DailyDose

హైకోర్టును ఆశ్రయించిన సీఎం జగన్‌-తాజావార్తలు

YS Jagan Pleads Telangana High Court-Telugu Breaking News Roundup

* అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఏపీ సీఎం జగన్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్‌ తరఫున ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. హాజరు మినహాయింపునకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సీఎంగా రాష్ట్ర పాలనా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత తనపై ఉందని పిటిషన్‌లో జగన్‌ పేర్కొన్నారు. ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయనే కారణంతో హాజరు మినహాయింపునకు నిరాకరించడం సరికాదన్నారు. గతంలో ఈడీ, సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం త్వరలో విచారణ జరిపే అవకాశముంది.
* కర్ణాటక రైతుల అరెస్ట్ ను ఖంఢించిన చంద్రబాబు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు కర్ణాటక రైతులను తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబుకర్ణాటక నుంచి వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం హేయం.జధాని రైతులకు మద్దతుగా కర్ణాటక రైతులు వస్తే తప్పా..? సాటి రైతులు కష్టంలో ఉన్నారని కర్ణాటక రైతులు వచ్చారు. తోటి రైతులకు సంఘీభావం చెప్పడమే వాళ్ల నేరమా..? ఒక రైతుకు, మరో రైతు మద్దతివ్వడంలో తప్పేంటి..?తక్షణమే కర్ణాటక రైతులను వదిలేయాలి. లేకుంటే నేనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వస్తాను.ఏవిధంగా విడుదల చేయరో చూస్తాను
* డీజిల్ లోకో షెడ్‌ల‌ను త్వ‌ర‌లో సంపూర్ణంగా మూసివేయ‌నున్నామ‌ని, 2024 క‌ల్లా దేశ‌మంతా విద్యుద్దీక‌ర‌ణ పూర్తి అవుతుంద‌ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు.
* ఈశాన్య రాష్ట్రాల్లో కీల‌క‌మైన నిషేధిత‌ బోడో నేత‌ల‌తో కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ ఒప్పందం కుదుర్చుకున్న‌ది.
అన్ని ఫ్యాక్ష‌న్ గ్రూపుల‌కు చెందిన నేష‌న‌ల్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్‌తో కేంద్రం సంత‌కాలు చేసింది.
కేంద్ర హోంశాఖ నేతృత్వంలో ఈ ఒప్పందం జ‌రిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అస్సాం సీఎం స‌ర‌బానంద్ సోనోవాల్ ఢిల్లీలో జ‌రిగిన ఈ భేటీలో పాల్గొన్నారు. అస్సాంలో బోడో తీవ్ర‌వాదులు ఎక్కువ‌. ఈ ఒప్పందంతో బోడో ప్రాంతం, అస్సాం అభివృద్ధి సాధిస్తాయ‌ని అమిత్ షా తెలిపారు. ఇది చ‌రిత్రాత్మ‌క‌మైన ఒప్పందం అని షా అన్నారు. ఈ ఒప్పందం అమ‌లుకు అన్ని విధాల ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు.
* ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార హోరు కొనసాగుతున్నది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీపార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ నరేలాలో రోడ్‌ షో నిర్వహించారు. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఆప్‌ అభ్యర్థులను గెలిపించాలని కేజ్రీవాల్‌ ప్రజలను కోరారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
* పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతికి కృషి చేస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు జేజేలు తెలిపారు కేటీఆర్‌. 127 మున్సిపాలిటీల్లో 119 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో అగ్రభాగాన నిలిచింది టీఆర్‌ఎస్‌ పార్టీ అని ఆయన తెలిపారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యావంతులకు, మేధావులకు, ప్రజలకు వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలంగా విశ్వసించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు కేటీఆర్‌.
*కామారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా నిట్టు జాహ్నవి ఎన్నికయ్యారు. 23 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లతో సహా ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఎక్స్ ఆఫీషియోగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చైర్మన్‌కు మద్దతు తెలిపారు. మొత్తంగా 30 మంది సభ్యుల మద్దతుతో జాహ్నవి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా గడ్డం హిందు ప్రియా ఎన్నికయ్యారు.
*మైలవరంలో అటవీశాఖ అధికారులపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. అటవీభూమి సాగు చేస్తున్న వైసీపీ కార్యకర్తలను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత పామర్తి శ్రీనివాసరావు అధికారులను బెదిరించారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
*దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తెలంగాణ హాజీపూర్ బాలికల హత్యల కేసులో నేడు తీర్పు వెలువడనుంది. ముగ్గురు బాలికహత్యోదంతాల్లో నల్గొండలోని పోక్సో చట్టం న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ తరఫున వాదనలు విన్న కోర్టు.. ఘటనలు జరిగిన ఎనిమిది నెలల అనంతరం నిందితుడికి శిక్ష ఖరారు చేయనుంది.
