Business

ఋణాలు తిరిగి చెల్లించనందుకు బ్యాంకు నోటీసులు

Balakrishna's Second Son-In-Law Gets Bank Notices For Non-Repayment Of Loans

బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు తెదేపా నేత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఆయన కుటుంబీకులకు బ్యాంకు నోటీసులు వెళ్ళాయి./ హైదరాబాద్ అబీడ్స్ లోని కరూర్ వైశ్యా బ్యాంకు నుంచి టెక్నో యూనిక్ ఇన్ ఫ్రాటేక్ ప్రేవేట్ లిమిటెడ్ పేరిట గతంలో రుణాన్ని తీసుకున్న వీరు దాన్ని తిరిగి చెల్లించలేదని తెలుస్తోంది. ఈ విషయంలో వారిని పలుమార్లు సంప్రదించినా, ప్రయోజనం లేకపోయిందని బ్యాంకు వర్గాలు అంటున్నాయి. దీంతో వారికి నోటీసులు పంపించామని తదుపరి ఆస్తులను జప్తు చేసే కార్యక్రమాలను కోర్టు అనుమతితో ప్రారంభిస్తామని ఓ అధికారి వెల్లడించారు. కాగా ఈ నోటీసులు శ్రీభరత్ తో పాటు ఆయన తండ్రి పట్టాభిరామారావు ఆయన సోదరుడు లక్షమనరావు తదితరులు పేరిట జారీ అయినట్టు సమాచారం. బ్యాంకు నుంచి తీసుకున్న అసలు దానికి వడ్డీ మొత్తం కలిపి 124.39 కోట్లు అయిందని వెంటనే దాన్ని చెల్లించాలని ఈ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.