DailyDose

రెడ్డీస్‌కు భారీ నష్టం-వాణిజ్యం

Reddy's Labs Post Huge Losses-Telugu Business News Roundup Today Daily

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగ‌ళ‌వారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 66 పాయింట్లు లాభపడి 41221 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 12132 వద్ద ప్రారంభమైంది.
*బంగారం ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. వరుసగా ఇదొ రోజు కూడా పసిడి ధర పైకి కదిలింది దీంతో ధర రూ. 42వేలు దాటిపోయింది. బంగారం కొనుగోలు చేయాలనీ భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. పసిడి పరిగెడుతుంటే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.
* బెంగళూరులో స్టార్టప్‌ కంపెనీ ప్రయోగం…
బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ వైఫై డబ్బా.. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కేవలం రూపాయికే ఒక జీబీ డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. సోమవారం నాడిక్కడ సంస్థ సీఈవో కంరం లక్ష్మణ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. రూపాయికే ఒక జీబీ డేటాను ప్రయోగాత్మకంగా బెంగళూరులో అందజేయబోతున్నామని, ఇక్కడ విజయవంతమైతే దేశవ్యాప్తంగా అందజేస్తామని చెప్పారు. మొబైల్‌ ఫోన్లలో ఓటీపీ ఎంటర్‌ చేయడం ద్వారా ‘వైఫై డబ్బా’కు ఎవరైనా కనెక్ట్‌ కావచ్చని చెప్పారు. టీ దుకాణాలు, వ్యాపార కూడళ్లలో లభించే ప్రీపెయిడ్‌ కూపన్ల ద్వారా కూడా డేటా సేవ లను పొందే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
*దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగ‌ళ‌వారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 66 పాయింట్లు లాభపడి 41221 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 12132 వద్ద ప్రారంభమైంది.
*31, 1న సమ్మె చేస్తాం-బ్యాంకు యూనియన్ల హెచ్చరిక
ఈనెల 31 నుంచి రెండురోజుల పాటు దేశవ్యాప్త సమ్మె చేస్తామని బ్యాంకు సంఘాలు హెచ్చరించాయి. సత్వరం వేతన సవరణ చేయాలంటూ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్ల సాధనకు ప్రధాన కార్మిక కమిషనరుతో సోమవారం నిర్వహించిన చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు ‘అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య’(ఏఐబీఈఏ) అధ్యక్షుడు సునీల్ కుమార్ తెలిపారు.
*ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఆర్థిక ఫలితాల విషయంలో అనలిస్టుల అంచనాలు తారుమారయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో భారీ నష్టం చవిచూసింది. ఈ కాలంలో కంపెనీ రూ.569.7 కోట్ల నష్టం ప్రకటించింది. 2018–19 క్యూ3లో రూ.485 కోట్ల నికరలాభం ఆర్జించింది. డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం రూ.4,384 కోట్లకు చేరింది.
*ప్రముఖ ఆన్లైన్ లావాదేవీల అప్లికేషన్ గూగుల్పే వినియోగదారులకు మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ ఫాస్టాగ్ ఖాతాను సులువుగా రీఛార్జ్ చేసుకునేలా.. ప్రత్యేక యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్(యూపీఐ) సౌకర్యాన్ని యాప్ ద్వారా ప్రారంభించింది. ఈ మేరకు సంస్థ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గూగుల్పేకు ఫాస్టాగ్ ఖాతాను లింక్ చేసుకుని రీఛార్జ్ చేసుకోవడమే కాకుండా, పేమెంట్స్ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే సదుపాయాన్ని సైతం కల్పిస్తున్నట్లు తెలిపింది.
