Politics

కేటీఆర్‌కు సిరిసిల్ల ఓటర్ల ఝలక్-రాజకీయం

Sircilla Voters Choose Independent Candidates-Telugu Political News

*సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌కు షాక్‌ తగిలింది. సొంత నియోజకవర్గంలో కేటీఆర్ ప్రభావం చూపలేకపోయారు. స్వతంత్రులు ఏకంగా 10 మంది గెలిచారు. టీఆర్ఎస్ గెలుపు కోసం అన్ని ప్రాంతాల్లో కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం ఆయన ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. మిగతా మున్సిపాలిటీల్లో కారు స్పీడ్‌గా దూసుకుపోతోంది. సిరిసిల్లలో మాత్రం కేటీఆర్ సత్తా చాటలేకపోయారు. మొత్తం 39 వార్డులకు ఓట్ల లెక్కింపు ముగియగా టీఆర్‌ఎస్‌ 24 వార్డుల్లో గెలిచింది. బీజేపీ అభ్యర్థులు 3, కాంగ్రెస్‌ అభ్యర్థులు 2, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు. వీరు టీఆర్‌ఎస్ రెబల్స్‌గా తెలుస్తొంది.
* చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్పాల్గొన్న టిడిపి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు1984టిడిపి పోరాటాన్ని ప్రపంచం మొత్తం అభినందించింది: చంద్రబాబు1984 టిడిపి ఎమ్మెల్యేలు నేషనల్ హీరోలు అయ్యారు, ప్రజలంతా గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు.ఇప్పుడు టిడిపి ఎమ్మెల్సీలకు ఆ అవకాశం వచ్చింది. నీతి, నిజాయితీలను చాటుకున్నారు. విశ్వసనీయత, విలువలతో నిలబడ్డారు. 1984 పోరాటం గుర్తుచేసిన ఎమ్మెల్సీలకు అభినందనలు.
చెడు ఆలోచనలు చెడ్డ మెదళ్లనే దగ్దం చేస్తాయి.‘‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు’’ గాంధీజి అన్నారు.
బెదిరింపులకు భయపడితే కనుమరుగు అవుతారు. ప్రలోభాలకు లొంగితే తెరమరుగు అవుతారు. పార్టీ కోసం చేసిన త్యాగాలే చరిత్రలో ఉంటాయి. పోరాడేవాళ్లకే పార్టీలో పెద్దపీట. త్యాగాలు చేసిన వాళ్లు ప్రజల గుండెల్లో ఉంటారు.
* జనసేన, భాజపా లాంగ్‌ మార్చ్‌ వాయిదా
ఫిబ్రవరి 2న భారతీయ జనతాపార్టీ, జనసేన సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ వాయిదా పడింది. రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా లాంగ్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు ఇటీవల దిల్లీ పర్యటన సందర్భంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అయితే, ఈ క్రమంలో లాంగ్‌మార్చ్‌ వాయిదా పడినట్లు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణం శనివారం ప్రకటించారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికోసం కలిసి పనిచేయాలని, ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడాలని భాజపా, జనసేన అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే
* మాకు అక్కడ భూములు ఉన్నాయి కానీ..: పరిటాల
తనకు భూముల అమరావతి ప్రాంతంలో ఉన్నాయని, అవ రాజధాని పరిధిలో లేవని మాజీ మంత్రి పరిటాల సునీత ఆమె కుమారుడు శ్రీరాం చెప్పారు. పరిటాల రవి వర్దంతి సందర్భంగా సామూహిక అన్నదానం నిర్వహించిన సందర్భంగా నిర్వహిచిన సందర్భంగా మాట్లాడుతూ తమకు ముందుగా రాజధాని పలానా చోట అని తెలిస్తే అక్కడే కోనేవరమని అలాకాకుండా అమరావతి అంటే పాత గ్రామంలో ఎందుకు కొంటామని శ్రీరాం ప్రశ్నించారు.
* చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ పాల్గొన్న టిడిపి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు1984టిడిపి పోరాటాన్ని ప్రపంచం మొత్తం అభినందించింది: చంద్రబాబు1984 టిడిపి ఎమ్మెల్యేలు నేషనల్ హీరోలు అయ్యారు, ప్రజలంతా గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు.ఇప్పుడు టిడిపి ఎమ్మెల్సీలకు ఆ అవకాశం వచ్చింది. నీతి, నిజాయితీలను చాటుకున్నారు.
