Devotional

మహాశివరాత్రి ఆవిర్భావం

What is sivaratri and how did it start-Telugu devotional news

ప్రపంచానికి ఆధ్యాత్మిక, దైవకాంతి పరిమళ వైభవాన్ని మహోజ్వలంగా, మహోన్నతంగా అందించిన భరతభూమి పుణ్యభూమి, కర్మభూమి. అందుకే భారతదేశం ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా విరాజిల్లుతోంది. దేవతలు వివిధ అవతారాల రూపంతో స్వయంగా వసించినది వ్యధరణి మన భారతదేశం. ముల్లోకాల్లోని (కైలాసం, వైకుంఠం, బ్రహ్మ లోకం) దేవుళ్లకూ, భూలోకంలోని మానవులకు ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలను కలిగినది భారతదేశం. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని ఎన్నో పండుగలూ, ఆచార వ్యవహారాలూ, సమున్నత సంస్కృతీ సంప్రదాయాలతో భగవంతుని సాన్నిధ్యానికి భక్తుని చేరువ చేసిన మహత్తర ఆధ్యాత్మిక వైభవం భారతదేశం సొంతం.. ఈ పరంపరలో భారతీయ సనాతన పండుగల్లో మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న గొప్ప పండుగ. వేద కాలం నుంచి భక్తులు ఎంతో నిగ్రహ నియమ నిష్టలతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న మహా పర్వదినం. ప్రపంచవ్యాప్తంగా హిందువులు శాస్తయ్రుక్తంగా నిర్వహించుకుంటూ పరమశివుని కృపకు పాత్రులవుతున్నారు. మహాశివరాత్రి విశేషాలనూ, శివలీలనూ, శివలింగస్కాంద, బ్రహ్మాండాది పురాణాలు, శివగీత తదితర ఎన్నో ఉద్గ్రంథాలు వివరిస్తున్నాయి.
**శివుడు, పార్వతి, విష్ణు, బ్రహ్మల పుట్టుక
సకల సృష్టికి పూర్వం సమస్తం జలమయమై ఉండగా, అందులో నుండి గొప్ప మహోజ్వల తేజస్సు పుట్టింది. ఆ తేజస్సులో.. సగం తేజస్సు నుండి త్రిశూలం, శంఖం, ఢమరుకం, ధరించిన.. ఫాలన (నొసట) అగ్ని నేత్రంతో (మూడవ కన్నుతో) పరమేశ్వరుడు, మిగిలిన సగం తేజస్సు నుండి జగజ్జనని పరమేశ్వరి (పార్వతి) ఉద్భవించారు. ఇలా పార్వతీ పరమేశ్వరులు తొలి ప్రకృతి పురుషులు.. ఆదిదంపతులైనారు. ఈ క్రమంలో వారి అనుగ్రహం చేత విష్ణుమూర్తి ఆవిర్భవించాడు. అనంతర కాలంలో శివుడు.. రాక్షస సంహారం కోసం శ్రీమహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని బహూకరించినట్లు శివపురాణం చెబుతోంది. ఈ నేపథ్యంలో మహా విష్ణువు శేషశయ్యపై ఎన్నో వందల ఏళ్లు యోగ నిద్రలో ఉన్నాడు. ఈ సమయంలో అతని నాభి కమలం నుండి పంచముఖ బ్రహ్మ ఉద్భవించాడు. కాలక్రమంలో శివుడు కైలాసానికి, విష్ణువు వైకుంఠానికి, బ్రహ్మ.. బ్రహ్మలోకానికి అనగా ముల్లోకాలకు ఆ త్రిమూర్తులు అధిపతులై సృష్టి, స్థితి, లయకారులై యావత్ జీవ రాశికి మనుగడ సాగిస్తున్నారు.
