Business

కొరోనా దెబ్బకు ఫోన్ల ధరలకు రెక్కలు

China Hikes Phone Prices Over Corona Affect

కరోనా(కొవిడ్‌-19) వైరస్‌ ప్రభావం భారత వ్యాపార రంగంపై కూడా పడనుంది. ఈ ప్రభావం వచ్చే 15రోజుల్లో కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్లు, ఫ్యూచర్‌ ఫోన్ల విడిభాగాల ధరలు పెరగనున్నాయి. ఫీచర్‌ ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని మెగ్‌అజ్‌ మొబైల్స్‌ సంస్థ సీఈవో నిఖిల్‌ చోప్రా తెలిపారు. ఈ పెంపు 10శాతం వరకు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక స్మార్ట్‌ ఫోన్ల ధరలు 6-7శాతం పెరిగే అవకాశం ఉంది. మరో 15-20 రోజుల్లోపే ఈ ఎఫెక్ట్‌ ఉండనుంది. ఇక ప్రీమియం స్మార్ట్‌ ఫోన్లపై ప్రభావం మాత్రం నామమాత్రమే. ఎందుకంటే భారత్‌లో వీటి మార్కెట్‌ వాటా చాలా తక్కువగా ఉండటమే కారణం. కరోనా వైరస్‌ కారణంగా చైనాలోని విడిభాగాలు తయారయ్యే కంపెనీలు మూతపడటంతో ఆ ప్రభావం ఫోన్ల ధరలపై చూపనుంది. దీని ప్రభావం అత్యధికంగా 180 రోజులపాటు ఉండే అవకాశం ఉంది. చైనా సంస్థ షామికి చెందిన రెడ్‌మీ8 ఫోన్‌ ధరను ఇప్పటికే పెంచేసింది.