Business

గంగా-యమునల మధ్య రైల్వే యాత్ర

indian-railway-ganga-yamuna-yatra-telugu-business-news

ఆధ్యాత్మిక ఆనందం కోరుకునే వారి కోసం భారతీయ రైల్వే టూరిజం, క్యాటరింగ్ సంస్థ (ఐఆర్సీటీసీ) గంగా-యమున యాత్రకు పచ్చజెండా ఊపింది. ఈ యాత్రలో గంగా, యమున తీరాన ఉన్న పుణ్యధామాలు దర్శించుకోవచ్ఛు రేణిగుంట నుంచి మొదలయ్యే భారత్ దర్శన్ రైలు.. నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, కాచిగూడ, కాజీపేట, రామగుండం స్టేషన్లలో యాత్రికులను ఎక్కించుకుంటుంది.
ఎప్పుడు?: ఫిబ్రవరి 25 (24 అర్ధరాత్రి 12.05 గంటలకు)
ఎన్ని రోజులు?: 10 రాత్రులు- 11 పగళ్లు
చూపించే ప్రదేశాలు: ఆగ్రా, మథుర, దిల్లీ, హరిద్వార్, ప్రయాగ్రాజ్, వారణాసి, గయ
ప్యాకేజీ ధర: స్లీపర్ క్లాస్ రూ.10,395, ఏసీ త్రీ టైర్ రూ.12,705
సంప్రదించాల్సిన ఫోన్నెంబర్లు
హైదరాబాద్: 040 27702407, 82879 32227/28/29/30
విజయవాడ: 0866 2572280, 82879 32311/12
తిరుపతి: 0877 2222010, 82879 32313/17
*మరిన్ని వివరాలకుwww.irctctourism.com వెబ్సైట్ని చూడండి.