**మహాశివరాత్రి ఆవిర్భావం
అనేక సందర్భాలను బట్టి తమలో ఎవరు గొప్ప? అనే గర్వం బ్రహ్మ, విష్ణువుల్లో తలెత్తింది. దీంతో శివుడు మహా నిశీధిలో పాతాళం, భూమి, ఆకాశాలను కలుపుతూ జాజ్వల్యమానకోటి సూర్య కాంతులతో ప్రకాశిస్తూ.. ఓంకార నాదం ప్రతిధ్వనిస్తుండగా.. అనంతమైన జ్వాలాలింగం (అగ్ని స్తంభం) రూపంలో మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ అద్భుత లింగం నుంచి ఈశ్వరుడు లింగోద్భవ మూర్తిగా నాలుగు భుజాలతో మహావిష్ణువు, బ్రహ్మదేవుళ్లకు దర్శనమిచ్చాడు. తన మహాలింగం ఆది, అంతాలను కనుగొనాలనీ, అలా మీలో ఎవరు కనుగొంటే వారే గొప్పవారవుతారని వారిరువురికి పరీక్ష పెట్టాడు శివుడు. ఈ క్రమంలో బ్రహ్మ, విష్ణువు లెవరూ ఆ అనంతమైన శివలింగాన్ని ఆది, అంతాలను కనుగొనలేక వైఫల్యం చెందారు. దీంతో వారి గర్వాన్ని అణచిన సందర్భాన్ని.. మహాశివరాత్రిగా.. సదాశివుడు ప్రపంచానికి ప్రకటించాడు. ఇలా తాను జ్వాలాలింగ రూపంలో ఉద్భవించినట్టి మాఘమాస, బహుళ చతుర్దశి, ధనిష్టాన నక్షత్రం, దివ్య (నిశీధి) రాత్రి.. మహాశివరాత్రి తనకు అత్యంత ప్రీతిపాత్రమైనదన్నాడు శివుడు.. ఈ మహా పర్వదినాన.. శివలింగాన్ని దర్శించి, అభిషేకించి.. ఉపవాసాలతో ఆరాధించి జాగరణ చేసిన వారు తనకు ప్రీతిపాత్రులై తన కృపను చూరగొని సకల మహా పాపాల నుంచి విముక్తులవుతారు.. శివ సాయుజ్యాన్ని (శివైక్యం) పొందుతారని ఈశ్వరుడు ప్రపంచానికి దివ్య సందేశమిస్తూ మహా శివరాత్రిని అంగరంగ వైభవంగా జరుపుకొని పునీతులు కావాలని ప్రజలను ఆదేశించాడు బోళా శంకరుడు. ‘శివ.. రాత్రి’ శివం (శుభం) రాత్రి. శుభం కలిగించే రాత్రి.. రాత్రి తల్లి లాంటిది.. సకల ప్రాణికోటిని తన ఒడిలోకి హాయిగా చేర్చుకొని సేదతీర్చి సుఖనిద్ర నిస్తుంది.
**ఓంకార స్వరూపుడు
పరమేశ్వరుడు ఓంకార స్వరూపుడు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని వేదాలు ఘోషిస్తున్నాయి. ఓంకారానికి నామాంతరం ప్రణవం. రోదనలు బాపే వాడైనందున రుద్రుడు అయినాడు. భూత భవిష్యత్ వర్తమానాలనే త్రికాలాలకు అధిపతి శివుడు. ఈశం ఇవ అక్షరాల కలయిక శివం అవుతుంది. మంగళప్రదమూ శివమూ అయినది శివతత్వము. అందుకే శివుడు మంగళప్రదుడు అయినాడు. కోరిన వారికి కొంగు బంగారమూ, బోళాశంకరుడు అయినాడు. ‘శివం’ అంటే శుభం.. ఈశ్వర శబ్దం నుంచి ఐశ్వర్యమనే పదం వచ్చింది. సర్వసంపద్రూపుడు శివుడు. అభవుడు పుట్టుక లేనివాడు.
