DailyDose

తమిళనాట రావాలి విజయ్…కావాలి విజయ్-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Actor Vijay Jagan And Prashanth Kishore

* తమిళనాడులో ఏపీ సీఎం జగన్‌ పోస్టర్లు.. హీరో విజయ్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర చర్చ. ఆంధ్రాను కాపాడమని విజయ్‌కు జగన్‌, పీకే చెబుతున్నట్లు పోస్టర్లు. విజయ్‌ కూడా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్నట్లు వ్యాఖ్యలు. తమిళనాడుని విజయ్‌ కాపాడాలంటోన్న అభిమానులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బొమ్మ ఉన్న పలు పోస్టర్లు తమిళనాడులో వెలిశాయి. ‘రావాలి విజయ్..కావాలి విజయ్’ అనే నినాదంతో సినీ హీరో విజయ్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఆయన అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ పోస్టర్లలో జగన్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉండడం గమనార్హం. వీరిద్దరు కలిసి విజయ్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లు ఆ పోస్టర్లు ఉన్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అనంతరం జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాము ఏపీకి కాపాడుకున్నామని, ఇప్పుడు తమిళనాడును కాపాడుకోవడానికి విజయ్‌ కావాలని జగన్, పీకే కలిసి విజయ్‌కు చెబుతున్నట్లు ఈ పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి.
కాగా, ఇప్పటికే ప్రశాంత్‌ కిశోర్‌తో విజయ్‌ చర్చలు జరిపాడన్న ప్రచారం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై పదే పదే మండిపడుతోన్న విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి సామాజిక మాధ్యమాల్లో వైఎస్‌ జగన్‌ బొమ్మ ఈ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. వీటిపై పలువురు ప్రశంసలు గుప్పిస్తుండగా, కొందరు విమర్శలు చేస్తున్నారు.
* దిల్లీ చేరుకున్న సీఎం జగన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దుతో పాటు మండలి వ్యవహారాన్ని ప్రధానికి సీఎం వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించేలా సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది.
* పవన్ కల్యాణ్ గో బ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకుల నినాదాలతో అంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు.దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూల్‌కు చేరుకున్న పవన్, సుగాలి ప్రీతి కేసులో నిందితులకు శిక్ష పడాలంటూ నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ముందుగా అనుకొన్న సమయం ప్రకారం ఈ మధ్యహ్నం 3 గంటలకే ప్రారంభం కావాల్సిన ర్యాలి 4:30pm కు మొదలు అయింది.
* జ‌మ్మూక‌శ్మీర్‌లో విదేశీ ప్ర‌తినిధులు టూర్ చేస్తున్నారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత శ్రీన‌గ‌ర్‌కు విదేశీ బృందం రావ‌డం ఇది రెండ‌వ సారి. ఇవాళ సుమారు 25 మంది విదేశీ దౌత్య‌వేత్త‌లు క‌శ్మీర్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. దాల్ స‌రస్సులో వారంతా విహ‌రించారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత‌.. జ‌మ్మూక‌శ్మీర్ స్తంభించిపోయింది. అయితే అక్క‌డ ఎటువంటి ఆంక్ష‌లు లేవ‌ని నిరూపించేందుకు ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీనిలో భాగంగా విదేశీ దౌత్య‌వేత్త‌ల‌ను క‌శ్మీర్‌కు తీసుకువ‌స్తున్నారు.
ప‌ర్యాటకాన్ని ప్రోత్స‌హించాల‌న్న ఉద్దేశంతో ఈ చ‌ర్య‌లు చేప‌ట్టారు.
* ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్‌ ఈనెల 14వ తేదీన హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసులో హైకోర్టు ఇవాళ స్పందించింది. రెండ్రోజుల గడువుతో హైకోర్టుకు హాజరు కావాలని నిర్దేశించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ గతంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలైంది. ఆ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలిచ్చింది. జ్యూడిషియల్ విచారణ జరపాల్సిందిగా విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జిని నియమించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విశాఖ సీనియర్ సివిల్ జడ్జి న్యాయవిచారణ పూర్తి చేశారు. అనంతరం ఆయన నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేశారు. విశాఖ సీనియర్ సివిల్ జడ్జి నివేదికను పరిశీలించిన అమరావతి హైకోర్టు ధర్మాసనం నివేదికాంశాల ఆధారంగా ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్‌ను ఈనెల 14వ తేదీన ధర్మాసనం ఎదుట హాజరు కావాలని, సంబంధిత వివరాలతో వివరణ ఇచ్చేందుకు సిద్ధం కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
* గుంటూరు జిల్లా పొన్నూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర బుధవారం ధర్నాకు దిగారు. మండలంలో పెన్షన్లు తొలగించిన బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తొలగించిన పెన్షన్లను తక్షణమే పునరుద్ధరించాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.
* ధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకం కింద రైతులకు మూడు దఫాలుగా రూ.వేల చొప్పున విడుదల చేస్తున్న నిధులను ఒకే విడతగా ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఒకేలా అమలు చేస్తున్నందున ఏపీని ప్రత్యేకంగా చూడలేమని కేంద్రం సృష్టం చేసింది.
* తిరుపతిలో జిల్లా జడ్జికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. జడ్జి ఆనంద్‌‌కు సంబంధించిన కారు అగ్నికి ఆహుతి అయ్యింది. కారు స్టార్ట్ చేసిన వెంటనే మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ జడ్జిని కిందకి దించేశాడు. జడ్జికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
*గుంటూరు జిల్లా పొన్నూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర బుధవారం ధర్నాకు దిగారు. మండలంలో పెన్షన్లు తొలగించిన బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తొలగించిన పెన్షన్లను తక్షణమే పునరుద్ధరించాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.
*గుంటూరు జిల్లా పొన్నూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర బుధవారం ధర్నాకు దిగారు. మండలంలో పెన్షన్లు తొలగించిన బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తొలగించిన పెన్షన్లను తక్షణమే పునరుద్ధరించాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.
*ఈనెల 16వతేదీన ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేజ్రీవాల్ కాసేపట్లో ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు…
*రాజధాని గ్రామాల్లో ఆందోళనలు 57వ రోజుకు చేరుకున్నాయి. మందడం గ్రామం నుంచి 170 మంది రైతులు, మహిళలు షిర్డీ సాయినాధుని దర్శనానికి బయలుదేరి వెళ్లారు. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని మొక్కుకునేందుకు రైతులు, మహిళలు షిర్డీకి వెళ్లారు.
*జాతీయ పౌర పట్టిక(ఎన్సార్సీ) వెబ్‌సైట్‌ నుంచి అసోం పౌరుల తుది జాబితాకు సంబంధించిన డేటా గల్లంతైంది. అయితే సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. కాగా.. ఐటీ సంస్థతో కాంట్రాక్టును పునరుద్ధరించకపోవడంతో డేటా గల్లంతైందని ఎన్నార్సీ అధికారులు చెబుతున్నారు.
*ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సమావేశం ప్రారంభమైంది. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణ చేసే అంశంపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో మద్యం, నగదు పంచుతూ పట్టుబడితే వెంటనే అభ్యర్థి డిస్ క్వాలిఫై అయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం కుదింపుపై కేబినెట్ లో చర్చించనున్నారు.
*ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు సుభాష్ చోప్రా రాజీనామా చేశారు. 2015వ సంవత్సరంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 9.7 శాతం ఓట్లు రాగా, ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఓట్ల శాతం 4.27 శాతానికి తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు సుభాష్ చోప్రా చెప్పారు…
*దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ కాన్వాయ్‌పై మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఆ దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్‌ యాదవ్‌ గుడికి వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ కార్యకర్త మృతి చెందగా, మరో కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై ఆప్‌ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడతూ.. ఈ ఘటన జరగటం చాలా దురదృష్టకరం. ఈ దాడి ఎందుకు జరిగిందో నాకు తెలియదు. నాపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా ఆ దుండగుడిని గుర్తించి పట్టుకోవాలి అని ఆయన అన్నారు. నరేష్‌ యాదవ్‌ మెహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు జరగటం ఢిల్లీలో చర్చనీయం అంశంగా మారింది..
*పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే పాలిసెట్ – 2020 నోటిఫికేషన్ను మార్చి 2న జారీ చేయనున్నారు. ఏప్రిల్ 17న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్టు సాంకేతిక బోర్డు అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. అర్హులైన పదో తరగతి విద్యార్థులు.. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు
*రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పాఠశాలలోనూ ఆంగ్ల ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కడప జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి ‘ఇన్స్పైర్ మనాక్ 2019-20’ వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
*పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-4) ఉద్యోగాల ప్రధాన రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం వెల్లడించింది. ర్యాంకుల జాబితాలను జిల్లా కలెక్టర్లకు పంపనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో గరిష్ఠ మార్కులు 210.66, 210.64గా నమోదయ్యాయి. కడప, అనంతపురం జిల్లాల్లో కనిష్ఠంగా 173.7, 187.31 మార్కులు వచ్చాయి. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయి.
