Food

అరటిపండు తింటే గర్భాశయ వ్యాధులు దూరం

Eating Banana Prevents Uterus Infections And Strengthens It

అరటి పండు తింటే కమ్మగా ఉంటుంది. ఆ పండు వచ్చే పువ్వులో కూడా ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. అరటి పువ్వులో అరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో దాగివున్నాయి. అరటి పంట దక్షణ-తూర్పు ఆసియాలో అధికంగా పండిస్తారు. ఉదా రంగులో కనిపించే అరటి పువ్వుతో ఉత్తర అమెరికావాసులు కమ్మనైనా వంటలే చేసుకుంటారు. దీనిలో ఫైబర్, ప్రోటీన్లు, పొటాషియం, విటమిన్స్ ఎ,సి,ఇ,కె పుష్కలంగా ఉన్నాయి. అరటి పువ్వు వంటింట్లో ఉంటే అతివలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పువ్వుతో చేసిన వంటకాన్ని రోజూవారీ తీసుకుంటే శక్తి, గర్భాశయ సమస్యలు తలెత్తవు. పిల్లలు పుట్టిన తరువాత అరటి పువ్వుతో చేసిన వంటకాన్ని బాలింతలకు చేసి పెడుతుంటారు. దీని వల్ల హార్నోన్ల సమతుల్యత ఏర్పడి చనుబాలు పడతాయి. అలాగే రుతుక్రమం సక్రమంగా జరిగి రక్తస్రావం అధికంగా జరగకుండా అడ్డుకుంటుంది. పెరుగుతో కలిపి అరటి పండు తీసుకోవటం వల్ల మహిళలకు ఎంతో మేలు.
**రక్తపోటు నియంత్రణ..
అధిక పొటాషియం వల్ల రక్తపోటును నియంత్రించుకోవచ్చు. హిమోగ్లోబిన్ స్థాయిలను నియంత్రించటానికి, రక్తహీనత నివారణకు అరటి పువ్వ ఎంతో దోహదకారి. శరీరంలో వ్యాధికారక బాక్టీరియా పెరగకుండా మందు వలే పనిచేస్తుంది. దీనిలోని అనామ్లజనిత లక్షణాలు క్యాన్సర్, గుండె జబ్బులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల మలబద్దకం తగ్గిపోతుంది. మధుమేహం ఉన్నవారికి ఇది గొప్ప ఆహారం. పువ్వులో ఉండే ప్లేవానాయిడ్స్ అద్భుతమైన ఇన్సులిన్ వాహకాలుగా పనిచేస్తాయి.
(**కడుపు పూత నివారణకు..
కడుపు పూత నివారణకు అరటిపువ్వు ఇంటి వైద్యంగా పనిచేస్తుంది. మూత్ర విసర్జన చేసేటపుడు బాధాకరంగా ఉంటే ఈ అరటి పువ్వను తీసుకుంటే ఆ బాధ మటుమాయం అవుతుంది. అందుకే అరటి పువ్వుతో చేసిన సూప్‌ను చాలామంది తీసుకుంటారు. అలాగే మగవారిలో ఏర్పడే వంధ్యత్వాన్ని కూడా తొలగింపజేస్తోంది. శ్వాసలో తాజాదనం, చెమటలో దుర్వాసన రాకుండా అరికడుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండి విపరీతంగా వాంతులు అవుతుంటే అరటి పువ్వను తీసుకుంటే మంచిది. కిడ్నీలో రాళ్లను తొలగింపజేస్తుంది. అరటి పువ్వు రసాన్ని తేనెతో ఉదయం వేళ పరగడపున తీసుకుంటే రుతుస్రావ సమస్యలన్నీ తొలగిపోతాయి.వంద మిల్లీగ్రాముల అరటి పువ్వు రసాన్ని ఉదయం మూడుసార్లు తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఊబకాయంతో బాధపడేవారు అరటి పువ్వుతో చేసిన సూప్ తీసుకుంటే మంచిది. ఇందులో అల్లం, కొత్తిమీర ఆకులు చక్కగా కట్‌చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కలుపుకుంటే మంచిది. దీన్ని వారానికి ఐదుసార్లు తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది.