NRI-NRT

హ్యూస్టన్‌లో నాట్స్ బాలల సంబరాలు

NATS Houston Conducts Childrens Day 2020

నాట్స్ హ్యూస్టన్ లో బాలల సంబరాలు నిర్వహించింది. హ్యూస్టన్ రాష్ట్రంలోని మిస్సోరిలో చిన్నారులకు మ్యాథ్స్ ఛాలెంజ్, తెలుగు మాట్లాట, స్పెల్లింగ్ బీ పోటీలు నిర్వహించింది. 8 ఏళ్ల లోపు చిన్నారులను జూనియర్, సీనియర్ల విభాగాలుగా విభజించి ఈ పోటీలు నిర్వహించింది. మూడు విభాగాలలోను దాదాపుగా 120 మంది పిల్లలు తమ ప్రజ్ఞపాటవాలను ప్రదర్శించారు. వీటిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి నాట్స్ బహుమతులు అందచేసింది..హ్యూస్టన్, గ్రేటర్ హౌస్టన్ నుండి దాదాపుగా 300 పైగా తెలుగువారు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నాట్స్ సౌత్ సెంట్రల్ కోఆర్డినేటర్ హేమంత్ కొల్ల, ఐ లెవెల్ లెర్నింగ్ సెంటర్, సిలికాన్ ఆంధ్ర మనబడి, నాట్స్ హౌస్టన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ కాకుమాను, హ్యూస్టన్ నాట్స్ కోర్ కమిటీ సభ్యులు వీరూ కంకటాల, చంద్ర తెర్లి , విజయ్ దొంతరాజు, తెలుగు భవనం, హ్యుస్టన్ తెలుగు సాంస్కృతిక కమిటీ (టీసీఏ), తెలంగాణ గ్రేటర్ హౌస్టన్ సంఘం (టీఏజీహెచ్) తదితరులు ఈ కార్యక్రమం విజయవంతయ్యేందుకు కృషి చేశారు.