*శాసన సభ అజెండాయే రాజ్యాంగ విరుద్ధమని భావిస్తోన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నేటి సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒక సభ గురించి మరోసభలో చర్చించడం పార్టమెంటరీ విధానం కాదని అభిప్రాయపడుతున్నారు. ఇది ముమ్మాటికీ మరో ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు.
*కొత్తపల్లి మునిసిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టిఆర్‌ఎస్‌ క్యాంపునుంచి 8 మంది కౌన్సిలర్ల బైటికి జంప్‌ చేశారు. వారిని టిఆర్‌ఎస్‌లోని మరొక వర్గం వారు వేరే క్యాంపులోకి తరలించారు. టిఆర్‌ఎస్‌ తరఫున వాసాల రమేశ్‌ ఛైర్మన్‌ సీటు కోసం పోటీ పడుతున్నారు. అయితే మరొక వర్గం సభ్యులు రుద్రరాజును ఛైర్మన్‌ను చేయడానికి ప్రయత్నిస్తున్నారు
*రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాలుగు హత్యాచార ఘటనలపై సోమవారం తీర్పులు వెలువడనున్నాయి. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన ముగ్గురు అమ్మాయిలపై వేర్వేరు ఘటనల్లో శ్రీనివాసరెడ్డి అత్యాచారానికి పాల్పడి హతమార్చాడని పోలీసులు నల్గొండ న్యాయస్థానంలో అభియోగాలు మోపారు.
*ప్రజాతీర్పును శాసనమండలి గౌరవించడం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. పెద్దలు సలహాలు ఇవ్వాలి కానీ.. బిల్లులు ఆపడం సరికాదని వ్యాఖ్యానించారు. బాగా బలిసిన కోడి.. చికెన్‌ షాపు ముందు తొడగొడితే ఏమవుతుందో.. నారా లోకేష్ తెలుసుకోవాలన్నారు. ఇక ‘నా వ్యక్తిగతంగానైతే శాసనమండలి రద్దు చేయాల్సిందే’నని రోజా అభిప్రాయపడ్డారు.
*వ్యాపార ఒప్పందాల అమల్లో చిత్తశుద్ధి లేకపోతే దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని పలువురు పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) సమీక్ష అంశాన్ని వారు ప్రస్తావించారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన వ్యాపారరంగ ప్రముఖులు.. అక్కడ ‘బిజినెస్టుడే’ ప్రతినిధితో మాట్లాడారు.
*రాష్ట్రవ్యాప్తంగా రైతులను చైతన్యపరిచి పంటమార్పిడి విధానానికి ప్రోత్సహించాలని, సేంద్రియ పంటల సాగుకు సైతం ప్రాధాన్యమివ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉద్యానశాఖ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. పంటకాలనీలను ఏర్పాటుచేసి పండ్లు, కూరగాయ తోటల సాగును పెంచాలన్నారు. పంటల వారీగా రైతుసంఘాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు
*రాష్ట్రవ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దక్షిణ భారతంలో తుపాను వ్యతిరేక గాలులు ఏర్పడిన కారణంగా వేడి పెరిగిందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో సాధారణం కన్నా 2.2 డిగ్రీలు పెరిగి 32.5 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరింది. మహబూబ్నగర్లో అత్యధికంగా 34, రామగుండంలో 30 డిగ్రీలుగా నమోదైంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా ఆదిలాబాద్లో 14 డిగ్రీలు, హైదరాబాద్లో 18.1, రామగుండంలో 17.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
*రైతుల నుంచి విజయ డెయిరీ కొనుగోలు చేసే పాల ధరను లీటరుకు రూ.2 చొప్పున పెంచినట్లు రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(విజయ డెయిరీ) ఛైర్మన్ లోకా భూమారెడ్డి ఆదివారం తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ మేరకు చెల్లిస్తామన్నారు. తద్వారా పాలు అమ్మే దాదాపు లక్షమంది పాడి రైతులకు ఏటా రూ.18 కోట్ల అదనపు ఆదాయం వస్తుందన్నారు. గరిష్ఠంగా 10 శాతం వెన్న ఉంటే లీటరుకు రూ.44 దాకా వస్తుందని వెల్లడించారు.
*(దిల్లీ ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన ఐ లవ్ అమరావతి బోర్డును సిబ్బంది తొలగించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు. గతేడాది సంక్రాంతి పండగ సందర్భంగా ఐ లవ్ అమరావతి, సంక్రాంతి సంబరాల సెల్ఫీ బోర్డును కొన్ని లక్షల రూపాయలతో అప్పటి రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఏర్పాటు చేయించారు. అనంతరం సంక్రాంతి సంబరాల సెల్ఫీ బోర్డు తీసేసి…ఐ లవ్ అమరావతి బోర్డును అధికారులు కొనసాగించారు. అమరావతి నుంచి రాజధాని తరలింపు బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత..ఇవాళ అమరావతి బోర్డును తీసివేశారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ఆదేశాలకు అనుగుణంగా బోర్డును తొలగించినట్లు సిబ్బంది వెల్లడించారు. ఏపీ భవన్లో భోజనానికి వచ్చే వారు నిత్యం ఈ బోర్డు వద్ద సెల్ఫీలు తీసుకునేవారు.
*దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో రూ.10 వేల కోట్ల మైలురాయిని దాటింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-డిసెంబరు నాటికే రూ.10,270 కోట్ల రాబడిని గడించింది. 28.4 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. 8.10 కోట్ల టన్నుల సరకులను రవాణా చేసింది. రైల్వే ట్రాక్ నిర్మాణంలో 119 కి.మీ. డబ్లింగ్, 14 కి.మీ. కొత్త రైలు మార్గాల్ని పూర్తి చేసింది. ‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్’ పేరుతో 155 కి.మీ. మేర విద్యుదీకరించింది. డిజిటల్ టెక్నాలజీ చొరవలో భాగంగా కాగిత రహితం చేసి ‘ఈ-ఆఫీస్’ను వినియోగిస్తున్న దేశంలో తొలి జోన్గా ఇటీవల గుర్తింపు పొందింది.
*నటుడు ప్రకాశ్రాజ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతోపాటు మరో 13 మందిని హత్య చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. సంఘ్ పరివార్ను విమర్శిస్తూ వస్తున్న నిజగుణానందస్వామికి వచ్చిన ఆ లేఖలో వీరి పేర్లున్నాయి. బెళగావిలోని నిజగుణానందస్వామి మఠానికి ఈ లేఖ వచ్చింది. కన్నడలో ఉన్న ఆ లేఖలో ‘ధర్మ ద్రోహులు, దేశద్రోహులను జనవరి 29న హతమార్చేందుకు ముహూర్తం పెట్టాం. మీ చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. నిజగుణానందస్వామీ! మీరు ఒక్కరే కాదు. దిగువ ఉన్న పేర్లను చూడండి. వారిని కూడా చివరి ప్రయాణానికి మీరే సిద్ధం చేయాలి’ అని ఉంది. ఈ లేఖను బెళగావి జిల్లా ఎస్పీకి ఆశ్రమవాసులు అందజేశారు. ఆశ్రమానికి అదనపు భద్రత కల్పిస్తామన్న పోలీసుల సూచనలను మఠాధిపతి తిరస్కరించారు. తనకూ బెదిరింపులు వచ్చాయని కుమారస్వామి శనివారం వరుస ట్వీట్లు చేశారు.
*భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఫిబ్రవరిలో జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 వాహక నౌక ప్రయోగం చేయనున్నట్లు సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ అసోసియేట్ డైరెక్టరు ఎంబీఎన్ మూర్తి వెల్లడించారు. ఆదివారం షార్లో ఆయన మాట్లాడుతూ.. జీఎస్ఎల్వీ ప్రయోగానికి చురుగ్గా అనుసంధాన కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. మార్చిలో పీఎస్ఎల్వీ-సి49, సి-50 వాహకనౌకలను నింగిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 12 ప్రయోగాలను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
*పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించాలన్న డిమాండ్తో నిరసనకారులు ఆదివారం కేరళలో 630 కిలోమీటర్ల పొడవైన మానవ హారంగా ఏర్పడ్డారు. అధికార సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కాసర్గోడ్ నుంచి కలియక్కవిలయ్ వరకు నిరసనకారులు చేయి చేయి కలిపి మానవహారాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ నేత కనమ్ రాజేంద్రన్ తిరువనంతపురంలో పాల్గొన్నారు.
*తమిళనాడు వ్యాప్తంగా పలు విద్యాలయాలు ఉన్న ‘వేలమ్మాళ్’ సంస్థ రూ.532 కోట్ల ఆదాయాన్ని వెల్లడించలేదని తెలిసింది. పన్ను ఎగవేత ఫిర్యాదుల నేపథ్యంలో చెన్నై, మదురై, తేని తదితర ప్రాంతాల్లోని ఆ విద్యా సంస్థల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 64 చోట్ల ఈ సోదాలను ఏకకాలంలో చేపట్టారు. ఈ సందర్భంగా రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
*వివిధ రంగాల్లో పరస్పరం మరింత సహకారమే లక్ష్యంగా భారత్-బ్రెజిల్లు శనివారం 15 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ, భద్రత, వాణిజ్య తదితర రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను మరింత విస్తృత పరచుకునేందుకు ఓ కార్యాచరణను ఆవిష్కరించాయి. అంతకుముందు భారత ప్రధాని మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జయీర్ మిసియాస్ బొల్సోనారోల మధ్య చర్చలుజరిగాయి. ఆదివారం జరిగే భారత గణతంత్ర వేడుకల్లో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బ్రెజిల్ అధ్యక్షుడిని కలుసుకున్నారు.
