Agriculture

నేలకు తగిన ఎరువుల ఎంపిక ఇలా

Telugu Agriculture News-How To Pick Fertilizer According To Soil Type

* మొక్కలకు ముఖ్య పోషకం నత్రజని. ఇది యూరియా, అమోనియం సల్ఫేటు, కాల్షియం నైట్రేట్‌ రూపాల్లో లభిస్తుంది. దీన్ని ఇసుక పాలు ఎక్కువగా ఉన్న నేలల్లో తప్ప మిగతా అన్ని నేలల్లో పైపాటుగా వేయవచ్చు.
* నైట్రో ఫాస్ఫేట్‌ మెట్ట పంటలకు, ఎర్ర నేలలకు, కొద్దిపాటి ఆమ్లగుణం గల నేలలకు మేలు కలిగిస్తుంది.
* మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను పాల చౌడు నేలలకు తప్ప, మిగిలిన అన్ని నేలలకు వాడవచ్చు.
* సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (సూటి ఎరువు), అమోనియం ఫాస్ఫేట్‌ (కాంప్లెక్స్‌ ఎరువు)ను అన్ని నేలలకు, అన్ని పైర్లకు వేయవచ్చు.
* పైరును బట్టి నత్రజనిని 2-4 సార్లు, భాస్వరాన్ని ఒకేసారి ఆఖరి దుక్కిలో వేయాలి. పొటాష్‌ను పంటలకు రెండుసార్లు వేయాలి.