విశ్వసనీయత, విలువలతో నిలబడ్డారు. 1984 పోరాటం గుర్తుచేసిన ఎమ్మెల్సీలకు అభినందనలు.చెడు ఆలోచనలు చెడ్డ మెదళ్లనే దగ్దం చేస్తాయి.‘‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు’’ గాంధీజి అన్నారు.బెదిరింపులకు భయపడితే కనుమరుగు అవుతారు. ప్రలోభాలకు లొంగితే తెరమరుగు అవుతారు. పార్టీ కోసం చేసిన త్యాగాలే చరిత్రలో ఉంటాయి. పోరాడేవాళ్లకే పార్టీలో పెద్దపీట. త్యాగాలు చేసిన వాళ్లు ప్రజల గుండెల్లో ఉంటారు. 1984లో పోరాడిన 161ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లిచ్చి గౌరవించాం. 1989-94లో వీరోచితంగా పోరాడిన 74 ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇచ్చాం. ఇప్పుడూ ధీటుగా పోరాడే ఎమ్మెల్సీలకు అదే గౌరవం.
*ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు డెమొక్రసీలో ఉన్నారా? లేక జగన్‌ కసిలో ఉన్నారా? అని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఒక్కసారి ప్లీజ్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ రాష్ట్రంపై భస్మాసుర హస్తం పెట్టారని ఆయన చెప్పారు. మండలిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పారు. కేవలం మండలి రద్దుపై తీర్మానం చేయగలరని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంత పట్టుదలగా ఉంటే శాసనసభను కూడా రద్దు చేయాలని ఆయన అన్నారు. మండలి ఛైర్మన్‌కు అధికారం లేదంటూ కొత్త పల్లవి మొదలు పెట్టారని, బిల్లులను ఛైర్మన్‌ సెలక్ట్‌ కమిటీకి పంపలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్వించారు. రాజధానిపై తుది నిర్ణయం వెలువడకుండా ఏ ఒక్క శాఖనూ తరలించకూడదని హైకోర్టు ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు.
*ఆ కేసులో జగన్‌ తప్పించుకోలేరు: యనమల
మనీలాండరింగ్‌ కేసు నుంచి సీఎం జగన్‌ తప్పించుకోలేరని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 11 ఛార్జిషీట్లలో ట్రయల్‌ మొదలైతే జగన్‌ ఫోకస్‌ అంతా బోనులోనే ఉంటుంది. బోనులో ఉంటే ప్రజలు అసహ్యించుకుంటారని, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అధికారం ఉందని ఇష్టానుసారం చేయవచ్చా అని ప్రశ్నించారు. ‘‘వికేంద్రీకరణ బిల్లు తొలుత ఆర్డినరీ రూపంలో వచ్చి తర్వాత మనీ బిల్లుగా వచ్చింది. మంత్రులు అసలు బిల్లులు చదువుతున్నారా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది. ఎస్సీ కమిషన్‌, ఆంగ్ల మాధ్యమం బిల్లులు ఆర్డినరీ బిల్లులుగా వచ్చాయి. ఆర్డినరీ, మనీ బిల్లుకు పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి. 3 రాజధానుల బిల్లును మనీ బిల్లా? ఆర్డినరీ బిల్లా? అని కోర్టు అడిగింది. బిల్లులో కొన్ని సవరణలు చేశాక సెలెక్ట్‌ కమిటీకి పంపారు. శాసనసభ అనంతరం కౌన్సిల్‌లో బిల్లు పెట్టి చర్చిస్తారు. ప్రజాభిప్రాయం తీసుకుని చేయాల్సిన నిర్ణయాలు ఇష్టానుసారం చేస్తారా? అధికారం ఉందని ఇష్టానుసారం చేసుకుపోవచ్చా?’’అని యనమల ప్రశ్నించారు.
*టీడీపీపై వైసీపీ రివర్స్ ఎటాక్ .. – రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు
మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారం ఏపీలో తీవ్ర దుమారం రేపుతూనే ఉంది. అధికార వికేంద్రీకరణపై శాసన సభ, మండలిలో టీడీపీ వ్యవహరించిన తీరుపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మండలిలో బిల్లు ఆమోదం పొందనీకుండా టీడీపీ వ్యవహరించింది అన్న భావనలో ఉన్న వైసీపీ ఈ క్రమంలో టీడీపీ వైఖరికి నిరసనగా పెద్దఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది.
