Business

చైనాకు నిధుల విడుదలకు ప్రపంచబ్యాంకు అనాసక్తి

World Bank Reluctant To Release Funds To China

కరోనా వైరస్‌తో విలవిలలాడుతున్న చైనాకు సహాయాన్ని అందించండంపై ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని దేశాలు చైనాకు సాయం అందిస్తామని ప్రకటిస్తుండగా మరికొన్ని మాత్రం ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తాజాగా ప్రపంచ బ్యాంకు కూడా చైనాకు సాయం చేస్తామని ప్రకటించింది. అయితే అది కేవలం సాంకేతిక అంశాల్లో మాత్రమే అని తెలిపింది. ఆరోగ్య సంక్షోభాల నుంచి ఎలా బయటపడాలనే అంశంపై సలహాలు ఇస్తామని పేర్కొంది. ఆర్థిక సహాయం అందించే ఆలోచన లేదని..దీనికి ప్రత్యేకంగా ఎలాంటి రుణాలు మంజూరు చేయడం లేదని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మాల్‌పాస్‌ ప్రకటించారు. ఆ దేశానికి ఉన్న విస్తృత ఆర్థిక వనరుల దృష్ట్యా తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఆ దేశానికి సహాయం అందిచడంలో భాగంగా ఇప్పటికే తమ బ్యాంకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా…వుహాన్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలో స్థానికంగా సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు ఇద్దరు స్థానిక అధికారులపై చైనా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు చైనా మీడియా తెలిపింది.