Politics

ప్రాంతీయ పార్టీలపై కేటీఆర్ వ్యాఖ్య

KTR Wishes Regional Parties Strengthen More

టైమ్స్‌ నెట్‌వర్క్‌ నిర్వహించిన ‘యాక్షన్‌ ఫర్‌ ఇండియా’ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర, కేంద్రంతో సంబంధాలు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం మరింత ఉదారంగా వ్యవహరించాలని హితవు పలికారు. దక్షిణాది రాష్ట్రాల్లో జాతీయ పార్టీల ఉనికే లేదని.. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలు మరింత బలపడతాయని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. కేంద్రంతో రాష్ట్రాలకు ఉండే సంబంధాలను నెరుపుతూనే అంశాల వారీగా విభేదించామని వివరించారు. సీఏఏ విషయంలోనూ వ్యతిరేకించినట్లు కేటీఆర్‌ గుర్తు చేశారు.