపైనా, నదులపైనా, ప్రజలపైనా ప్రభుత్వానికి హక్కులు ఉండకూడదని, గ్రామసభలకే సర్వాధికారాలు దఖలుపడాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి గిరిజనులు పథల్గఢీ ఉద్యమం చేపడుతున్నారు. గ్రామానికి చెందిన ఏడుగురిని ఉద్యమకారులు తమతో పాటు తీసుకెళ్లి తర్వాత కత్తులు, కర్రలతో దాడిచేసి చంపేశారు. హత్యకు గురైనవారిలో స్థానిక పంచాయతీ ప్రతినిధి కూడా ఉన్నారు.
*ఒంటరి మహిళపై కొందరు మృగాళ్లు దారుణంగా హత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం వెలుగులోకి వచ్చింది. గొంతులో బియ్యం పోసి ఆపై నోట్లో వస్త్రాలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు.
*ప్రముఖ సైకిల్ తయారీ కంపెనీ అట్లాస్ అధినేత సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్ (57) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దిల్లీలోని ఔరంగజేబు మార్గంలోని తన నివాసంలో నటాషా కపూర్ సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని బలవన్మరణం చెందారు.
*భార్యను పుట్టింటికి పంపించి తర్వాత ఇల్లు ఖాళీ చేసి భర్త పరారయ్యాడు. కూకట్పల్లి ఠాణా పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..కూకట్పల్లి షంషీగూడలో సతీష్(35), సంధ్యారాణి కుటుంబం అద్దెంట్లో నివాసముంటోంది. వీరికి కుమార్తె, కుమారుడు సంతానం. దుస్తుల షోరూంలో సతీష్ పనిచేస్తుండగా.. సంధ్యారాణి గృహిణి
*లలితా జ్యువెలర్స్ దుకాణంలో సిబ్బంది దృష్టి మళ్లించి దొంగలు 92 గ్రాముల బంగారు ఆభరణాలు తస్కరించారు. సంస్థ మేనేజర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*నేపాల్లో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నేపాల్ పర్వత ప్రాంత సందర్శనకు వెళ్లిన 8మంది కేరళ పర్యాటకులు మృత్యువాత పడ్డారు. పర్వత ప్రాంతంలో వారు దిగిన రిసార్టులో హీటర్ నుంచి గ్యాస్ లీకేజీ కారణంగా వారు మరణించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.
*మహారాష్ట్రలో మరో బ్యాంకు మోసం వెలుగుచూసింది. ముంబయికి చెందిన ఫ్రాస్ట్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ దాదాపు రూ.3,592కోట్ల మేర బ్యాంకు మోసానికి పాల్పడిందనే ఆరోపణలతో ఆ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది.
*విశాఖ మన్యంలో గంజాయి తోటలపై అధికారులు దాడులు చేశారు. అబ్కారీశాఖ, పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో మన్యంలోని పెదబయలు మండలం లుగసారిపుట్టులో సాగుచేస్తున్న 80 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గంజాయి విలువ రూ.12 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా వేశారు.
*హైదరాబాద్ అమీర్పేటలో మంగళవారం మధ్యాహ్నం ఓ పిచ్చి కుక్క హడలెత్తించింది. పాదచారులను, ద్విచక్రవాహనాలపై వెళ్లేవారిని దాడి చేసి కరిచింది. కనిపించిన ఇతర శునకాలనూ కరవడంతో.. అవి కూడా పాదచారులపై దాడికి దిగాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు సోమాజిగూడ సీఎం క్యాంపు కార్యాలయం ఎదురు వీధి, ధరంకరం రోడ్డు, శివబాగ్, సత్యం థియేటర్ పరిసర ప్రాంతాల్లో 50 మందికి పైగా కుక్కకాట్లకు గురయ్యారు
*అటవీప్రాంత సమీప పంట పొలాల్లోకి మేత కోసం వచ్చిన ఓ ఏనుగు విద్యుదాఘాతంతో మృతి చెందింది.
*ప్రభుత్వ రంగ బ్యాంకులను ముంచిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ముంబయికి చెందిన ఎగుమతుల వర్తక సంస్థ ‘ఫ్రాస్ట్ ఇంటర్నేనేషనల్’… రూ.3,592 కోట్ల మేర 14 బ్యాంకులకు టోకరా వేసింది. కాన్పుర్కు చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐవోబీ) జోనల్ కార్యాలయం ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.
*తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఉన్మాది శ్రీనివాస్ తీవ్ర ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రేమ పేరుతో యువతి ఇంటిపై శ్రీనివాస్ పెట్రోల్ దాడి చేశాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు చిన్నారులు సజీవదహనం కాగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
* తమకు రూ.3కోట్లు ఇవ్వాలని లేదంటే అప్రతిష్టపాలు చేయడంతోపాటు హతమారుస్తామని సాక్షాత్తూ రాష్ట్ర మంత్రిని ముగ్గురు యువకులు ఫోన్‌లో బెదిరించిన ఘటన గోవాలో సంచలనం రేపింది.