*పట్టణ సహకార బ్యాంకుల్లో ఐదేళ్లలో 1,000కిపైగా మోసం కేసులు నమోదైనట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ మోసాల మొత్తం విలువ రూ.220 కోట్లుగా పేర్కొంది. ఆర్బీఐను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించింది. వీటిల్లో 181 కేసుల్లోనే రూ.127.7కోట్లు విలువైన మోసాలు జరిగినట్లు వెల్లడించింది.
*ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ బీఎస్-6 ప్రమాణాలతో మరో కొత్త వాహనాన్ని మార్కెట్లోకి తెచ్చింది. ఆల్టో 800 మోడల్లో ఎస్-సీఎన్జీ వెర్షన్ని విడుదల చేసింది. రెండు వేరియంట్లలో రానున్న ఈ కారు 31.59 కి.మీ. మైలేజీ ఇవ్వనుందని కంపెనీ ప్రకటించింది. మూడు సిలిండర్లు, 796 సీసీ, ఎఫ్8బీ పెట్రోల్ ఇంజిన్తో వస్తున్న ఈ కారు 48 హెచ్పీ, 69 ఎన్ఎం టార్క్ని ఉత్పత్తి చేస్తుంది.
*డిసెంబరు త్రైమాసికానికి స్టాండలోన్ ప్రాతిపదికన రూ.8372.49 కోట్ల నికరలాభాన్ని హెచ్డీఎఫ్సీ నమోదు చేసింది. 2018-19 ఇదే కాలం నాటి లాభం రూ.2113.80 కోట్లతో పోలిస్తే, ఈసారి దాదాపు 4 రెట్లు అధికమైంది. నికరలాభం ఇంత గణనీయంగా పెరగడం నోషనల్ (పుస్తకాల్లో ఉంటుంది) మాత్రమేనని, బంధన్బ్యాంకులో 9.9 శాతం వాటా విలువ పెరగడం వల్లే ఇది సంభవించిందని తెలిపింది.
*ఇండిగో బ్రాండ్పై విమానయాన సేవలు అందిస్తున్న ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.496 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2018-19 ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.185.2 కోట్లే కావడం గమనార్హం. ఇదే సమయంలో ఆదాయం కూడా రూ.8229.3 కోట్ల నుంచి 25.5 శాతం వృద్ధితో రూ.10,330.2 కోట్లకు పెరిగింది. ప్రయాణికుల టికెట్లపై 24% అధికంగా రూ.8770.30 కోట్లు, సహాయక సేవలపై రూ.1037.30 కోట్లు లభించిందని, ఇది ఏడాది క్రితం కంటే 28.8% అధికమని సంస్థ తెలిపింది.
*సీసీఎల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.46.99 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఈపీఎస్ రూ.3.16 ఉంది. 2018-19 ఇదేకాలంలో ఆర్జించిన నికరలాభం రూ.32.60 కోట్లతో పోలిస్తే, ఈసారి 44 శాతం పెరిగినట్లు అవుతోంది.
*ఎన్సీసీ లిమిటెడ్ ప్రమోటర్ల విభాగానికి చెందిన ఏవీఎస్ఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 92 లక్షల ఈక్విటీ షేర్లు కేటాయించింది. ఒక్కో షేర్ ముఖ విలువ రూ.2 కాగా, రూ.117.37 చొప్పున ప్రీమియంతో కలిపి రూ.119.37 ధరకు ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. గతంలో తీసుకున్న కన్వర్టబుల్ వారెంట్ల మార్పిడికి ఏవీఎస్ఆర్ హోల్డింగ్స్ ముందుకు రావడంతో ఈ కేటాయింపు జరిగింది.
*మారుతీ సుజుకీ హ్యాచ్బ్యాక్ మోడల్ ఆల్టోలో బీఎస్-6 నిబంధనలకు లోబడిన సీఎన్జీ వెర్షన్ను విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.32 లక్షలు (ఎక్స్- షోరూమ్ దిల్లీ)గా నిర్ణయించారు. ఆల్టో ఎస్- సీఎన్జీ కేజీకి 31.59 కి.మీ మైలేజీ ఇస్తుందని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, అమ్మకాలు) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. కంపెనీ ఇప్పటికే లక్షకు పైగా బీఎస్-6 ఆల్టోలను విక్రయించింది.
*ముడిసరుకు వ్యయాలు పెరగడంతో మారుతీ సుజుకీ కొన్ని మోడళ్ల ధరలను రూ.10,000 వరకు పెంచింది. ఈనెల 27 నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయని పేర్కొంది. ఆల్టో మోడల్ రూ.6000-9000, ఎస్-ప్రెస్సో రూ.1,500- 8,000, వ్యాగన్ ఆర్ రూ.1,500- 4,000 మేర ధరలు పెరిగాయి. ఎర్టిగా రూ.4,000- రూ.10,000; బాలెనో రూ.3,000- 8000, ఎక్స్ఎల్6 రూ.5,000 చొప్పున ప్రియమయ్యాయి. వీటి ధరలు రూ.2.89 లక్షలు- 11.47 లక్షల (ఎక్స్షోరూం, దిల్లీ) మధ్య ఉన్నాయి.