Fashion

మీ రిమోట్ శుభ్రం చేయకపోతే చచ్చిపోతారు

Clean your remote to stay healthy-Telugu home decor news

ఇంట్లో ఉండే వీటిని క్లీన్ చేయకపోతే కచ్చితంగా జబ్బులు వస్తాయి..

ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అందులో నివసించే వారూ అంతే ఆరోగ్యంగా ఉంటారు. ఇంటిని సరిగా శుభ్రం చేయకపోతే వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే.. వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఇంటిని శుభ్రపరిచేటప్పుడు, మనలో చాలామంది సాధారణంగా పెద్ద పనులపై శ్రద్ధ చూపుతాము మరియు కనిపించే ధూళిని శుభ్రం చేస్తాం. కానీ చాలా ప్రాంతాలలో ఘోరమైన బ్యాక్టీరియాకు నిలయంగా ఉన్నాయి. ఇంట్లో ప్రతిసారీ ఈ వస్తువులను ఉపయోగిస్తాము కానీ వాటిని శుభ్రం చేయడం మర్చిపోతాము. వాటి వల్ల తీవ్రమైన అనారోగ్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్న వాటిని శుభ్రం చేయటం మర్చిపోతే వాటి వల్ల అనేక అనారోగ్యాలు వస్తాయి. అందుకే ఇప్పుడే వాటిని శుభ్రం చేయండి…

​రిమోట్ కంట్రోల్

ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే వాటిలో రిమోట్ కంట్రోల్ ఒకటి . ఎయిర్ కండీషనర్, టెలివిజన్ లేదా మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరంమైనా దానికి రిమోట్ కంట్రోల్స్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే, మనలో చాలా మంది టీవీ, ఎయిర్ కండీషనర్ లను శుభ్రం చేస్తాం కానీ వాటి రిమోట్ లను శుభ్రం చేయము. వీటిని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఎందులకంటే రిమోట్ అందరి చేతుల్లో ఉంటుంది. కనుక వాటిపై క్రీములు ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి. అందువల్ల వీటిని శుభ్రం చేయకపోవటం వల్ల రిమోట్ పై ఉండే క్రిములు అనేక అనారోగ్యాలను కలిసాగిస్తాయి. వీటి వల్ల క్లిష్టమైన అనారోగ్యా పరిస్థితులకు కూడా కారణం కావచ్చు. అందుకే ఇప్పుడే రిమోట్ ను శుభ్రం చెయ్యండి.

​సెల్ ఫోన్లు

ప్రస్తుతం అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఉదయం లేచిన దగ్గిర నుంచి రాత్రి పడుకునే వరకు మనం సెల్ ఫోన్ల తోనే రోజంతా గడిపేస్తాం. అయితే వాటివల్ల అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. సెల్ ఫోన్లు పరిశుభ్రత స్థాయిలలో అత్యంత దుర్భరమైనవని అనేక అధ్యయనాలు మరియు పరిశోధనలు నిరూపించాయి. అందువల్ల మన ఫోన్‌లను దాదాపు ప్రతిరోజూ శుభ్రం చేయాలి. లేదంటే వాటిపై ఉండే క్రిములు హానీ కలిగిస్తాయి. మనలో చాలా మంది ఫోన్లను బాత్రూంలోకి కూడా తీసుకెళ్లడం మరియు బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత చేతులు కడుకున్న తరువాత కూడా ఫోన్లను పట్టుకుంటాం. అందుకే మన ఫోన్లను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

​మేకప్ బ్రష్స్

మనలో అనేక మంది రెగ్యులర్ గ మేకప్ వేస్తుకుంటాం. దానికోసం మేకప్ బ్రష్ లను ఉపయోగిస్తాము. అయితే మేకప్ బ్రష్ లు చర్మ వ్యాధుల బాక్టీరియాకు నిలయం, ఆది మేకప్ అవశేషాల వల్ల అభివృద్ధి చెందుతుంది. మరియు అందువల్ల క్రమం తప్పకుండా వాటిని శుభ్రపరచడం అవసరం. మీ చర్మ ఆరోగ్యాంగా ఉండటానికి మీరు వారానికి ఒకసారైనా వాటిని శుభ్రం చేయాలి.

​కిచెన్ సింక్

ఇంట్లో కిచెన్ శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి కిచెన్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా కిచెన్ సింక్‌ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అందులో అనేక రకాల బ్యాక్టర్యాలు ఉంటాయి. అన్ని జిడ్డైన మరియు సన్నని అవశేషాలు సింక్ నెట్ లో ఉంటాయి. మీరు సింక్ నెట్ తెరిచి, దానిని తలక్రిందులుగా చేస్తే బోల్డంత చెత్త ఉంటుంది. అందుకే రోజు తప్పించి రోజు కిచెన్ సింక్ ను శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల ఆరోగ్యకరంగా ఉంటాము.

​స్పాంజ్

ఇంట్లో చాలా వరకు అన్ని వస్తువులను స్పాంజ్ తోనే శుభ్రం చేస్తాం . దూళిని, వస్తువులను శుభ్రం చేయటానికి మనం స్పాంజ్ ను ఉపయోగిస్తాం. అందుకే స్పాంజ్ ను శుభ్రంగా ఉంచాలి. లేకపోతె వాటివల్ల అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్లే స్పాంజ్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి , లేకుంటే వాటిలో ఉండే దూళి, అనేక క్రిములు అనారోగ్యాలకు దారీ తీస్తాయి. అందువల్ల తడి స్పాంజ్ ను ఉపయోగించే ప్రతి సారి దాన్ని ఒక నిమిషం పాటు మైక్రోవేవ్ చేసి, ఆపై సబ్బుతో శుభ్రం చేసి పొడిగా ఉంచండి. ఈ విందంగా స్పాంజ్ ను శుభ్రం చేసి వాడితే అందులో ఉండే బ్యాక్టీయాను నిర్మూలించవచ్చు.

​తలుపు గడియలు

తలుపులపై కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది. ఇంటికి ఎవరు వచ్చిన డోర్ గెడలను తప్పక తాకుతారు. అందువల్ల అనేక ఇన్ఫెక్షన్లు వస్తాయి. డోర్ గెడలు తాకడం వల్ల వాటి మీద ఉన్న బ్యాక్టీరియా నిక్షేపాలు మన చేతి నుండి శరీరంలోకి చేరి అనేక అనారోగ్యాలకు కారణమవుతాయి. కాబట్టి తలుపు గెడలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వాటిని వెనిగర్ తో శుబ్రా పరచాలి అప్పుడు వాటిపై ఉన్న క్రిములు నిర్మూలమవుతాయి. దీని వల్ల ఆరోగ్యకరంగా ఉండచ్చు. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కనిపించే దూళినే కాక ఇలా చిన్న చిన్న వస్తువులను కూడా శుభ్రం చేసుకోవాలి. వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్లే అన్ని వస్తువులను శుభ్రం చేసుకోవాలి. పైన పేర్కొన్న అన్ని వస్తువులను ఎప్పుడైనా ఇంటిని శుభ్రం చేసినప్పుడు ఈ ప్రదేశాలను శుభ్రం చేయడం మర్చిపోవద్దు.