DailyDose

చంద్రబాబును తెనాలిలో అడుగుపెట్టనివ్వం-రాజకీయ

We will not chandrababu to enter Tenali-Telugu political news roundup

* తెనాలిలో 144 సెక్షన్ ఉంటే సభ ఎలా పెడతారుజేఏసీ ముసుగులో టిడిపి నీ బతికించుకోవలి అని చూస్తున్నా చంద్రబాబు జేఏసీ ముసుగులో దాడులు చేస్తే ఊరుకోం చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్.
* తండ్రికే జగన్‌ వెన్నుపోటు పొడిచారు: తులసి రెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానం ఉన్మాద చర్య అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన మండలిని రద్దు చేసి తండ్రికే జగన్‌ వెన్నుపోటు పొడిచారన్నారు. ఒకే రాష్ట్రం ఒకే సభ అన్న జగన్.. ఒకే రాజధాని అని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. మండలి రద్దు పిచ్చి తుగ్లగ్ చర్యగా తులసి రెడ్డి పేర్కొన్నారు.
*జగన్ కు అమిత్ షాతో సత్సంబంధాలు
శాసన మండలి రద్దు చేస్తూ జగన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఈ విషయమై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.తెదేపాతో పాటు జనసేన, భాజపా సీపీఐ తదితర పార్టీలు జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. శాసన మండలిని రద్దు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించడం పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.
* శాసనమండలి రద్దు అనాలోచిత చర్య: అశోకగజపతిరాజు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానం అనాలోచిత చర్య అని టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి అశోకగజపతిరాజు విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేసే దిశగా వైసీపీ అడుగులు వేస్తోందని ఆరోపించారు. సీఎం జగన్‌వి కుర్రకారు ఆలోచనలా.. అనాలోచిత నిర్ణయాలో తెలియడం లేదని అన్నారు. ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు సుదీర్ఘమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం అమలు చేసే సమయంలో కూడా చర్చకు అవకాశమిచ్చారని, తామే మేధావులం అనుకుంటే పొరపాటని అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని అశోకగజపతిరాజు విమర్శించారు.
*చంద్రబాబు ఆమాట ఉత్తరాంద్ర ప్రజలతో చెప్పిస్తారా?
అమరావతికి మద్దతుగా రాష్ట్ర మంతటా తిరుగుతునానని ప్రతిపక్షనేత చంద్రబాబు ఇప్పుడు ఎందుకు తిరగడం లేదని వుడా మాజీ చైర్మన్ ఎస్ ఏ రెహమాన్ ప్రశ్నించారు. ఏపీను సం రైజ్ స్టేట్ అన్నారని సం అంటే అణా కొడుకు అన్నది ఆయన ఆలోచనని ఎద్దేవా చేసారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా రాజధాని విచయంలో చంద్రబాబు అవలంభిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు. కనీ దేన్నీ సవ్యంగా తీసుకెళ్ళారు. ఆయన మనసులో ఉండేది ఒకటి పైకి చెప్పేది మరొకటి. విసఖల్ రాజధాని కావాలని ఎవరదిగారని బాబు ప్రశ్నిస్తున్నారు.
* ఆ ఖర్చును వృథా అనడం నాన్సెన్స్: కేకే
ఏపీలో శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం, మండలిపై రూపాయి ఖర్చయినా దండగేనంటూ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెరాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు స్పందించారు. ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం సరికాదని అభిప్రాయపడ్డారు. మండలి ఖర్చు వృథా వ్యయం అనడం నాన్సెన్స్‌ అని వ్యాఖ్యానించారు. పెద్దల సభ ఎంతో అవసరమన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్‌ నాగిరెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీర్మానాలను కేంద్రం అమలు చేస్తుందని చెప్పారు. అవసరమైతే అమలుకు ఎక్కువ సమయం తీసుకోవచ్చని చెప్పారు. కేవీపీకి తెలంగాణలో సాధారణ ఓటు హక్కు కూడా లేదుతుక్కుగూడ పురపాలికలో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఓటేసిన తనపై కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వేళ ఆయన కమిషనర్‌ను కలిశారు. నేరేడుచర్లలో కేవీపీ రామచందర్‌రావుకు ఓటు హక్కు కల్పించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘నేను తప్పు ఓటు వేశాననడం సబబు కాదు. వాస్తవాలన్నింటినీ ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లా. పరస్పరం రాష్ట్రాలు మార్చుకుంటూ నేను, కేపీపీ లేఖలు ఇచ్చాం. అప్పటి కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఆదేశాలు కూడా ఇచ్చారు. 2014లో గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు.
* పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్టు
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పీఠం టీఆర్ఎస్ దక్కించుకుంది. చైర్మన్ ఎన్నిక అడ్డదారిలో జరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అడ్డదారిలో చైర్మన్ కుర్చీ కైవసం చేసుకుందని ఆరోపిస్తూ.. ధర్నాకు దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్నటి లిస్టు ప్రకారం సభ్యుల ఎన్నిక జరిగితేనే తాము ఎన్నికలో పాల్గొంటామని ఎన్నికల అధికారులతో ఆయన అన్నారు. కానీ.. అలా జరగకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈసీ నాగిరెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. చైర్మన్ ఎన్నికకు వ్యతిరేకంగా నేరేడుచర్ల సెంటర్‌లో ఉత్తమ్, కేవీపీ ధర్నాకు దిగారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి మిర్యాలగూడకు తరలించారు.
*కేవీపీ అరెస్టు
నేరేడుచర్ల చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో శేరి సుభాస్ రెడికి ఓటుహక్కు అవకాశం కల్పించి టీఆర్ఎస్ మున్సిపల్తీకి సొంతం చేసుకుంది. అయితే నిన్నటి జాబితా ప్రకారం కాకుండా ఈరోజు జాబితాను మార్చడం పై కాంగ్రెస్ భగ్గుమంది. నేరేడుచర్ల చైర్మన్ గా టీఆర్ఎస్ కు చెందిన జయబాబు ఎన్నికయ్యారు.
* నేరేడుచర్ల పురపాలిక తెరాస వశం
తీవ్ర ఉద్రిక్తతలు, ఆద్యంతం రసవత్తరంగా మారిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలక ఛైర్మన్‌ పీఠాన్ని ఎట్టకేటలకు తెరాస కైవసం చేసుకుంది. ఛైర్మన్‌గా జయబాబు, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా శ్రీలత ఎన్నికయ్యారు. అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్‌ మధ్య ఆధిపత్యపోరుకు నేరేడుచర్ల వేదికైంది. ఇరుపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ అడ్డాలో ఎలాగైనా తన పాగా వేయాలనే పట్టుదలతో గులాబీ పార్టీ ఉండగా.. దానిని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నించడం ఆద్యంతం ఆసక్తిని రేపింది.అంతకుముందు నాటకీయ పరిణామాల నడుమ పురపాలక సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన పురపాలక సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్‌ వాకౌట్‌ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఎక్స్‌ అఫిషియో ఓట్ల జాబితాను మళ్లీ మార్చడం.. తాజాగా షేరి సుభాష్‌రెడ్డి, వెంకటేశ్వరుల పేర్లు చేర్చడాన్ని ఉత్తమ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. అక్రమంగా నేరేడుచర్ల ఛైర్మన్‌ పదవిని దక్కించుకోవాలని అధికారపార్టీ చూస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వార్డు సభ్యులతోపాటు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
*రద్దుల రెడ్డిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు: పంచుమర్తి అనురాధ
జగన్‌ జైలుకెళ్తే సీఎం కావాలన్న ఆలోచనతోనే వైసీపీ ముఖ్యనేతల వ్యాఖ్యలు.. బొత్స, పెద్దిరెడ్డి, బుగ్గన, రోజా దూషణలు చేస్తున్నారని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. పైరవీల కోసమే సచివాలయం అంటూ కన్నబాబు చీప్‌గా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నో సెక్షన్ల కింద కేసులున్న జగన్‌ను ఏమి అనాలని అనురాధ ప్రశ్నించారు. రద్దుల రెడ్డిగా ఏపీ సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు.
*మండలి రద్దు సరికాదు: కన్నా
శాసనమండలి రద్దు నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మేకవన్నె పులి రూపానికి నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాల్లో లోటుపాట్లు ఉంటే సెలక్ట్‌ కమిటీకి పంపటం సాధారణంగా జరిగే ప్రక్రియే అని, అంత మాత్రాన మండలి రద్దు చేయటం సరికాదన్నారు. గుంటూరులో ఈటీవీ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. మండలికి రూ.60 కోట్లు వృథా అయితే.. ముఖ్యమంత్రి తన ప్రచారం కోసం చేస్తున్న ఖర్చు, వాలంటీర్ల పేరుతో పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న జీతాలు దేనికని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కేంద్రం ఆమోదం ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటని కన్నా మండిపడ్డారు.
*ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో మంత్రి హరీశ్‌రావు భేటీ
15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌తో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు దిల్లీలో సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల శాతం, రుణపరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు నిధులివ్వాలని మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ నిర్వహణకు నిధులు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు రూ.19 వేల కోట్లు ఇచ్చేలా చూడాలని హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాసిన లేఖను ఆయన ఎన్‌.కె.సింగ్‌కు అందజేశారు.
*రద్దుల రెడ్డిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు: పంచుమర్తి అనురాధ
జగన్‌ జైలుకెళ్తే సీఎం కావాలన్న ఆలోచనతోనే వైసీపీ ముఖ్యనేతల వ్యాఖ్యలు.. బొత్స, పెద్దిరెడ్డి, బుగ్గన, రోజా దూషణలు చేస్తున్నారని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. పైరవీల కోసమే సచివాలయం అంటూ కన్నబాబు చీప్‌గా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నో సెక్షన్ల కింద కేసులున్న జగన్‌ను ఏమి అనాలని అనురాధ ప్రశ్నించారు. రద్దుల రెడ్డిగా ఏపీ సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు.
*తెలంగాణలో కరోనా వైరస్ ఉన్నట్టు నిర్దారణ కాలేదు: ఈటల
తెలంగాణలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్దారణ కాలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దని అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలు మానిటర్ చేస్తోందని, బుధవారం కరోనా వైరస్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామన్నారు. కేంద్ర బృందం హైదరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రులను పరిశీలిస్తోందని, రేపు పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రి ఈటల పేర్కొన్నారు.
*ఆ ఖర్చును వృథా అనడం నాన్సెన్స్: కేకే
ఏపీలో శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం, మండలిపై రూపాయి ఖర్చయినా దండగేనంటూ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెరాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు స్పందించారు. ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం సరికాదని అభిప్రాయపడ్డారు. మండలి ఖర్చు వృథా వ్యయం అనడం నాన్సెన్స్‌ అని వ్యాఖ్యానించారు. పెద్దల సభ ఎంతో అవసరమన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్‌ నాగిరెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీర్మానాలను కేంద్రం అమలు చేస్తుందని చెప్పారు. అవసరమైతే అమలుకు ఎక్కువ సమయం తీసుకోవచ్చని చెప్పారు.
*మండలి రద్దు సరికాదు: కన్నా
శాసనమండలి రద్దు నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మేకవన్నె పులి రూపానికి నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాల్లో లోటుపాట్లు ఉంటే సెలక్ట్‌ కమిటీకి పంపటం సాధారణంగా జరిగే ప్రక్రియే అని, అంత మాత్రాన మండలి రద్దు చేయటం సరికాదన్నారు. గుంటూరులో ఈటీవీ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. మండలికి రూ.60 కోట్లు వృథా అయితే.. ముఖ్యమంత్రి తన ప్రచారం కోసం చేస్తున్న ఖర్చు, వాలంటీర్ల పేరుతో పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న జీతాలు దేనికని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కేంద్రం ఆమోదం ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటని కన్నా మండిపడ్డారు.
*తెదేపా పార్లమెంటరీ నేతలతో చంద్రబాబు భేటీ
తెదేపా పార్లమెంటరీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం అంశంతోపాటు, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్‌ హాజరయ్యారు. మరోవైపు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో చంద్రబాబు మధ్యాహ్నం భేటీ కానున్నారు. రాజధాని రైతుల ఆందోళనలు, అమరావతి ఐకాస కార్యక్రమాలపై చర్చించనున్నారు. మండలి రద్దుపై ప్రభుత్వం తీర్మానం చేసిన నేపథ్యంలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చిస్తారు.
*ఎయిర్ ఇండియా అమ్మకం తగదు: సిన్హా
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్సిన్హా సోమవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎయిర్ఇండియాలో వంద శాతం వాటాలు విక్రయిస్తున్నట్లు ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు. లఖ్నవూలోని సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ లేనంతగా దారుణమైన ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. కేంద్రం మరోసారి ఎయిర్ఇండియాలో వాటాలు విక్రయించడానికి ప్రయత్నిస్తోంది.. కానీ ఆర్థిక మందగమనం కారణంగా కొనేవారే కరవయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) మోదీ ప్రభుత్వం చేపట్టిన మళ్లింపు చర్య. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాల ద్వారా కేంద్రం ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని దారి మళ్లిస్తోంది’ అని ఆరోపించారు.
