Editorials

భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు!

Don't ignore feet when it comes to the act-Telugu sexual health news

కామసూత్ర లాంటి గ్రంథంతో, ఖజురహో, దిల్వారా, అజంతా, ఎల్లోరా శిల్పాలతో ప్రేమ భాషను ప్రపంచానికి పంచిన దేశంలో భారతీయులు మాత్రం ప్రేమగా మాట్లాడడం, తమ భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్నారు. సెక్స్‌ అంటే “పది సెకన్లే ఉండే ఒక ఓవర్ రేటెడ్ అనుభూతి”గా ఇంగ్లీష్ రచయిత సైమన్ రేవెన్ వర్ణించారు. “ప్రాచీన భారతదేశానికి సంబంధించిన శృంగార సాహిత్యం అనువదించే ధైర్యం ఎవరు చేయగలరు?’’ అని ప్రశ్నించారు. నేను అదే ప్రశ్నను “ద ఆర్ట్స్ ఆఫ్ సెడక్షన్” పుస్తకం రాసిన డాక్టర్ సీమా ఆనంద్‌ను అడిగాను. “సైమన్ రేవెన్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా” అన్నాను. దానికి ఆమె “అస్సలు ఒప్పుకోను, నా ఉద్దేశం ప్రకారం సెక్స్ గురించి మన ఆలోచన మారింది. ఎన్నో శతాబ్దాల నుంచీ మనకు ఇది పనికిరానిదని నేర్పిస్తూ వచ్చారు. సెక్స్ చెడ్డదని, అది చేయడం పాపం అని చెప్పారు. కానీ ఎవరూ దానితో లభించే ఆనందం గురించి మాట్లాడరు. 325 ఏలో కాథలిక్ చర్చి తన నియమ నిబంధనల్లో ‘శరీరం పనికిరాని ఒక వస్తువు. శారీరక సుఖం చెడ్డది. దాన్ని పొందాలనే కోరిక రావడమే పాపం’ అని చెప్పింది’’ అని సీమా ఆనంద్ అన్నారు. “సెక్స్ ఒకే ఒక ఉద్దేశం సంతానం పొందడానికి మాత్రమే అని అందులో చెప్పారు. దాదాపు అదే సమయంలో భారతదేశంలో వాత్స్యాయనుడు గంగాతీరంలో కూర్చుని కామసూత్ర రాస్తున్నారు. లైంగిక ఆనందం ఆరోగ్యానికి చాలా మంచిదని, దానిని ఎక్కువ పొందడం ఎలా అనేది చెబుతూ వచ్చారు” అన్నారు సీమ. “పశ్చిమ, తూర్పు ఆలోచనల మధ్య ఇప్పుడు కూడా దాని గురించి ఇంత భిన్నాభిప్రాయాలు ఉండడం నమ్మలేకపోతున్నా. ‘అనంగ్ రంగ్’ గ్రంథం అనువదించిన డాక్టర్ ఎలెక్స్ కంఫర్ట్ ఒక విషయం చెప్పారు. సైమన్ రేవెన్ లాంటి వారి ఆలోచనలను అడ్డుకోవాలంటే ఆకట్టుకునే కళ గురించి ప్రజలకు మరింత బాగా వివరించడం అవసరం అన్నారు”.

*** పురుషుడు అగ్ని అయితే స్త్రీ నీళ్లు
ప్రేమికుల్లోని స్త్రీ, పురుషుల మధ్య చాలా తేడా ఉంటుందని చెబుతారు. వారి లైంగితక అంటే సెక్సువాలిటీ మూలాల్లో భూమి, ఆకాశం అంత తేడా ఉంటుంది. “వాత్స్యాయనుడు పురుషుడి కోరికలను అగ్నిలా వర్ణించారు. అవి తన జననాంగం నుంచి పుట్టి మస్కిష్తం వైపు వెళ్తాయి. అగ్నిలా ఎంత వేగంగా రాజుకుంటాయో, అంతే సులభంగా చల్లారిపోతాయి. కానీ స్త్రీ కోరికలు దానికి భిన్నంగా నీళ్లలా ఉంటాయి. అవి ఆమె తల నుంచి ప్రారంభమై కింది వైపు వస్తాయి. వాటిని తట్టిలేపేందుకు ఆమెకు పురుషుల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అవి ఒకసారి మొదలైతే, వాటిని చల్లార్చడానికి కూడా చాలా సమయం పడుతుంది అని చెప్పారు” అంటారు సీమా ఆనంద్. “స్త్రీ, పురుషులు ఉన్నచోట అలాగే ఉండిపోతే, వారి కోరికల కలయిక ఎప్పటికీ సాధ్యం కాదు. అందుకే పురుషులు మహిళలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే పురుషుడు ఆమె నరనరాల్లో ఉత్తేజం తీసుకురాగలడు. పుస్తకంలో ఈ విషయం గురించి రాయడం వెనుక నా ఉద్దేశం కూడా అదే. ఆకట్టుకోవడం అనే కళ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి” అని సీమా ఆనంద్ చెప్పారు. సెక్స్ గురించి చాలా పరిశోధనలు చేసిన భారతదేశ ప్రముఖ సెక్సాలజిస్టుల్లో ఒకరైన డాక్టర్ ప్రకాశ్ కొఠారీ.. స్త్రీ, పురుషుల ప్రేమలో తేడాలను మరోలా చెబుతారు. “పురుషుడు సెక్స్ కోసం ప్రేమను అందిస్తాడు. అదే సమయంలో సెక్స్ అందించే స్త్రీ ఆ ప్రేమను పొందే ప్రయత్నం చేస్తుంది. భారతదేశం విషయంలో ఇది నూటికి నూరుపాళ్లూ నిజం” అన్నారు.

