DailyDose

అమరావతి రైతులకు వైకాపా ఎంపీ మద్దతు-రాజకీయ

YSRCP MP Lavu SriKrishnaDevarayulu Supports Amaravati Protest

* రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు నరసరావుపేట వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మద్దతు తెలిపారు. మందడం, వెలగపూడిలో దీక్షా శిబిరాలకు విచ్చేసిన ఎంపీ రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు వచ్చి మీ అభిప్రాయాలు చెప్పాలని రైతులకు సూచించారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఆందోళన చేస్తున్న రైతులు ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. సానుకూలంగా సమస్యను పరిష్కరించుకుందామని కోరారు. ‘‘మీరు వ్యాపారాలు చేస్తే వచ్చిన ఆస్తులు కావు.. తరతరాలుగా వచ్చినవి. తర తరాల నుంచి వచ్చిన ఆస్తులపై రైతులకు భావోద్వేగం ఉంటుంది. రైతుల ఆందోళనను అర్థం చేసుకోగలం. సీఎం జగన్‌ రైతుల పక్షపాతి. రైతులకు న్యాయం చేసిన తర్వాతే ముందుకు వెళ్తారు. అందరూ సహకరించినందువల్లే వైకాపాకు 151 సీట్లు వచ్చాయి. తప్పకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తారు. రైతులకు న్యాయం జరిగే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కావాలని ఆశిద్దాం. రైతులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం’’ అని ఎంపీ వివరించారు. రైతులకు సంఘీభావం తెలిపిన ఎంపీకి జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలను సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
* బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
హెల్త్‌ కేర్, అభివృద్ధి, వాయుకాలుష్య నివారణ ప్రధాన అజెండాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. శుక్రవారంనాడిక్కడ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, ప్రకాష్ జవదేకర్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలపై మీడియాతో నితిన్ గడ్కరి మాట్లాడుతూ, పర్యావరణంపై ప్రధానంగా తమ పార్టీ దృష్టి పెడుతుందన్నారు. ఢిల్లీ వాసులందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని వాగ్దానం చేశారు
*పార్లమెంటు అవర్నాలో విపక్షాల నిరసన
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారమ పారంభామవుతున్న సంగతి తెలిసిందే. ఈనేపద్యంలో పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు విపక్షాలు ధర్నా చేపట్టాయి. ఈదహ్ర్నాలో కాంగ్రెస్ అద్యక్షుశ్రాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు పాల్గొన్నారు. పౌరసత్వం సవరణ చట్టం ఎన్నార్సీ ఎన్పీఅర్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసారు. అంతకుముందు పార్లమెంటు లో వ్యవహరించాల్సిన సమావేశాల్లోనే జామియా నగర్ కాల్పుల ఘటన పౌరసత్వ సవరణ చట్టం ఎన్నార్సీ పై అనుసరించాల్సిన వైఖరిపై చర్చించినట్లు సమచారం
* రాజధాని పేరుతో విశాఖను పాడు చేయొద్దు: హర్షకుమార్‌
రాజధానిగా విశాఖపట్టణాన్ని ప్రకటించడాన్ని మాజీ ఎంపీ హర్షకుమార్ తప్పుబట్టారు. రాజధాని పేరుతో విశాఖను పాడు చేయొద్దని హితవు పలికారు. టీడీపీ హయాంలో ఎప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించిన దాఖలాలు లేవన్నారు. ఏ తప్పు చేయకున్నా తనను జైలులో పెట్టినందుకు గర్వపడుతున్నానన్నారు. ప్రభుత్వం, పోలీసులు తనను ఏమీ చేయలేరని.. ఇది తన సవాల్ అన్నారు.బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేశానని.. స్వరూపానంద శిష్యుడు కావడం వల్లే మంత్రి అవంతి శ్రీనివాస్ పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తున్నారన్నారు. బోటు ప్రమాదంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తాను ప్రభుత్వ అధికారులను తిట్టలేదని.. తనకు 28 రోజుల వరకు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌ కూడా ఇవ్వలేదన్నారు. సీఎం జగన్‌తో పాటు ప్రస్తుత కలెక్టర్ అక్రమాస్తుల కేసులో ఉన్నారన్నారు. టీడీపీ హయాంలో ఎప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించలేదన్నారు.
