DailyDose

నందమూరి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసిన యువకుడు-నేరవార్తలు

Telugu Crime News Roundup Today-Nandamuri Vasundhara Signature Forged

* పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మనోహర్‌ రెడ్డి సోదరి రాధిక కుటుంబ సభ్యులు అలగనూరు కాలువలో శవాలుగా తేలారు. భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె సహస్రతో సహా ఎమ్మెల్యే సోదరి రాధిక అనుమానాస్పదంగా మృతి చెందారు. 20 రోజుల క్రితం  అదృశ్యమైన రాధిక కుటుంబ సభ్యలు పూర్తిగా కుళ్లిన శవాలుగా మారినట్లు పోలీసులు గుర్తించారు. కాగా నిన్న సాయంత్రం బైక్‌పై వెళుతున్న ఓ జంట ప్రమాదవశాత్తు కాలువలో పడటంతో అధికారులు నీటిని నిలిపి వేశారు. 

* అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఓ జెట్ విమానం అత్యవసర పరిస్థితుల్లో నేలపైకి దిగింది. ఈఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ విమానం మైసూరు నుంచి బళ్లారి జిందల్‌ ఫ్యాక్టరీకి వెళ్తుండగా మార్గ మధ్యంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పొలాల్లో విమానాన్ని సురక్షితంగా దించినట్లు పైలట్ తెలిపారు. ఈ సమయంలో విమానంలో పైలట్‌తో పాటు మరో వ్యక్తి ప్రయాణిస్తున్నారు.

* వేములవాడ ఆలయంలో కోడెల హల్చల్, కోడెలు ఒక్కసారిగా ఉరికిరావడంతో చోటుచేసుకున్న తొక్కిసలాట, నల్గురికి తీవ్ర గాయాలు, అందులో ఇద్దరి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు.

* మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అసిస్టెంట్ కొర్రి శివను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, ఈ నెల 13న హైదరాబాద్, బంజారాహిల్స్ బ్యాంకు మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్ లు వసుంధర ప్రతినిధి వెలగల సుబ్బారావుకు ఫోన్ చేసి, వసుంధర మొబైల్ బ్యాంకింగ్ యాప్ కోసం దరఖాస్తు చేసుకున్నారని చెబుతూ, యాక్టివేట్ చేయమంటారా? అని అడిగారు.

* ఢిల్లీ‌లో ఈ రోజు ఉద‌యం ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఇద్ద‌రు వాంటెడ్ క్రిమిన‌ల్స్ ను  చంపిన‌ట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో రాజా ఖురేషీ, రాజా బ‌హుదూర్‌ మృతిచెందిన‌ట్లు ఢిల్లీ స్పె‌ష‌ల్ సెల్ పోలీసు అధికారులు తెలిపారు.

* విషవాయువులు వెలువడి ఆరుగురు మరణించిన ఘటన పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో జరిగింది. కరాచీ నగరంలోని కీమారీ ఓడరేవులో ఓ కార్గో షిప్ నుంచి కెమికల్ ట్యాంకులు దించుతుండగా విషవాయువు వెలువడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 12 మంది శ్వాస సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనకు కారణమైన వారికి నోటీసులు జారీ చేశామని సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మురాద్అలీ షా చెప్పారు. విషవాయువు వెలువడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

* పశ్చిమ బెంగాల్‌లో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనలోని కొంతభాగం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మాల్దాలో చోటుచేసుకుంది. గాయాలపాలయిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా వంతెన ఎలా కూలిందన్నదానికి సంబంధించిన సమాచారం ఇంకా వెల్లడికాలేదు.

* మహారాష్ట్రలోని యవత్‌మాల్‌లో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఒక పికప్‌వ్యాన్ వంతెనపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, మరో 18 మంది గాయాల పాలయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం వ్యానులో కొంతమంది తమ బంధువు అస్తికల నిమజ్జనానికి కోటేశ్వర్ మందిరానికి వెళ్లి, జోడ్మోహా తిరిగివస్తున్నారు. ఇంతలో వ్యాను అదుపుతప్పి ఒక చెట్టును ఢీకొని కిందకు పడిపోయింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపినదాని ప్రకారం ఈ ఘటనలో ఆరుగురు అక్కడికకక్కడే మృతి చెందగా, ఇద్దరు చికిత్సపొందుతూ కన్నుమూశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

* హసన్ పర్తి మండలం పెంబర్తి శివారులోని ఋడ్ క కళాశాల ఎదురుగా మొక్క జొన్న షేను లోవరంగల్ రురల్ జిల్లా దామెరా మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మంద రూప (28). దారుణ హత్య.

