Movies

ధనుష్ కారణమని ఆరోపణ

Dhanush Is The Reason Behind Amalapaul's Divorce

ప్రముఖ నటి అమలాపాల్‌, దర్శకుడు ఏఎల్‌ విజయ్‌కు మధ్య విడాకులకు నటుడు ధనుషే కారణమని విజయ్‌ తండ్రి నిర్మాత ఏఎల్‌ అలగప్పన్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన తాజాగా స్థానిక మీడియా వారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా విజయ్‌-అమలాపాల్‌ మధ్య విడాకులు జరగడానికి గల కారణాన్ని తెలియచేశారు. ‘పెళ్లి తర్వాత అమలాపాల్‌ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో ధనుష్‌ తన నిర్మాణ సంస్థలో తెరకెక్కించబోయే ‘అమ్మ కనక్కు’ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. అమలాపాల్‌ కూడా ఆ సినిమా చేయడానికి సిద్ధపడింది. దీంతో విజయ్‌, అమలా విడాకులు తీసుకుని విడిపోయారు.’ అని అలగప్పన్‌ ఆరోపించారు. దీంతో కోలీవుడ్‌ మొత్తం అలగప్పన్‌ ఆరోపణల గురించి చర్చించుకుంటోంది.