Devotional

రేపటి నుంచి శోభనాచలుడి కల్యాణోత్సవాలు

Agiripalli Sobhanachala Swamy Kalayanam 2020

1. రేపటి నుంచి శోభనాచలుడి కల్యాణోత్సవాలు – ఆద్యాత్మిక వార్తలు – 24/01
ఆగిరిపల్లి శోభనగిరిపై వేంచేసి ఉన్న శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి వార్ల మాఘమాస రథసప్తమి మహోత్సవాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. దేవదాయ శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ మహోత్సవాలకు పొరుగు జిల్లాల వారు కూడా విశేష సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామి వారిని నిత్యం ఊరేగింపుగా తీసుకొచ్చి స్థానిక పెద్ద కొఠాయి(స్వామి వారి కల్యాణ మండపం)లో శాస్త్రోక్తంగా కల్యాణం జరిపిస్తారు. 25న సాయంత్రం 4 గంటలకు స్వామి వారిని చంద్రప్రభ వాహనంపై ఊరేగింపుగా పెద్దకొఠాయి(స్వామివారి కల్యాణమండపం)లోకి తీసుకొచ్చి పెళ్లి కుమారునిలా అలంకరించి రాత్రి 8 గంటలకు నిత్యకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 2వ తేదీ దివ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 3న చిన్నశేష వాహనోత్సవం, 4న చిన్న గరుడ వాహనోత్సవం, 5న శ్రీ యోగాంజనేయ స్వామి వారికి పంచామృత స్నపన, సహస్ర తమాల పత్రార్జన తదితర కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి ధూళిపాళ్ల సుబ్రహ్మణ్యం వివరించారు.
2.అప్పన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్కుమార్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి శేషవస్త్రం బహూకరించారు. ఈవో వెంకటేశ్వరరావు స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. న్యాయమూర్తి దంపతులు విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
3.తితిదేలో సైబర్ నేరాల నియంత్రణ
తిరుమల, తిరుపతి దేవస్థానానికి తరచు ఎదురవుతున్న సైబర్ సవాళ్లను ఎదుర్కోవడానికి, నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. పాలకమండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి ఛైర్పర్సన్గా ఉన్న ఇన్ఫోసిస్ నుంచి ఇందుకు సాంకేతిక సహకారం తీసుకోనుంది. తిరుమల డీఎస్పీ టి.ప్రభాకర్బాబును కొత్తగా ఏర్పాటు చేసే సైబర్ భద్రత, సామాజిక మాధ్యమ పర్యవేక్షణ విభాగానికి అదే హోదాలో నియమించాలంటూ రాష్ట్ర డీజీపీకి తితిదే ప్రతిపాదిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో తరచూ దేవస్థానం ప్రతిష్ఠకు మచ్చతెచ్చేలా.. ప్రచారం జరుగుతోంది. వీటిని నియంత్రించాలని భావించిన ధర్మకర్తల మండలి.. తక్షణమే స్పందించేందుకు వీలుగా ఐటీ విభాగాన్ని పటిష్ఠం చేయడంతో పాటు ప్రత్యేకంగా సైబర్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
4.నేటి నుంచి నాగోబా జాతర
సంప్రదాయాల సంగమమైన నాగోబా జాతర శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ప్రారంభం కానుంది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలను కాపాడుకుంటూ మెస్రం వంశస్థులు ఇక్కడ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ జాతరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఆదివాసీలు, గిరిజనులతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్య హాజరుకానున్నారు.ప్రభుత్వం మేడారం తరవాత రెండో అతిపెద్ద జాతరగా నాగోబాను గుర్తించి రాష్ట్ర పండగగా నిర్వహిస్తోంది. జాతరలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆదివాసీలకు అవగాహన కల్పించేలా స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆదివాసీల ఎద్దులకు దాణా అందేలా పశుసంవర్ధక శాఖ చర్యలు చేపట్టింది. భక్తులకు 24గంటల పాటు వైద్యసేవలు అందుబాటులో ఉంటాయి. నాగోబా సన్నిధిలో ఏటా నిర్వహించే ప్రజాదర్బార్ను ఈ నెల 27న నిర్వహించనున్నారు. దీనికి మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరై ఆదివాసీల తెలుసుకుంటారు.
5. తిరుమల\|/సమాచారం **
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు శుక్రవారం,
24.01.2020
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 13C°-27℃°.
• నిన్న 66,417 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 04 కంపార్ట్మెంట్ లో
సర్వదర్శనం కోసం భక్తులు
వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు
పట్టవచ్చును,
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 2.87 కోట్లు,
• నిన్న 16,600 మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
ప్రత్యేక దర్శనాలు:
• జనవరి 28న వృద్ధులు,
దివ్యాంగులకు శ్రీవారి
ప్రత్యే దర్శనం,
• జనవరి 29న 5 ఏళ్లలోపు
చిన్నపిల్లల తల్లిదండ్రులకు
ప్రత్యేక దర్శనం.
శ్రీవేంకటేశ్వ సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామిttd Toll free #18004254141
6. వారణాసికి పోటెత్తిన భక్తులు
మౌని అమావాస్య సందర్భంగా వారణాసిలోని గంగానదికి భక్తులు పోటెత్తారు. గంగానదిలో పుణ్యస్నానాలాచరించిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి పర్వదినం తర్వాత వచ్చే పుష్యమాస అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈరోజు పితృతర్పణాలు, నదీ స్నానాలు, మౌనవ్రతం పాటించడం పుణ్యప్రదమన్నది శాస్త్రోక్తి. మౌని అమావాస్య రోజు సాదువులు, యోగులు మౌనంగా ఉంటారు. జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావించి మాటలు అవసరం లేదని యోగుల భావిస్తారు.