*సార్వత్రిక ఎన్నికలు-2019 సందర్భంగా మెరుగైన సేవలను అందించిన అధికారులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేశారు. దిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా జగిత్యాల జిల్లా కలెక్టర్ ఏ.శరత్ అందుకున్నారు. రక్షణ ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక అవార్డును హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ రాష్ట్రపతి నుంచి స్వీకరించారు. అనంతరం కలెక్టర్ శరత్ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాకు ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు.
*తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ బత్తుల శివధర్రెడ్డి ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించే పతకాల్లో విశిష్టమైన రాష్ట్రపతి పోలీసు పతకం ఆయన్ని వరించింది. పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారుల్ని ఈ పతకానికి ఎంపిక చేస్తారు.
*ఇదేంటి కారు నంబరు ధర ఇంత పలుకుతుందా..? ఈ ధరకు చిన్నపాటి కారునే కొనుగోలు చేయవచ్చని ఆశ్చర్యపోతున్నారా..! అవునండీ ఇది నిజమే.. కామారెడ్డి జిల్లా కేంద్రం శివారులోని రవాణా శాఖ కార్యాలయంలో శనివారం ఓ వ్యక్తి వేలం పాటలో పాల్గొని రూ.2.47 లక్షలకు 9999 నంబరును దక్కించుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన మధుసూదన్రెడ్డి రూ.1.97 లక్షల వరకు వేలం పాడారు. దీని కోసం ముందస్తుగా రూ.50 వేలను ఆయన చెల్లించారు.
*విప్లవ రచయితల సంఘం(విరసం) కార్యదర్శి, ప్రొఫెసర్ కాశీంను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ను గజ్వేల్ కోర్టు తిరస్కరించింది. కాశీం ఇంట్లో సీజ్చేసిన వస్తువుల గురించి, కేసులో ఇతర వ్యక్తుల సమాచారం కోసం ములుగు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు..‘కాశీం ఒప్పుదల ప్రకటన ప్రకారం వేరేవాళ్లు నిందితులుగా ఉంటే..వారిని చట్టప్రకారం విచారించే హక్కు పోలీసులకు ఉంది.
*ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. సూపర్వైజర్లు, కండక్టర్లు, డ్రైవర్లు, నిర్వహణ సిబ్బంది వారోత్సవాలకు ప్రయాణికులను ఆహ్వానించి రవాణ, న్యాయ, పోలీసు అధికారులతో సలహాలు, సూచనలు ఇప్పించాలన్నారు. వారోత్సవాలలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.
*జాతీయస్థాయి పరీక్షలైన కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్) ఈ నెల 28వ తేదీన జరగనున్నాయి. ఉదయం సీమ్యాట్, మధ్యాహ్నం జీప్యాట్లను నిర్వహిస్తారు. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి సీమ్యాట్, ఎంఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు జీప్యాట్ను జాతీయ పరీక్షల నిర్వహణ మండలి(ఎన్టీఏ) నిర్వహించనుంది.
* సంగారెడ్డి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా బొంగుల విజయ లక్ష్మి, వైస్ చైర్మన్‌గా లత, సదాశివపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా జయమ్మ, వైస్ చైర్మన్‌గా చింత గోపాల్, తెల్లాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా లలిత, వైస్ చైర్మన్‌గా రాములు గౌడ్, అమీన్ పూర్ మున్సిపాలిటీ చైర్మన్‌గా పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్‌గా నరసింహ గౌడ్, నారాయణఖేడ్ మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా రుబినా బేగం, వైస్ చైర్మన్‌గా పరుశురాం, ఆందోలు జోగిపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా మల్లయ్య, వైస్ చైర్మన్‌గా ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు.
*వికారాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా చిగుళ్లపల్లి ముంజులరమేశ్, వైస్‌చైర్ పర్సన్‌గా శంషాద్ బేగం, తాండూర్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా తాటికొండ స్వప్న, వైస్ చైర్ పర్సన్‌గా దీపనర్సింలు ఎన్నికయ్యారు. పరిగి మున్సిపాలిటీ చైర్మన్‌గా ముకుంద అశోక్, వైస్ చైర్ పర్సన్‌గా ప్రసన్నలక్ష్మీ, కొడంగల్ మున్సిపాలిటీ చైర్మన్‌గా జగదీశ్వర్ రెడ్డి, వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉషారాణిక, కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎడ్మ సత్యం, వైస్ ఛైర్మన్‌గా షాహిద్ ఎన్నికయ్యారు.