Food

రోటీలు రాత్రిపూట చాలా మంచివి

Chapathis And Rotis Are Really Good For Health At Night

చపాతీలూ, రోటీలూ ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. రాత్రి పూట చపాతీలు తినడం వల్ల బ్లడ్‌లో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అందువల్ల డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువ.రాత్రి పూట భోజనం తిన్న తర్వాత… వెంటనే పడుకోవద్దని డాక్టర్లు చెబుతుంటారు. కనీసం గంటన్నర తర్వాతే పడుకోమంటారు. ఐతే… రాత్రి వేళ అన్నం తింటే… షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయనీ, బరువు పెరిగిపోతారనీ ఇలా చాలా మంది అన్నం తినాలా వద్దా అని డౌట్ పడుతూ ఉంటారు. ఐతే… అన్నం బదులు… చపాతీలు తినమంటున్నారు డాక్టర్లు. దీని వల్ల చాలా లాభాలున్నాయి. చపాతీలైతే… ఎంత నిల్వ ఉన్నవి తింటే అంత ఎక్కువ ఆరోగ్యం. అంటే… ఉదయం చేసుకున్న చపాతీలను రాత్రి పూట తిన్నా పర్వాలేదు. అదీ కాక… చపాతీలు వేగంగా అరగవు. నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అందువల్ల బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. దానికి తోడు… రాత్రివేళ జీర్ణక్రియా వ్యవస్థ నెమ్మదిగా సాగుతుంది. అందువల్ల రాత్రి వేళ చపాతీలు తినడమే బెటరన్న వాదన వినిపిస్తోంది.బరువు తగ్గాలనుకునేవారు… చపాతీలను ఎక్కువ నూనె కాకుండా… తక్కువ నూనెతో కాల్చుకోవాలి. అసలు నూనె వెయ్యకుండా కూడా చేసుకోవచ్చు. అన్నం కంటే చపాతీ ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి రెండు లేదా మూడు చపాతీలు మాత్రమే తినాలి. లక్కేంటంటే చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. పైగా గోధుమల్లో ఐరన్ ఎక్కువ కాబట్టి… రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అది గుండెకు మేలు చేస్తుంది.భోజనం చేశాక ఎలాగైతే ఓ గంటన్నర తర్వాత నిద్రపోతారో… చపాతీలు తిన్నాక కూడా… గంటన్నర తర్వాతే నిద్రపోవాలి. అలాగే రోజూ టైమ్ ప్రకారం రాత్రివేళ చపాతీలు తినాలి. రాత్రి 7 తర్వాత 10 లోపే తింటే ఎంతో ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. ఉదయం వేళ కూడా చపాతీలు తింటే మంచిదే. కానీ చాలా మంది రాత్రి వేళే వాటిని తినేందుకు ఇష్టపడతారు.