NRI-NRT

సీఎం రమేశ్-తాళ్లూరి వారింట పెళ్లిసందడి ప్రారంభం

Talluri-CM Ramesh Family Wedding At Hitex

భాజపా రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్, లూసియానాకు చెందిన ప్రవాసాంధ్రుడు డా.తాళ్లూరి రాజాశ్రీకృష్ణ-గాయత్రిదేవిల కుమార్తె పూజితల వివాహ వేడుక శనివారం రాత్రి విందు కార్యక్రమంతో  హైదరాబాద్‌లోని GMR ఎరీనాలో ఘనంగా ప్రారంభమయింది. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, మాజీ అధ్యక్షులు కోమటి జయరాం, వేమన సతీష్, నాదెళ్ల గంగాధర్, సినీ నిర్మాతలు అశ్వనీదత్, ఎర్నేని నవీన్, టి.సుబ్బిరామిరెడ్డి, ఎంపీ సుజనా చౌదరి, రామ్మోహననాయుడు, తెదేపా నుండి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, కాంగ్రెస్ నుండి రేవంత్‌రెడ్డి, ప్రవాసులు గుత్తికొండ శ్రీనివాస్, వల్లేపల్లి శశికాంత్, బొబ్బా రాం, వలివేటి బ్రహ్మాజీ, మందలపు రవి, తాళ్లూరి రాం, కోయా హరీష్ తదితరులు పాల్గొన్నారు. 7వ తేదీన వివాహ కార్యక్రమం హైటెక్స్‌లో నిర్వహించనున్నారు.