*కేసీఆర్ను నమ్మితే జగన్ భవిష్యత్ చీకటే’-ఎంపీ రేవంత్రెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్తో స్నేహం వల్లే మండలిని రద్దు చేయడం వంటి వ్యవస్థల విధ్వంసానికి ఏపీ సీఎం జగన్ పూనుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. పక్కరాష్ట్రంలో అస్థిర పరిస్థితులు నెలకొంటే తమకు ఇబ్బంది ఉండదనే జగన్కు కేసీఆర్ ఈ తరహా సలహాలు ఇచ్చినట్లు అనిపిస్తోందన్నారు. దిల్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్తో ఇదే రకంగా స్నేహం కొనసాగిస్తే.. జగన్తో పాటు ఏపీ భవిష్యత్ అంధకారమేనని చెప్పారు.
*గవర్నర్, కేంద్ర ప్రభుత్వం స్పందించాలి: కాంగ్రెస్
మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్న అ ప్రజాస్వామిక విధానాలపై గవర్నర్, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని మాజీ ఎంపీ మధుయాస్కీ, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు కోరారు. కాంగ్రెస్, భాజపాలు మెజార్టీ స్థానాలు గెలిచిన మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లను సంతలో పశువులను కొన్నట్లు కొనుగోలు చేయడంతో పాటు ఎక్స్ అఫిషియో పేరుతో అనైతికంగా తెరాస ఛైర్మన్ పదవులను కైవసం చేసుకుంటుందని ధ్వజమెత్తారు. వారు సోమవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా మారి విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులను ఎస్కార్ట్ పెట్టి తీసుకువెళ్లారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, పోలీసులను కేంద్రం కట్టడి చేయాలని కోరారు.
*అద్నాన్ సమీకి పద్మశ్రీపై కాంగ్రెస్ అభ్యంతరం
ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వడంపై వివాదం చెలరేగింది. పాకిస్థాన్కు చెందిన ఆయనకు 2016లో భారత పౌరసత్వం లభించింది. సమీ తండ్రి పాక్ వాయుసేనలో పైలట్గా పనిచేశారని, భారత్పై జరిగిన యుద్ధంలో పాల్గొన్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ తెలిపారు. అలాంటి వ్యక్తి కుమారుడికి పద్మశ్రీ పురస్కారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దేశానికి సమీ చేసిన సేవలేమిటన్నారు. ఈ వ్యాఖ్యను భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఖండించారు.
*దిల్లీ ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు!
దిల్లీ శాసనసభ ఎన్నికలపై దృష్టి సారించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ అధిష్ఠానం సూచించింది. సోమవారం రాత్రి వార్ రూంలో వివిధ రాష్ట్రాల నేతలతో ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్రం నుంచి ఎంపీ రేవంత్రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్, మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు హాజరయ్యారు. దిల్లీలో ఉన్న తెలుగు ఓటర్లను పార్టీ వైపు మళ్లించేలా ప్రణాళికలు రూపొందించాలని నేతలకు సూచించారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల తర్వాత తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు.
*ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తెరాస: చాడ
స్పష్టమైన ఆధిక్యత రాని పురపాలక, నగరపాలక సంస్థల్లో ఎక్స్అఫిషియో పేరుతో అధికార పార్టీ ఛైర్మన్, మేయర్ పదవులను కైవసం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పురపాలక ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాలను నిలువరించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని చాడ ఆరోపించారు.
*52 వేల ఎకరాలు చేతులు మారాయి: ఉమా
3 రాజధానుల ప్రకటనకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా హైదరాబాద్, విశాఖపట్నంలలో 52వేల ఎకరాలు చేతులు మారాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పూర్తిస్థాయి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ కృష్ణా జిల్లా కంచికచర్లలో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. రాజధాని ప్రకటించకముందు వైకాపా ఎమ్మెల్యేలు విశాఖలో 32వేల ఎకరాలను కొన్నారని తెలిపారు. ఇప్పుడు వాటిని అమ్మి రూ.కోట్లు గడించేందుకు రాజధానిని తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. రాజధానిని తరలించేందుకు శాసనమండలిని రద్ద్దు చేసే దిశగా ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు.