*అధికార పార్టీ తీరు అప్రజాస్వామికంసీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శ
మున్సిపల్ ఎన్నికలు తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన ఎన్నికలు కావు. డబ్బు, మద్యానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగిన ఎన్నికలు.. అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఒక ప్రకటనలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.వేల కోట్లతో ఓటు విలువ దిగజార్చే కుట్ర చేశారన్నారు. సమాజాన్ని కాపాడేందుకు మేధావులు, ప్రజాస్వామికవాదులు అంతా కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు.
*రాజధాని తరలింపును ఆపలేరు: కన్నబాబు
తెదేపా మోకాలు అడ్డుపెట్టినంత మాత్రాన మూడు రాజధానుల ఏర్పాటు ఆగబోదని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సంఖ్యాబలం ఉందని శాసన మండలిలో కుట్రలు చేసి ఇప్పటి వరకు మూడు బిల్లులను అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. విజయవాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. కొద్దిరోజులు ఆలస్యమైనా రాజధాని తరలింపును ఆపలేరని.. అందులో సందేహం ఎందుకని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. శాసన మండలి ఛైర్మన్కు విచక్షణాధికారం ఉన్నప్పుడు..తాను ఎక్కడ కూర్చొని పరిపాలించాలనే విషయంలో సీఎంకు అధికారం ఉండదా? అని ప్రశ్నించారు. ఎక్కడ సీఎం ఉంటే వ్యవస్థంతా అక్కడే ఉంటుందని చెప్పారు.
*ప్రజాస్వామ్య వ్యవస్థలు క్షీణిస్తున్నాయి:శివసేన
ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల దరిమిలా ప్రత్యర్థిగా మారిన భాజపాపై అధికార శివసేన విమర్శలు గుప్పించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా మూలంగా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య విలువలు కూడా క్షీణించిపోతున్నాయని ఆరోపించింది. ఈ మేరకు తన అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ విభాగం(ఈఐయూ) 2019 ప్రజాస్వామ్య సూచీ ర్యాంకులను ఈ వారం విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో భారత్ 10 స్థానాలు దిగజారి 51వ స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను విడుదల చేశారు.
*ఆప్, కాంగ్రెస్పై భాజపా బాణాలు
హస్తినలో అసెంబ్లీ సమరానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీలు విమర్శల వాడి పెంచుతున్నాయి. దిల్లీ ఎన్నికలను భారత్-పాకిస్థాన్ వివాదంతో పోల్చినందుకుగాను భాజపా నేత కపిల్ మిశ్రాకు దిల్లీ ఎన్నికల సంఘం షోకాజు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ కూడా ప్రతిపక్షాలపై నేరుగా విమర్శలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల వెనక కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీల హస్తముందని ఆరోపించారు. అక్కడ ‘జిన్నా వాలీ ఆజాదీ’ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయని, ప్రజలు జిన్నా వాలీ ఆజాదీ అంటారో.. భారత్ మాతాకీ జై అంటూ నినదిస్తారో తేల్చుకోవాలని దిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు.
*వాళ్లు చెప్పేదొకటి.. చేసేది ఇంకొకటి: నడ్డా
ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ హస్తిన రాజకీయాలు వేడెక్కాయి. దిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ కేంద్రహోంమంత్రి అమిత్ షా నిన్న ధ్వజమెత్తగా.. తాజాగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనదైన శైలిలో ఆప్ సర్కార్పై విరుచుకుపడ్డారు. దిల్లీలో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మిస్తామనీ.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. శుక్రవారం ఆయన లక్ష్మీనగర్ నియోజకవర్గంలోని పాండవ్నగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ‘‘500 పాఠశాలలు, కొత్తగా 30 ఆస్పత్రులు నిర్మిస్తామన్నారు. 5 వేల బస్సులు, దిల్లీ నగరంలో లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల కోసం ఉచిత వైఫై సెంటర్లు, లోక్పాల్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చారు. కానీ అవేమీ చేయలేదు. ఆప్ ఎన్నికల హామీలతో జాగ్రత్త’’ అంటూ ప్రజలను హెచ్చరించారు.