*చీమకుర్తి మైనింగ్ క్లస్టర్లో అన్ని రకాల వాయు కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ బీఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు. రెండో దశలో రాష్ట్రంలోని 22 మైనింగ్ క్లస్టర్లలోనూ ఇదే నమూనాను అమలు చేస్తామని చెప్పారు. విజయవాడలోని పీసీబీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం కాలుష్య నియంత్రణపై చర్చా వేదిక జరిగింది.
*గురు రాఘవేంద్ర ప్రాజెక్టులోని తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు నిర్వహణ వ్యయం కింద 2019-20 సంవత్సరానికి రూ.27.06 కోట్లు మంజూరు చేస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. హైటెన్షన్ విద్యుత్తు ఛార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఈ నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
*రాష్ట్రంలోని మైనర్ మినరల్స్ లీజుదారులు పర్మిట్లు పొందేందుకు చెల్లించే సుంకాన్ని (సీనరేజ్) పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 48 రకాల మైనర్ మినరల్స్ సీనరేజ్ పెంచారు. దీని ప్రకారం… బిల్డింగ్ స్టోన్ క్యూబిక్ మీటర్ రూ.90, తెల్ల సున్నపురాయి మెట్రిక్ టన్నుకు రూ.120, మార్బుల్ క్యూబిక్ మీటర్కు రూ.300, క్వార్ట్జ్, క్వార్ట్జైట్ మెట్రిక్ టన్నుకు రూ.90, రహదారి కంకర క్యూబిక్ మీటర్కు రూ.35, ఇసుక మెట్రిక్ టన్ను రూ.100కు సుంకాలు పెరిగాయి. ఇవన్నీ మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని గనులశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామ్గోపాల్ పేర్కొన్నారు.
*విశాఖలోని విలువైన కార్తీకవనం భూముల లీజు విషయంలో రివర్స్ టెండరింగ్కు వెళ్తే బాగుంటుందని శాసన మండలి కమిటీ సభ్యులు బాబూ రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వరరావు, ఎస్.రామకృష్ణ సూచించారు. మంగళవారం కమిటీ సభ్యులు విశాఖ మహానగర అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డీఏ) అధికారులతో సమావేశమయ్యారు. భూసమీకరణ గురించి మాట్లాడుతూ నిబంధనల్ని ఏవిధంగా పాటిస్తున్నారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను సమీకరించడం ఎంతవరకు సమంజసమన్నారు.
*అనంతపురం జేఎన్టీయూలో ఈ నెల 13, 14వ తేదీల్లో సాంకేతిక విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సదస్సు నిర్వహించనున్నారు. అఖిలభారత సాంకేతిక విద్యామండలి ఛైర్మన్ సహస్ర బుద్దే, భారత విశ్వవిద్యాలయాల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పంకజ్ మిట్టల్, ఎన్బీఏ ఛైర్మన్ అగర్వాల్ తదితరులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 65 మంది ఉపకులపతులు హాజరు కానున్నారని ఉపకులపతి శ్రీనివాస్కుమార్ తెలిపారు.
*కొత్త రాజధాని ప్రాంతంలో ప్రాచీన భాండాగారం(ఆర్కివ్స్) బలోపేతం చేసేందుకు నిపుణుల కమిటీని నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ రామకృష్ణ, ఆంధ్రా వర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కేశవనారాయణ, శ్రీవేంకటేశ్వర వర్సిటీ చరిత్ర విభాగం విశ్రాంత అధిపతి రామచంద్రారెడ్డి, సభ్య-కన్వీనర్గా రాజ్యాభిలేఖ సంచాలకులు రంగరాజ్ ఉన్నారు.
*అనంతపురం జిల్లాలో పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు స్మారక జిల్లా పురావస్తు మ్యూజియం నిర్మాణానికి రూ.3.71కోట్లు విడుదల చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
*ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల నియామక ప్రధాన పరీక్షలు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో జరగనున్నాయి. 13 జిల్లాల్లో 39 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాల కోసం 0866-2527820, 0866-2527821 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
*రాష్ట్ర రాజధాని అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మంగళవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ విషయంలో కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని పేర్కొన్నారు.