*** సెక్స్‌లో సువాసనకు ప్రాధాన్యం
స్త్రీ, పురుషుల సంబంధాల్లో శరీరంపై సువాసనలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఒక స్త్రీ పురుషుడిని ఆకర్షించాలంటే, ఆమె తన కురులను సవరిస్తూ వెళ్తుంది. తన వెనక ఒక ప్రత్యేకమైన సుగంధాన్ని వదులుతుంది. “నాకు వట్టివేళ్ల వాసన అంటే ఇష్టం. అది వేడెక్కిన నేలపై తొలకరి జల్లులు పడితే వచ్చే మట్టి వాసనలా ఉంటుంది. స్త్రీలు తెల్లవారుజామునే ఆ వట్టివేళ్ల నూనెను కాస్త తలకు రాసుకుని, తడి జుట్టును అల్లుకునేవారు. మెడకు మల్లి లేదా సంపంగి పూల అత్తరు రాసేవారు. కుచాలను కుంకుమ పువ్వు, లవంగ తైలంతో మాలిష్ చేసుకునేవారు” అని సీమా చెబుతారు. “వాటితో సువాసన రావడమే కాదు, చర్మం రంగులో కూడా ఒక మెరుపు వస్తుంది. ఆ అత్తరు ఒక్కో శరీరానికి ఒక్కో సువాసనను అందిస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం” అని చెప్పారు. సీమా ఆనంద్ ఒక సలహా కూడా ఇస్తారు. మహిళలు తమ హ్యాండ్‌బాగ్‌లో కూడా పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకోవాలని సూచిస్తున్నారు.

*** పాదాలతో ప్రేమించే కళ
స్త్రీ, పురుషుల శారీరక సంబంధాల్లో పాదాలు కూడా చాలా కీలక పాత్ర ఉంటుంది. ఇది చాలా తక్కువమందికి తెలుసు. ఆకర్షించే కళలో పాదాలు చాలా ప్రత్యేకం. అందుకే మహిళలు ముఖం కంటే ఎక్కువగా తమ పాదాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం అంటారు సీమా. “మన నర్వ్ ఎండిగ్స్ అన్నీ పాదాల్లోకి వెళ్లి ముగుస్తాయి. శరీరంలోని చాలా సున్నితమైన అంగాలు కూడా పాదాలే. ఈమధ్య మనం మన పాదాలను హైహీల్స్‌లో ఇరికించేస్తున్నాం. మీరు ఎవర్నైనా మీ పాదాలతో ఆకర్షించాలంటే కూర్చుని, మీ చెప్పులు తీయండి, పాదాలను అటూఇటూ తిప్పండి. వాటిని చూపించండి. శరీరంలోని అందమైన భాగాల్లో మన పాదాలూ ఉన్నాయి.” “చాలా మంది ముఖానికి చాలా మేకప్ వేసుకుంటారు. చేతులకు మెనిక్యూర్ చేయించుకుంటారు. కానీ పాదాలను మాత్రం పట్టించుకోరు. మడమలు పగిలిపోయినా చూసుకోరు. పాదాలను ఎప్పుడూ అందంగా ఉంచుకోడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ శరీరంలోని సెక్సీ అవయవాలు అవే” అంటారు సీమ.

*** సెక్స్‌-ఆహారం లింకు

శ‌ృంగారానికి, తినడానికి కూడా ఒక ప్రత్యేక బంధం ఉంది. మీరు ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎలా తింటున్నారు అన్నవాటికీ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వాటి ప్రభావం ఎంతోకొంత ఉంటుంది. ‘‘మీరు సెక్స్ ముందు భోజనం చేస్తే, మన స్పందనలు మెల్లగా ఉంటాయి. మీ శరీరంలోని మొత్తం శక్తి ఆహారాన్ని జీర్ణం చేసుకోడానికే సరిపోతుంది. ఇక సెక్స్ కోసం శక్తి, ఆసక్తి ఉండదు’’ అంటారు సీమ. ‘‘ఎప్పుడూ సెక్స్ తర్వాతే భోంచేయాలి. మంచి భోజనం తినాలి. ఆ సమయంలో ప్రియురాలు తన ప్రియుడికి చాలా ప్రేమగా తినిపించాలని వాత్స్యాయనుడు చెబుతారు. వారు ప్రతి పదార్థాన్ని రుచిచూస్తారు. దానిని తన ప్రియురాలి నోటికి అందిస్తాడు. ‘మేం డేట్‌పై వెళ్తున్నాం, ఏదైనా మంచి రెస్టారెంట్‌లో తింటాంలే’ అనే మాట మనం తరచూ అంటుంటాం. కానీ భోజనం ఎంత రుచిగా ఉన్నా, వారు ఎంత బాగా మాట్లాడుకున్నా, ఎంత ఫ్లర్టింగ్ చేసినా, ప్రేమికులకు శ‌ృంగార ఆలోచనలు దరిచేరవు. ఎందుకంటే అలా తిన్న తర్వాత వారి శరీర సామర్థ్యంపై భోజనం ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే శృంగారానికి ముందు కాకుండా.. అది ముగిసిన తర్వాతే భోజనం చేయాలి’’ అని సీమా తెలిపారు.