DailyDose

కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య-నేరవార్తలు

Newly wed bride commits suicide by jumping into Krishna river

* కృష్ణానదిలో దూకి నవవధువు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే ఆమె భర్తకు కూడా నదిలోకి దూకేశాడు. ఈ ఘటన విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే నదిలో దూకి యువతితోపాటు భర్తను కూడా కాపాడి బయటకు తీసుకొచ్చారు. యువతి, యువకులు హేమలత, శ్రీకాంత్ లుగా గుర్తించారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మంగళగిరికి చెందిన శ్రీకాంత్, హేమలత ఇద్దరూ భార్యభార్తలు. సంవత్సరం క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే ఆదివారం (ఫిబ్రవరి 16, 2020) విజయవాడ దుర్గ గుడికి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఇరువురి మధ్య కొంత వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన హేమలత వెంటనే ఇబ్రహీంపట్నంలోని కృష్ణానదిలో దూకింది. వెంటనే ఆమెతోపాటు భర్త కూడా నదిలో దూకేశాడు. 

* గుజరాత్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుందనగా వధువు తల్లితో కలిసి వరుడు తండ్రి పరారైన సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో పెళ్లనగా వీరిద్దరూ జనవరి 3వ వారంలో జంప్ అయ్యారు. దీనితో పెళ్లి ఆగిపోయింది. 

* కన్నతల్లిని చివరిచూపులు చూసేందుకు వెళ్తూ కుమారుడు, కోడలు అనంత లోకాలకు పయనమైన విషాద  ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా పెంచికల్‌పేట సమీపంలో జరిగింది. ఆదిలాబాద్‌ టీచర్స్‌ కాలనీలో ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందగా…ఖమ్మంలో నివాసముంటున్న ఆమె కుమారుడు విజయ్‌ .. కుటుంబంతో సహా అంత్యక్రియలకు బయల్దేరాడు. పెంచికల్‌పేట గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న  లారీ.. విజయ్‌ కారును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో విజయ్‌, సునీత దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా.. కుమార్తె మౌనిక, కారు డ్రైవర్‌ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

* విజయనగరం సెంట్రల్ క్రైం పోలీసులు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఒడిస్సా రాష్ట్రానికి చెందిన అంతర రాష్ట్ర ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుండి రూ. 10.50 లక్షల విలువైన 200 గ్రాముల బంగారు ఆభరణాలును, మూడు కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి సిసిఎస్ పోలీసు స్టేషనులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

* టీడీపీ ఆఫీసులో ‘ సాక్షి’పేపర్‌ను టీడీపీ నేత జీవీ ఆంజనేయులు తగులబెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఐటీ దాడులపేరుతో టీడీపీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

* ఆ మధ్య ఇరాన్ లో ఒక విమానాన్ని కూల్చారు. దాంతో వంద మందికిపైగా మరణించారు. ఇప్పుడు వచ్చిన ఒక సమాచారం ప్రకారం యెమెన్ లో ఒక విమానాన్ని కూల్చగా ముప్పై ఒక్క మంది మరణించారు. సౌదీ నేతృత్వంలోని దళాలు జెట్ విమానాన్ని కూల్చివేశాయి. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ దాడి శనివారం యెమెన్‌లో ఉత్తర ప్రావిన్స్‌లో ఆల్ జాఫ్ ప్రాంతంలో జరిగింది. హౌతీస్ తిరుగుబాటుదారులు సౌదీ జెట్ విమానాన్ని కూల్చివేశామని ప్రకటించిన కొన్ని గంటల తరువాత ఈ దాడి జరగింది. దీంతో ఇది ప్రతికార దాడిగా భావిస్తున్నారు. ఈ దాడిపై సౌదీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

* షాద్ నగర్ నందిగామ పరిధిలోని హరిహారా జిన్నింగ్ మిల్లులో ప్రమాదం. షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండలంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ సమీపంలోని హరిహారా జిన్నింగ్ పత్తి మిల్లులో షాట్ సర్క్యూట్ కారణంగా పత్తి దగ్ధం అయ్యింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

* అల్గానూరు బ్రిడ్జి పైనుంచి కిందికి పడిపోయిన కారు. వెనిక్కి నుంచి డీ కొట్టిన లారీ. సహాయక చర్యలు పరిశీలిస్తూ వంతెన మీద నుంచి జారీ పడిన ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ మృతి.

* మేడారం జాతరలో భక్తుల కానుకలు కూడా పెద్ద ఎత్తునే వచ్చాయి. ఇంతవరకు చేసిన లెక్కలలో సుమారు ఏడు కోట్ల రూపాయలు రాగా, మరో వారం రోజుల పాటు కానుకల లెక్కింపు జరుగుతుందని సమాచారం. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపం ఈ లెక్కింపు సాగుతోంది. రూపాయి నాణేలు మొదలు రెండు వేల రూపాయల నోట్ల వరకు హుండీల నుంచి పడుతున్నాయి. ఫారిన్‍ కరెన్సీతో పాటు రద్దయిన ఐదువందల రూపాయల నోట్లు కూడా దర్శనమిస్తున్నాయి. బంగారు కడియాలు, వెండి కడియాలు, కుంకుమ భరిణెలు, వివిధ ప్రతిమలు బయటపడుతున్నాయి. బుధవారం నుంచి లెక్కింపు ప్రారంభమవగా.. శనివారం నాటికి హుండీల నుంచి రూ.7 కోట్ల ఆదాయం ఎండోమెంట్‍ అకౌంట్​లో జమైంది. మరో వారంపాటు లెక్కింపు కొనసాగనుంది. 2018 జాతరలో హుండీల నుంచి రూ.10.70 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.