DailyDose

హైకోర్టు తలుపుతట్టిన వైఎస్ వివేకా కూతురు-నేరవార్తలు

YS Viveka Daughter Requests High Court Interference-Telugu Crime News

* వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకంది. తన తండ్రి వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని వివేకా కూతురు సునీత సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసారు. వైఎస్ వివేకా హత్య జరిగిన తరువాత సునీత సీబీఐ విచారణకు డిమాండ్ చేసారు. అయితే అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండేది. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ డిమాండ్ ను సునీత పక్కన పెట్టారు. అయితే ఏడూ నెలల నుంచి వైఎస్ వివేకా హత్య కేసును తన సోదరుడు జగన్ ప్రభుత్వ కూడా ఏమీ చేయలేకపోవడంతో సునీత సీబీఐకి అప్పగించమని హైకోర్టును ఆశ్రయించడం విశేషం ఇప్పటికే వైఎస్ వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ తెదేపా నేత బీటెక్ రవి, భాజపా నేత ఆదినారాయణ రెడ్డిలు హైకోత్రులో పిటిషన్లు వేసారు. అన్ని పిటిషన్లు ఒకేసారి హైకోర్టు విచారణ చేయనుంది.
* అమెరికాలోని టెన్నెస్సీ నదీ తీరం వెంబడి ఉన్న బోటు డాక్‌యార్డ్‌ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోగా… పలువురు గల్లంతయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం నిన్న(సోమవారం) వేకువ జామున ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా 35 పడవలు మంటల్లో చిక్కుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, స్కాట్స్‌బోరో అగ్నిమాపక అధికారి జెనె నెక్లాస్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.ప్రమాద సమయంలో చాలామంది పడవల్లో గాఢ నిద్రలో ఉన్నట్టు తెలుస్తోంది. మొదట అర్ధరాత్రి దాటాక జాక్సన్ కంట్రీ పార్క్‌కు మంటలు అంటుకోగా ఆ వెంటనే డాక్‌యార్డ్ వైపునకు వేగంగా విస్తరించాయి. మంటలు చుట్టుముట్టడంతో తమను తాము రక్షించుకునేందుకు చాలామంది టెన్నెస్సీ నదిలో దూకారు. వారిని అధికారులు రక్షించారు. చాలా పడవలు చెక్కలతో నిర్మించడంతో మంటలు త్వరగా వ్యాపించాయి.
* కరీంనగర్లో దారుణం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయ్యలేదని కారణంతో ఓ వ్యక్తిని చితకబాదారు టీఆర్ ఎస్ నేతలు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బర్రెకుంటకు చెందిన ఆరెపల్లి రాజేశ్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. దీంతో టీఆర్ఎస్ నేత ఆరెపల్లి కుమార్ తన అనుచరులతో వెళ్లి రాజేశ్ పై దాడి చేశారు. అయితే ఓటు వేయలేదనే కారణంతోనే దాడి చేశారని బాధితుని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్ పరిస్థితి విషమంగా ఉంది.
* నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామ సమీపంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. నల్లవెల్లి గ్రామం నుంచి విద్యార్థులను స్కూల్‌కు తీసుకువెళ్తున్న బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది
* స్కూల్ లో జెండా పైపును తీస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలకు తగలడంతో పదో తరగతి స్టూడెంట్ మృతి చెందిన సంఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం జరిగింది.
* హర్యాతండాకు చెందిన అజ్మీరా నాగేశ్వరరావు, సుకినితండాకు చెందిన భూక్యా సునీల్ లను ఏ1, ఏ2లుగా, హర్యాతండాకు చెందిన బానోతు ఉపేందర్, అంగోతు కల్యాణ్, బానోతు మోహన్, బానోతు చంటిలను ఏ3, ఏ4, ఏ5, ఏ6లుగా, సుకినితండాకు చెందిన మాలోతు అశోక్ ఏ7లుగా గుర్తించినట్లు తెలిపారు.