*తెలుగుదేశం పార్టీ విశాఖ నగర అధ్యక్షులుగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బాద్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ కడప సంస్కృతిని విశాఖ నగరాకితెచ్చిన గనత వైసీపీ నాయకులదేన్నారు. 151 మంది MLAలు ఉన్నారని రేచ్చిపోతున్నారని దాడులు చేసి బయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు తీరు మార్చుకో పోతే తాము రాడ్డులు కర్రలు తీసుకోని రోడ్డుమీదకు వస్తామని హెచ్చరించారు. విశాఖ మహ నగరంలో రౌడీ రాజ్యం కోనసాగుతోందని ఇది ప్రజలు గమనిస్తున్నారన్నారు. అమరావతి అయిన కడప అయిన విశాఖ అయిన రాష్ట్రనికి ఒకటే రాజధాని ఉండాలని స్పష్టం చేశారు. జగన్ కు దమ్ముంటే విశాఖ ను పూర్తి స్థాయి రాజధాని చేయాలని తాము పూర్తి మద్దతు ఇస్తామన్నారు. విశాఖ లో భూములు దోచుకోవటమే లక్ష్యంగా వైసీపీ పెట్టుకుంది అందుకే వారం లో మూడు సార్లు విజయసాయిరెడ్డి విశాఖ కు వచ్చి ఖాళీ భూములు వివరాలు సేకరిస్తున్నారని విమర్శించారు.
* స్ బుక్ లో గంటా శ్రీనివాసరావు …
వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనాదృక్పథం అవలంభిస్తే మంచిది. వైజాగ్ కి ప్రాచీన నామం అయిన వాల్తేరు పేరుతో 1883 లో ప్రారంభం అయినప్పటినుంచి ఈ క్లబ్ వైజాగ్ ప్రజల జీవన విధానంలో మమేకమైంది.వైజాగ్ బ్రాండ్ లో భాగమైంది. అందరికీ ఆహ్లాదాన్ని, ఆతిధ్యాన్ని ఇచ్చే మచ్చికైన ప్రాంతం కావడం తో దీనితో అనుబంధం పెరిగింది. ఇందులో ఎందరో విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, దేశభక్తులు, వివిధ రంగాలలో ప్రావీణ్యం పొందిన నిపుణులు, దేశ విదేశాలలో తమ తమ రంగాలలో అగ్రస్థానంలో ఉన్న తెలుగు వారు చాలా మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సున్నితత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం దీనిని యధాతధంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే… వైజాగ్ లో మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి, కృషి చేస్తుందని విశ్వసిస్తున్నాను.
*లక్ష్మీనారాయణ రాజీనామాపై స్పందించిన పవన్ కల్యాణ్.*
లక్ష్మీనారాయణ మనోభావాలను గౌరవిస్తున్నానాకు పాల ఫ్యాక్టరీలు, గనులు, పవర్ ప్రాజెక్టులు లేవురాజీనామాకు ముందు ఇవన్నీ తెలుసుకుని ఉంటే బాగుండేదిసీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన మనోభావాలను గౌరవిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లేవని పేర్కొన్నారు. అత్యధిక జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగినీ కానని స్పష్టం చేశారు. తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని, తన మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని వివరించారు.వారి కోసం, తన కుటుంబం కోసం, పార్టీని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తాను సినిమాలు చేయక తప్పదని స్పష్టం చేశారు. లక్ష్మీనారాయణ రాజీనామా చేయడానికి ముందు ఇవన్నీ తెలుసుకుని ఆ లేఖలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పార్టీకి ఆయన రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా తనకు, జనసైనికులకు ఆయనపై గౌరవం ఎప్పటికీ అలానే ఉంటుందన్నారు.
ఆయనకు శుభాభినందనలు తెలుపుకుంటున్నట్టు పవన్ పేర్కొన్నారు.
*మోదీ-గాడ్సేలది ఒకే భావజాలం
నాథూరామ్ గాడ్సే విశ్వసించే భావజాలాన్నే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశ్వసిస్తారని కాంగ్రెస్ నాయకుడు, కేరళలోని వాయనాడ్ లోక్సభ సభ్యుడు రాహుల్గాంధీ విమర్శించారు. మహాత్ముడి వర్ధంతిని పురస్కరించుకుని గురువారం కాల్పెట్టలో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన ‘రాజ్యాంగ పరిరక్షణ’ ప్రదర్శనకు రాహుల్ హాజరయి ప్రసంగించారు. ‘‘ఈ రోజు ఓ అజ్ఞాని గాంధీ భావజాలాన్ని సవాలు చేయాలని యత్నిస్తున్నారు. నిలువెల్లా ద్వేషం, కోపంతో ఉన్న ఆయన భారతదేశం బలం ఏమిటో కూడా ఆర్థం చేసుకోలేరు’’ అని వ్యాఖ్యానించారు. భారతీయులను తమ పౌరసత్వం నిరూపించుకోవాలని అడగడానికి ఆయనెవరు? అని ప్రశ్నించారు. ఇందుకు ఆయనకు ఎవరు లైసెన్స్ ఇచ్చారని నిలదీశారు.