*అది పెట్టుబడిదారీ ఉద్యమం: వైకాపా
‘అమరావతిలో జరుగుతున్నది పెట్టుబడిదారీ ఉద్యమం.. చంద్రబాబు తన భూములకు రేటు కోసమే ఇదంతా చేస్తున్నారు’ అని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు 3 ఎకరాల ప్రభుత్వ భూమి తప్ప.. ఒక్క సెంటు ప్రైవేటు భూమి తీసుకోవడం లేదని సీఎం స్పష్టం చేశారని ఆయన పేర్కొన్నారు. మండలి రద్దుపై చర్చ సందర్భంగా శాసనసభలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ..‘రాజ్యసభలో కేంద్రానికి బలం లేనప్పుడు మామూలు బిల్లుల్నీ ఆర్థిక బిల్లులుగా పెట్టి ఆమోదింపజేసుకుంది. జగన్ తలచుకుంటే ఇక్కడా అలా చేసేవారు’ అని పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించిన వాళ్లు, ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లే మండలిలో ఉన్నారని చింతల రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు వంటి వారు ఎంతకైనా దిగజారతారని మండలిలో పరిణామాలు గుర్తు చేస్తున్నాయని ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర, సీమ అభివృద్ధికి జగన్ ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే రాజన్నదొర పేర్కొన్నారు.
*జగన్ తొందరపాటు ధోరణితో అరాచకం-అమిత్ షాతో ఆయనకు సంబంధాలున్నాయ్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో.. ఆయన కుటుంబంతో ముఖ్యమంత్రి జగన్కు మంచి సంబంధాలున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కేంద్రం నుంచి ఏదో హామీ ఉంది కాబట్టే మండలి రద్దుపై ముఖ్యమంత్రి ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నామని పేర్కొన్నారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టడానికి 3 రోజులు ప్రయత్నించి విఫలమయ్యారని.. వారు లొంగకపోవడంతో మండలి రద్దు ప్రతిపాదనను తెచ్చారని విమర్శించారు. మండలి ఉండాలని తమ పార్టీ ఎప్పుడూ కోరుకోలేదని.. దానిని పునరుద్ధరించినప్పుడూ తాము వ్యతిరేకించామని చెప్పారు. మండలి రద్దుకు ఏడాదిపైనే పట్టవచ్చని తెలిపారు. అప్పటివరకు ఆగితే వైకాపా వాళ్లే వస్తారని.. కానీ ముఖ్యమంత్రి ఆత్రంగా వ్యవహరించారని విమర్శించారు.
*జగన్ తీరుతో వైకాపా నేతలే విస్తుపోతున్నారు: రామకృష్ణ
సీఎం జగన్మోహన్రెడ్డి తీరుతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలే విస్తుపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. తెనాలిలో జేఏసీ నేతలపై, దీక్షా శిబిరంపై జరిగిన దాడిని ఖండించారు. దీని వెనక ప్రభుత్వం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ మొత్తం 11 మంది ఎమ్మెల్సీలను కొనుగోలు చేయాలని యత్నించారని.. మంత్రులు, వైకాపా పెద్దలతో తీవ్ర ప్రయత్నాలు చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని విమర్శించారు. ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోనని చెప్పిన జగన్.. ఇప్పుడు ఆయనే తెదేపా ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించకుండానే తన పార్టీలో చేర్చుకున్నారని వివరించారు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులను మండలి సెలక్ట్ కమిటీకి పంపితే, తాను అనుకున్న పని కాలేదని ఆ మండలినే రద్దు చేయడం మంచిది కాదని హితవు పలికారు. జగన్ శాడిస్టులా తయారయ్యారని, ఆయన పతనం ఆరంభమైందని.. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించారు
*వచ్చే ఏడాది జులైకి వైకాపాదే మెజారిటీ!
శాసన మండలి రద్దుకాకుంటే.. వచ్చే ఏడాది జులై నాటికి వైకాపా అక్కడ పూర్తి మెజారిటీ సాధించే వీలుంది. మండలిలో వైకాపాకు ప్రస్తుతం 9 మంది సభ్యులున్నారు. తెదేపాకు చెందిన ఇద్దరు సభ్యులు తాజాగా వీరికి మద్దతు ప్రకటించారు. అంటే సభ్యుల సంఖ్య 11. మండలిలో మెజారిటీ రావాలంటే 30 మంది సభ్యులు అవసరం. ప్రస్తుతం తెదేపాకు మండలిలో 32 మంది (నామినేటెడ్ సభ్యులతో కలిపి) మద్దతు ఉంది.