*మహారాష్ట్రలోని దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిపై యోగిలాల్‌ (52) అనే వ్యక్తి అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
*బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. రవీందర్(22), నవాజ్(20) ఇద్దరూ కత్తులతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడగా.. రవీందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరిపై ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉన్నాయి. రవీందర్‌ను చికిత్స నిమిత్తం స్థానిక అపోలో ఆసుపత్రికి తరలించారు. నవాజ్‌ని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
*యూసఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యవతి దుర్మరణం పాలైంది. వివరాలు… సాయిదీపికా రెడ్డి అనే యువతి ఓ రియల్‌ సంస్థలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. విధుల్లో భాగంగా మంగళవారం యాక్టివాపై పంజాగుట్ట నుంచి యూసఫ్‌గూడకు బయల్దేరింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది.
*మహిళా కొరియోగ్రాఫర్‌ను అశ్లీల చిత్రాలు చూడాలని ఒత్తిడి చేస్తూ, లైంగిక వేధింపులకు లోనుచేస్తున్నాడనే ఆరోపణలపై కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్యపై ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. మహారాష్ట్ర మహిళా కమిషన్‌, అంబోలి పోలీస్‌ స్టేషన్‌లలో గణేష్‌ ఆచార్యపై 33 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదు చేశారు. ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ కొరియోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ (ఐఎఫ్‌టీసీఏ) ప్రధాన కార్యదర్శి కూడా అయిన గణేష్‌ ఆచార్య తన ఆదాయంలో కమీషన్‌ ఇవ్వాలని కోరేవాడని, అశ్లీల వీడియోలు చూడాలని ఒత్తిడి చేసేవాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
*స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా మామిడికుదురు శాఖలో శుక్రవారం రాత్రి జరిగిన చోరీలో రూ.18.76 లక్షల నగదును అపహరించి పారిపోయిన దుండగుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఉన్న ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు అనుమానితులను ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు.
*రాజస్థాన్‌లోని జైపూర్ పరిధిలోని ఆమెర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు అనుమానంతో తన భార్యను హత్యచేశాడు. ఈ ఉదంతంలో అహ్మద్ అన్సారీ(26) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
*బాపట్ల పురపాలక సంఘంలోని మురికివాడలో వాంతులు, విరోచనాలతో భవన కార్మికుడు మృతి..గత కొంతకాలంగా వాంతులు,విరోచనాలతో వైద్యశాలలో చేరుతున్న మురికివాడల ప్రజలు.
*అమెరికాలోని టెన్నెస్సీ నదీ తీరం వెంబడి ఉన్న బోటు డాక్‌ యార్డ్‌ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గల్లంతయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం నిన్న వేకువ జామున ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా 35 పడవలు మంటల్లో చిక్కుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, స్కాట్స్‌బోరో అగ్నిమాపక అధికారి జెనె నెక్లాస్ తెలిపారు.
*రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం నేదునూరులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. బాలమణి అనే వృద్ధురాలిని గుర్తుతెలియన దుండగులు హత్య చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
*కాకతీయ ప్యాసింజరు రైలు చక్రాల్లో ఓ ప్రయాణికుడు ఇరుక్కుపోయి గంట పాటు నరకయాతన అనుభవించాడు. వరంగల్ అర్బన్ జిల్లా స్టేషన్ పెండ్యాల వద్ద సోమవారం రాత్రి 9.35 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
*తిరుచ్చిలో భాజపా ప్రముఖుడిని ఓ ముఠా దారుణంగా హత్య చేసింది. టీ తాగడానికి స్థానిక మార్కెట్కు తెల్లవారుజామున వచ్చిన అతన్ని దుండగులు తరిమి.. తరిమి.. కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
*ఇద్దరు యువకుల మధ్య ఉన్న పాతకక్షలు కత్తిపోట్లకు దారితీశాయి. బాధిత యువకుడు అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు.. బోరబండ బ్రాహ్మణవాడికి చెందిన షేక్ అన్వర్(27) ఆటో డ్రైవర్. 20 రోజుల కింద అతడి సోదరుడు దానేష్ ముంబయి నుంచి వచ్చాడు.
*ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఓ తినుబండారాల పోటీలో విషాదం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా డే వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం నిర్వహించిన కేక్ తినే పోటీల్లో పాల్గొన్న ఓ మహిళ తింటూనే మృత్యువాత పడ్డారు. అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. క్వీన్స్ల్యాండ్లోని బీచ్ హౌజ్ హోటల్ యాజమాన్యం ఆస్ట్రేలియా డే సందర్భంగా ‘కేక్ ఈటింగ్’ పోటీలను నిర్వహించింది.
*అఫ్గాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఘజ్ని ప్రావిన్స్లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో 83 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే.. ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు.
*బెంగళూరులో బంగ్లాదేశ్కు చెందిన ఓ యువతిపై (19) దుండగుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. కోల్కతా నుంచి ఆమెను ఇటీవల బెంగళూరుకు తీసుకొచ్చిన ఓ మహిళ పని ఇప్పిస్తానంటూ యలహంకలో బంధించింది. అక్కడే ఓ యువకుడు ఆమెపై వరుసగా లైంగిక దాడికి దిగి హింసించాడు.
*ఒడిశాలోని రాయగడ జిల్లా మునిగుడ పోలీసుస్టేషన్ పరిధిలోని దమనిపంగ గ్రామ సమీపంలో మావోయిస్టు శిబిరంపై పోలీసులు దాడులు చేశారు. పోలీసుల రాకను గుర్తించిన మావోయిస్టులు 3 ఐఈడీలను పేల్చారు. ఎవరికీ గాయాలు కాలేదు. అనంతరం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సుమారు 10 మంది మావోయిస్టులు శిబిరం నుంచి తప్పించుకున్నారు.
*నిజామాబాద్ జిల్లాలోని నల్లవెల్లి దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. డిచ్‌పల్లి విద్యా పబ్లిక్ స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ విద్యార్థి కాలు బస్సు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు గ్యాస్ కట్టర్‌ సాయంతో విద్యార్థిని బయటకు తీశారు. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగాప్రమాద సమయంలో బస్సులో  మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* ప్రేమిస్తున్నానని వేధింపులకు గురి చేస్తున్న ఓ ఆకతాయిపై యువతి యాసిడ్‌ దాడి చేసింది. ఈ ఘటన యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
* తమిళనాడులో బీజేపీ నేత దారుణ హత్య జరిగింది. తిరుచ్చి పాలకరై ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల విజయరఘు బీజేపీ జోనల్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్థానిక గాంధీ మార్కెట్లో బైక్ పార్కింగ్‌కు టోకెన్లు కూడా ఇస్తూ ఉంటారు.నిన్న (సోమవారం) తెల్లవారుజామున టీ తాగేందుకు మార్కెట్‌కు వెళ్లిన రఘుపై ఐదుగురు సభ్యుల ముఠా వేటకొడవళ్లు, కత్తులతో దాడిచేసింది.
* సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్టు(సీఏఏ)కు వ్యతిరేకంగా అమెరికాలో జరిగిన ఆందోళనల్లో పాకిస్తాన్ ఏజెంట్లు చొరబడ్డారని ఇండో అమెరికన్ కమ్యూనిటీ లీడర్ అడపా ప్రసాద్ ఆరోపించారు. ఇండియాపై తమ ఎజెండా అమలు చేసేందుకే వాళ్లు సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారని, వాషింగ్టన్ డీసీలో ఈ మధ్యే జరిగిన నిరసనల సందర్భంగా పాకిస్తాన్ కు సపోర్టుగా పోస్టర్లు కనిపించాయని ప్రసాద్ సోమవారం మీడియాతో అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆదివారం వాషింగ్టన్ లో జరిగిన నిరసనలను లీడ్ చేసిన మెయిన్ క్యాండిడేట్లలో ఇద్దరు పాక్ అమెరికన్లు ఉన్నారని ఆయన అన్నారు. వాషింగ్టన్ లో కాశ్మీరీ వేర్పాటువాద నిరసనలను కోఆర్డినేట్ చేసే కార్యకర్త దరాక్షన్ రాజా, ముస్లిం కార్యకర్త ఖుదై తన్వీర్ అనే ఇద్దరు పాక్ అమెరికన్లతో పాటు ఖలిస్థానీ అనుకూల కార్యకర్త అర్జున్ సేథీ కూడా నిరసనల్లో పాల్గొన్నారని చెప్పారు.
* నాసిక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.