*భాజపాతో పొత్తు కాంగ్రెస్కు నష్టం: వీహెచ్
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భాజపాతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా నిర్ణయాలతో కాంగ్రెస్కు ముస్లింలు దూరం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. సంబంధిత వ్యవహారంపై సోనియా, రాహుల్గాంధీలను కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. గురువారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒకటి, రెండు సీట్ల కోసం భాజపాతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
*మండలి రద్దులపై జాతీయ విధానం రావాలి
రాష్ట్రాల్లో శాసనమండళ్ల రద్దు అంశంపై జాతీయ స్థాయిలో ఓ విధానం తీసుకురావాలని తెదేపా డిమాండు చేసింది. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తెదేపా తరఫున పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్, లోక్సభ, రాజ్యసభ పక్ష నేతలు రామ్మోహన్ నాయుడు, రవీంద్ర కుమార్ హాజరయ్యారు. అనంతరం గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడారు. ‘అమరావతిలో రైతుల ఆందోళన, ఏపీ విభజన చట్టం అంశాలపై సమావేశంలో మాట్లాడాం. రాజధాని నిర్మాణానికి గత ప్రభుత్వం 29వేల మంది రైతులతో ఒప్పందం చేసుకుంది. దీనిపై న్యాయపరమైన అంశాలనూ విస్మరించి ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులు అంటోంది. మరోవైపు శాసనమండలిని ఎలాగైనా రద్దు చేయాలని భావిస్తోంది. దీనిపై పార్లమెంటులో చర్చిస్తాం. రాష్ట్రంలో 45 రోజులుగా రైతులు శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తుంటే సెక్షన్లను అడ్డు పెట్టుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఎంపీనని చూడకుండా కొట్టి నన్ను అరెస్టు చేశారు. దీనిపై లోక్సభలో హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరాం. ఆందోళన చేస్తూ 22 మంది రైతులు మరణించారని కూడా సమావేశం దృష్టికి తీసుకెళ్లాం’ అని తెలిపారు.
*పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి: కృష్ణయ్య
పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో దిల్లీలోని జంతర్మంతర్ వద్ద గురువారం ప్రదర్శన నిర్వహించిన అనంతరం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు పార్లమెంటులో 14 శాతం ప్రాతినిధ్యం సైతం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.50 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి థావర్చంద్ గహ్లోత్కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. సంఘం నాయకులతో కలిసి కేంద్ర మంత్రిని గురువారం ఆయన కలిశారు. దేశవ్యాప్తంగా 70 కోట్ల మంది బీసీలుంటే.. గత బడ్జెట్లో రూ.1,050 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
*జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా
జనసేన పార్టీ నాయకుడు, సీబీఐ పూర్వపు జాయింట్ డైరెక్టరు వి.వి.లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు గురువారం రాజీనామా లేఖను పంపించారు. ‘పూర్తి జీవితం ప్రజా సేవకేనని, సినిమాల్లో నటించనని మీరు (పవన్ కల్యాణ్) అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయించడంవల్ల మీలో నిలకడైన విధానాలు లేవని తెలుస్తోంది. అందుకే జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నా. విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం పరిధిలో నా వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు, నాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు ధన్యవాదాలు. నేను వ్యక్తిగత స్థాయిలో జనసైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, పౌరులకు అందుబాటులో ఉంటా. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని లేఖలో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
*తుగ్లక్లకు విశాఖ ప్రజల గుణపాఠం
