Movies

పైలట్‌గా పాయల్

Payal Rajput As Pilot-Telugu Movies News

అమాయకుడైన భారతీయ బాక్సర్ పాకిస్థాన్ జైలులో ఎలా బందీ అయ్యాడు? అక్కడి నుండి ఎలా తప్పించుకున్నాడు? అన్న థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న చిత్రం ‘నరేంద్ర’. ఈషాన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. జయంత్ సి పరాన్జి దర్శకుడు. హీరోగా పరిచయమవుతున్న నీలేశ్ పాకిస్థాన్ జైల్లో ఖైదీ అయిన మాజీ బాక్సర్గా, పాయల్ రాజ్పుత్ ఇండియన్ ఫస్ట్ ఫీమేల్ ఫైటర్ పైలట్గా నటిస్తున్నారు.ఇసాబెల్లా లియేటి స్వఛ్చా పోరాటానికి మద్దతు ఇచ్చే మానవ హక్కుల కార్యకర్త పాత్ర పోషిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విరేన్ తంబిదొరై, సంగీతం: రామ్ సంపత్.