NRI-NRT

తామా 11వ చదరంగ పోటీల విజేతలు

USA-Atlanta Telugu NRI NRT News-TAMA 11th Semi Annual Chess Tourney Winners

అట్లాంటా తెలుగు సంఘం తామా ఆధ్వర్యంలో శనివారం నాడు బిగ్ క్రీక్ ప్రాథమిక పాఠశాలలో 11వ చదరంగ పోటీలు నిర్వహించారు. గత 6 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీ స్విస్ పద్దతిలో 5 విభాగాలు (యు1500, యు1000, యు500, అన్‌రేటెడ్, పెద్దలు) టైమ్ కంట్రోల్ జి30 + 5 సెకండ్స్ డిలే ప్రకారంగా జరిగింది. ప్రతి విభాగంలో మొదటి 5 విజేతలకు తామా ట్రోఫీలు అందజేశారు. వివిధ విభాగాల విజేతలకు ట్రోఫీలు అందజేశారు. తామా క్రీడలు మరియు యువత కార్యదర్శి రమేష్ వెన్నెలకంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు మాజీ ఛైర్మెన్ రాజేష్ జంపాల, శ్రీనివాస్ లావు, ప్రస్తుత చైర్మన్ రాజశేఖర్ చుండూరి, మాజీ అధ్యక్షులు వెంకీ గద్దె, అధ్యక్షులు భరత్ మద్దినేని, మహిళా కార్యదర్శి సునీత పొట్నూరు, సాంస్కృతిక కార్యదర్శి సురేష్ బండారు, కోశాధికారి భరత్ అవిర్నేని, సాహిత్య కార్యదర్శి శ్రీవల్లి కంసాలి, విద్యా కార్యదర్శి తిరు చిల్లపల్లి తమ తోడ్పాటు అందించారు. జార్జియా చెస్ డైరెక్టర్లు పార్నెల్ వాట్కిన్స్, జయశ్రీ శేఖర్ ఈ పోటీలకు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. తామా అధ్యక్షుడు భరత్ తామా ఆధ్వరయంలో నిర్వహించే చెస్, వాలీబాల్, షటిల్, టేబుల్ టెన్నిస్ వంటి రకరకాల ఆటలపోటీల గురించి వివరించారు. పోటీల నిర్వహణకు సాయమందించిన రాజ్ చామర్తి, వాలంటీర్లు అంజయ్య చౌదరి లావు, అనురాగ్ బండ్ల, శ్రీకాంత్ పొట్నూరు, రాధాకృష్ణలకు సంస్థ ధన్యవాదాలు తెలిపింది.

*** విజేతల వివరాలు –
** అండర్ 1500:
జాషువా కారోల్
ప్రణవ్ దొంతినేని
తనీష్ రాజ్ ఉదయ్ కుమార్
మాధవ్ గోపి
విశ్రుత్ ఎలిశెట్టి

** అండర్ 1000:
ఇషాన్ పాండియన్
వినేష్ దేవునూరి
సిద్దార్థ్ సంతోష్
యిన్ హంటర్
క్రితిక్ కలైవన్నన్

** అండర్ 500:
రేయాన్ష్ బజ్జురి
తినయు క్యూయి
సాయి షయాంక్ మొహంతి
కుషాల్ మరింగంటి
మోహినీష్ మద్దినేని

** అన్ రేటెడ్:
విక్రాంత్ సజ్జా
ఆర్యన్ షేక్
ఆర్యన్ గాంధి
హరన్ వైభవ్ సి కె
తేజస్ సింగ్ సుమిత్

** అడల్ట్స్ :
మధు పెరుమాళ్ళ
కీర్తి సంచన
ఆండ్రూస్ ప్రజ్బైలా
సందీప్ నాగులపల్లి
ప్రమోద్ సంగవర్