వైకాపా ప్రభుత్వం తమకు ఇంతవరకూ ఏమీ చేయలేదని విశాఖ ప్రజలు చెబుతుండటం సర్కారుకు సిగ్గుచేటని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. విధ్వంసాలు, కూల్చివేతలు, రద్దులతో ఏపీ ప్రతిష్ఠను దెబ్బతీసి పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసిన తుగ్లక్ 2.0లకు విశాఖ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. తన దిష్టిబొమ్మలు కాల్చాలని చూసినా ప్రజలు విజ్ఞులు కాబట్టే వారి కుట్రలను అడ్డుకున్నారని బుధవారం ట్విటర్లో పేర్కొన్నారు. ‘‘ఒక ప్రభుత్వం లేదా పార్టీవల్ల మంచి జరిగితే ప్రజలు ఎప్పటికీ మర్చిపోరనడానికి విశాఖ జిల్లా వెంకోజిపాలెం, పెదజాలరిపేట ఉదంతమే ఉదాహరణ. దిష్టిబొమ్మలు తగలబెడుతుంటే పోలీసులు అడ్డుకోవడం చూశాం. కానీ ప్రజలే ఎదురు తిరిగి దిష్టిబొమ్మ దహనం చేయకుండా అడ్డుకుని నిరసనకారులకు కనువిప్పు కలిగించారంటే అది ప్రజల కోసం తెదేపా పడ్డ కష్టానికి ప్రతిఫలం. నేను చేసిన అభివృద్ధిని గుర్తుంచుకుని నాపై ఇంతటి అభిమానం పెంచుకున్న మత్స్యకార అక్కాచెల్లెళ్లకు ధన్యవాదాలు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
*పీకే’సిన జేడీ(యూ)
ఎన్నికల వ్యూహకర్త, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ (పీకే)ను జేడీ(యూ) బహిష్కరించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ వర్మపైనా వేటు వేసింది. కొంతకాలంగా వీరిద్దరూ పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్కుమార్కు వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జేడీ(యూ) ముఖ్య ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి బుధవారం తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)లను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నీతీశ్ మద్దతివ్వడాన్ని వీరిద్దరూ తీవ్రంగా వ్యతిరేకించారు.
*దిల్లీలో దక్షిణ భారతీయుల ప్రభావం ఎక్కువే
దక్షిణ భారతీయుల ప్రభావం దిల్లీలో ఎక్కువేనని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని దక్షిణ భారత దేశానికి చెందిన వృత్తి నిపుణులు, మేధావులతో భాజపా నేతలు దిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్లో బుధవారం రాత్రి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాంమాధవ్ మాట్లాడుతూ.. దిల్లీ అనగానే పూర్వాంచల్ వాసులే ఎక్కువన్న భావన ఉందని చెప్పారు. వాస్తవానికి రాష్ట్రపతి భవన్ మొదలు ఉద్యోగ భవన్ వరకు ప్రతి చోటా దక్షిణ భారతీయులు ఉన్నారని.. మన సంఖ్య, ప్రభావం ఎక్కువేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అండగా నిలిచారని, శాసనసభ ఎన్నికల్లోనూ అలాగే నిలవాలని కోరారు. దిల్లీలో మొహల్లా క్లీనిక్ల ద్వారా పేదలకు రూ.200 మిగిలితే, కాలుష్యం ద్వారా రూ.2 వేలు హరించుకుపోతున్నాయని విమర్శించారు. సమావేశంలో న్యూదిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తదితరులు పాల్గొన్నారు.
*టీపీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్ వైఫల్యం
టీపీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్కుమార్రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని, అన్ని ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైనా ఆయన వైఖరి మారలేదని రైతు సమన్వయసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, శాసనసభ విప్, ఎమ్మెల్యే బాల్కసుమన్లు ధ్వజమెత్తారు. కుట్రదారుగా పేరున్న కేవీపీ రామచంద్రరావే ఇప్పుడు కాంగ్రెస్కు పెద్దదిక్కుగా మారారని ఎద్దేవా చేశారు. ఆయన్నే టీపీసీసీ అధ్యక్షునిగా నియమించాలని సలహా ఇచ్చారు. తెలంగాణలో జరిగిన నగర, పురపాలక ఎన్నికల్లో తెరాస ఘన విజయంతో కాంగ్రెస్, భాజపాల కళ్లు బైర్లు కమ్మాయని, ఓటమిని ఆ పార్టీలు జీర్ణించుకోలేకున్నాయన్నారు. బుధవారం తెలంగాణభవన్లో వారు విలేకరులతో మాట్లాడారు.
*ప్రచార తారల జాబితా నుంచి అనురాగ్, పర్వేశ్లను తొలగించండి
శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీ తరుముకొస్తున్న తరుణాన భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రచార తారల (స్టార్ క్యాంపెయినర్స్) జాబితా నుంచి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్, ఎంపీ పర్వేశ్ వర్మల పేర్లు తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దిల్లీ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ఇద్దరు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందున వారి పేర్లు ప్రచార తారల జాబితా నుంచి తొలగించాలని ఆదేశాల్లో పేర్కొంది.