* క్యాన్సర్ వ్యాధి ఉందని భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశాఖ గణేష్ నగర్ వడ్లపూడికి చెందిన అప్పలనాయుడు క్యాన్సర్ వ్యాధి ఉందనే భయంతో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు గాజువాక ఆర్కే హాస్పిటల్‌లో చేర్పించారు. మృత్యువుతో పోరాడుతూ అప్పలనాయుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

* వనస్థలిపురంలోని డీమార్ట్‌లో దారుణం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాకి చెందిన సతీష్ నాయక్ అనే విద్యార్థి డీమార్ట్‌లో మృతి చెందడం కలకలం రేపింది. హయత్‌నగర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సతీష్ నాయక్ అనే విద్యార్థి తన ఇద్దరు స్నేహితులతో కలిసి గత రాత్రి 9:30 గంటలకు డీమార్ట్‌కు వెళ్లాడు. ఈ ముగ్గురు విద్యార్థులకు డీమార్ట్ సిబ్బందితో గొడవ జరిగింది. గొడవ కాస్త ముదరడంతో సతీష్ స్నేహితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. అయితే డీమార్ట్‌లో జరిగిన ఘర్షణలో సతీష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే డీమార్ట్ సిబ్బంది సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే సతీష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా. సతీష్‌ను డీమార్ట్ సిబ్బందే కొట్టి చంపారని సతీష్ స్నేహితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* తమ భు సమస్య పరిష్కరించడం లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ విసిగి వేసారి సహనం కోల్పోయిన రైతులు నాగర్ కర్నూలు జిల్లా రైతులు బాటిల్ లో పెట్రోల్ తీసుకుని ఆత్మహత్య యత్నం చేసుకుంటమంటూ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎక్కి ఆందోళన కు దిగారు.

* కర్నూలు జిల్లా ఆదోని ఆలూరు రోడ్డు లో శ్రీనివాస ప్రెస్సింగ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ)అగ్నిప్రమాదం మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది, రవి రెడ్డి మాట్లాడుతూ నలుగురు హమాలీలు గాయాలు,నష్టం రెండు కోట్లు అయినట్లు తెలిపారు.

* పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణం నుండి మద్యం బాటిళ్ళను ను అడ్డదారిలో తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. వైన్ షాపు లో నుంచి ఐదు ఫుల్ బాటిళ్ళు, 6 వైన్ బాటిళ్ళను బ్యాగ్ లో పెట్టుకొని బైక్ మీద తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. మద్యం షాప్ ముందు మద్యం బాటిళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అడ్డదారిలో మందు విక్రయిస్తున్న షాప్ సూపర్వైజర్ పోసి, సహాయకుడు అనిల్ లను స్థానికులు నిలదీశారు. గత ఎనిమిది రోజుల నుంచి పోలవరంలోని వైన్ షాప్ లో మద్యం అమ్మకాలు చేయకుండా సూపర్వైజర్ లు సరుకు మొత్తం రహస్యంగా దాచి మండలంలోని బెల్ట్ షాప్ లకు అధిక లాభాలకు అమ్ముకుంటున్నారు. ఈరోజు కూడా అలాగే అమ్ముకుంటూ స్థానికులకు అడ్డంగా దొరికిపోయారు.

* రాజధాని రైతుల ఆందోళనలు 62వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు జరుగుతున్నాయి. వెలగపూడిలో 62వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు కూడా రైతుల 24 గంటల దీక్షలు జరుగుతున్నాయి. మందడం, వెలగపూడిలో రైతులు 24 గంటల దీక్షకు కూర్చోనున్నారు.