ScienceAndTech

క్లౌడ్ సాయంతో హీరో బైకులు కనిపెడతారు

Hero Motors To Use Cloud Monitoring To Identify Bikes

హీరో మోటోకార్ప్‌ క్లౌడ్‌ ఆధారిత ‘కనెక్టెడ్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌’ సేవల్లోకి అడుగుపెట్టింది. తొలుత ఎక్స్‌పల్స్‌ 200, ప్లెజర్‌+, పాషన్‌ ఎక్స్‌ప్రో, హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ మోడళ్లతో ఈ సేవల్ని పరిచయం చేసింది. ‘హీరో కనెక్ట్‌’ కార్యక్రమం కింద ఖాతాదార్లకు పలు భద్రతా సౌకర్యాలు కల్పించబోతోంది. ఇందులో లైవ్‌ ట్రాకింగ్‌, టాపుల్‌ అలర్ట్స్‌, టో అవే అలర్ట్‌, జియో ఫెన్స్‌ అలర్ట్‌ వంటి పలు సౌకర్యాలు లభిస్తాయి. పరిచయ ధర కింద రూ.4,999కే ఏడాది పాటు ‘హీరో కనెక్ట్‌’ సేవలు పొందొచ్చు. తొలుత నోయిడా, దిల్లీ, పుణె నగరాల్లో ఎంపిక చేసిన డీలర్ల వద్ద ఈ సేవలు పొందొచ్చు.