NRI-NRT

ఎన్నారై పాలసీ పట్ల యుకె ప్రవాసుల హర్షం

UK NRI TRS Appreciates KCR's Commitment To NRI Policy Design

మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీకి అఖండ విజయాన్ని అందించి కెసిఆర్ నాయకత్వాన్ని మరింత బలపర్చిన తెలంగాణ ప్రజలకు ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నారైల సంక్షేమం కోసం త్వరలో తీసుకరాబోతున్న ‘ ఎన్నారై పాలసీ’ పట్ల ప్రకటన చేయడం యావత్ ఎన్నారై సమాజం హర్షిస్తుందని, ముఖ్యంగా గల్ఫ్ లో నివసిస్తున్న ఎన్నారై బిడ్డల పట్ల కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో అలోచించి తానే స్వయంగా గల్ఫ్ దేశాలు పర్యటించి వారి సంక్షేమానికి కృషి చేస్తాననడం, ఎన్నారైల పట్ల వారికున్న బాధ్యతను తెలియజేస్తుందని. ఈ సందర్భంగా ఎన్నారైలందరి పక్షాన ముఖ్యంగా గల్ఫ్ ఎన్నారైల పక్షాన ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం
కృతఙ్ఞతలు తెలియజేసారు.