*అమరావతి భూముల్లో ఇళ్ల స్థలాలు
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం (సీఆర్డీఏ) పరిధిలో 2,500 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. విజయవాడ, గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, పెదకాకాని మండలాలకు చెందిన 39,559 మందికి పట్టాలు పంపిణీ చేసేందుకు ఆ భూమిని తీసుకుంటామని పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్ విజయవాడలో శుక్రవారం సమీక్షించారు. ఆ వివరాలను సుభాష్ చంద్రబోస్ శుక్రవారం రాత్రి మండపేటలో విలేకర్లకు తెలిపారు. అమరావతి నగర పరిధిలోకి వచ్చే వివిధ గ్రామాల పరిధిలోనే 2,053.71 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ భూములన్నీ రాజధానిలోని 13 గ్రామాల పరిధిలోనే ఉన్నాయి. మరో ప్రతిపాదన ప్రకారం.. అమరావతి పరిధిలో అంకుర ప్రాంతంగా అభివృద్ధి చేయాలనుకున్న ప్రాంతం నుంచి 922.15ఎకరాల్ని పేదలకు ఇళ్లస్థలాలుగా పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.
*మీ వెంట వచ్చి గుడారాలేసుకోవాలా?: సోమిరెడ్డి
ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటున్న జగన్ మాటల ప్రకారం ఆయన వెనుకే అధికార యంత్రాంగమంతా వెళ్లి అక్కడక్కడా గుడారాలేసుకొని బతకాలా? అని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ట్వటర్లో ప్రశ్నించారు. ‘‘జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారంటున్నారు. మనరాష్ట్రంలో కూడా హార్సిలీ కొండలు, అరకు వంటి ప్రాంతాలున్నాయి కదా.. అక్కడ నుంచి కూడా పాలన సాగించొచ్చు’’అని ఎద్దేవా చేశారు.
*అక్కసుతోనే మండలి రద్దు యోచన
పేద రాష్ట్రానికి శాసనమండలి అవసరమా? అని అంటూనే.. రైతులకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించేందుకు రూ.5 కోట్లు ఎందుకు చెల్లిస్తున్నారని తెదేపా, కాంగ్రెస్, గుంటూరు రాజకీయేతర ఐకాస నేతలు ముఖ్యమంత్రి జగన్ను ప్రశ్నించారు. అక్రమాస్తుల కేసులు వాదించే వ్యక్తిని ప్రభుత్వం తరఫున రైతులకు వ్యతిరేకంగా వాదించడానికి నియమించుకుంటారా? అని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సొమ్మును ఇష్టారీతిన పంచుతారా? అని దుయ్యబట్టారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సెలక్టు కమిటీకి పంపారన్న అక్కసుతో శాసనమండలిని రద్దు చేస్తామనడం దారుణమన్నారు. శుక్రవారం తుళ్లూరు, మందడం, వెలగపూడిలో రైతుల నిరసన దీక్షకు వివిధ పార్టీలు, సంఘాల నేతలు హాజరై సంఘీభావం ప్రకటించారు.
*వైకాపా మూడు ముక్కలవుతుంది
జనసేన అధికార ప్రతినిధి వెంకట మహేష్
మూడు రాజధానులకు కేంద్రం అనుమతి ఉందని వైకాపా నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెడతామని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తెలిపారు. విజయవాడలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ఏది చేసినా తాత్కాలికమేనని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని చెప్పారు. ఫిబ్రవరి 2న జనసేన, భాజపా ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్ నిర్వహించే లాంగ్మార్చ్ తర్వాత వైకాపా పునాదులు కదలడం ఖాయమని పేర్కొన్నారు. త్వరలోనే జగన్పై కేసుల విచారణ పూర్తయి, ఆయన జైలుకెళ్లడం తథ్యమని వ్యాఖ్యానించారు. అప్పుడు వైకాపా మూడు ముక్కలవుతుందని, ఒక ముక్క జైల్లో.. మరో ముక్క జనసేన-భాజపాతో, ఇంకో ముక్క షర్మిలతో వెళతాయని తెలిపారు. మీడియా ప్రతినిధులపై అక్రమంగా నిర్భయ కేసులు నమోదు చేయడం చాలా దుర్మార్గమన్నారు.