**మహాదేవుడికి ప్రతీకగా లింగం
లింగం అంటే చిహ్నమనీ, సంకేతమనీ, ప్రతీక అని అర్థం. శివలింగం సర్వశుభంకరుడైన మహాదేవుడికి ప్రతీకగా.. శివునిచే మహాశివరాత్రి ఆవిర్భావమైన నాటి నుంచి భక్తకోటితో కొలువబడుతూ విరాజిల్లుతోంది. శివుడు తన పంచముఖాల నుంచి పంచ లింగాలను సృష్టించాడు. శివుని ఐదు ముఖాలు సద్యోజాతా, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానా.. పంచభూత తత్వాలతో ఆ లింగాలు ఐదు విధాలుగా ప్రసిద్ధికెక్కాడు. జంబుకేశ్వరంలో జలలింగం, కంచిలో భూలింగం, అరుణాచలంలో అగ్ని లింగం, చిదంబరంలో ఆకాశ లింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం.. ఇవి సర్వవ్యాపకుడైన రుద్రుడు కోటానుకోట్ల సూర్యుల కాంతితో అఖండంగా వెలుగొందే మహోజ్వల తేజోమూర్తి మహాశివుని స్వయం సృష్టి లింగాలుగా పౌరాణికులు చెబుతారు. ఈ లింగాలను దర్శించుకుంటే మహాశివుని ఐదు ముఖాల స్వయంగా దర్శించు కున్నట్లేనని శివపురాణం చెబుతోంది. కాగా పంచభూతాల లింగాలు, స్వయంభూ లింగాలు, జ్యోతిర్లింగాలు వెలిశాయి. భూలోకంలో ఈ లింగాలు 12గా వెలిశాయి. లింగాలలో చల, అచల, పార్థివ, మృత్తిక, రస మొదలైనవి ఉన్నాయి.
**త్రిమూర్తుల కలయికకు ప్రతీకగా ఆలయాల లింగాలు
శివాలయాల్లోని లింగాలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయికకు ప్రతీకలుగా 3 భాగాలుగా ఉన్నాయి. అడుగు భాగం బ్రహ్మ భాగం, మధ్యభాగం మహావిష్ణువు భాగం, స్తంభాకార భాగం రుద్ర (శివుని) భాగం. ఇదే పూజా భాగం. దీనిపై బ్రహ్మసూత్రాలుగా పేర్కొనే గీతలు ఉంటాయి. ఇలా గీతలు ఉన్న శివలింగాలనే పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాగా వ్యాపకశీలమైన ప్రకృతి తత్వమే యోని. ఉత్పత్తికి ఉపాదాన కారణమైన పరమశివుడే శివలింగం.. లోతుగా పరిశీలిస్తే.. యోని, లింగం కలయిక సృష్టి కార్య స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. (ఇది శివలింగంకు ప్రతీక) యోనిని, మూలకారణ శక్తిగా వేదాలు, ఉపనిషత్తులు స్పష్టపరిచాయి. ఇవే కాకుండా భగవద్గీత కూడా (14వ అధ్యాయం, 4వ శ్లోకం) సకల ప్రాణులందు ఉత్పత్తి అగుచున్న మూర్తులకు (జీవజాలానికి) మహాద్యోని ప్రకృతి. అందు బీజ స్థాపన చేయువాడు శివుడు ప్రకృతి తల్లి. వాటికి తండ్రిని నేను, అని గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ పరంగా, ఈ భావాన్ని శివ పార్వతులకు (ప్రకృతీ పురుషులకు) అన్వయిస్తే సర్వ ప్రాణులకు ప్రకృతియే తల్లి. పరమేశ్వరుడే తండ్రి. ఇదే జగజ్జనని, జనక భాగంగా సౌందర్య లహరిలో జగద్గురువు ఆదిశంకరాచార్య భగవత్పాదుల వారు హృద్యంగా, భక్తి ఆధ్యాత్మిక భావనలతో పరమోన్నతంగా చెప్పాడు.
వివిధ నామాలతో శివుడు.. ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలు సౌరాష్టల్రో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, ఓంకార క్షేత్రంలో అమరేశ్వరుడు, హిమాలయాల్లో కేదారేశ్వరుడు, డాకినీ క్షేత్రంలో భీమ శంకరుడు, వారణాసిలో (కాశీ) విశ్వనాథుడు, నాసికంలో త్య్రంబకేశ్వరుడు, ప్రజ్వలం (పర్లి)లో వైద్యనాథేశ్వరుడు, దారుకావనంలో నాగేశ్వరుడు, సేతుబంధంలో రామేశ్వరుడు, ఘృష్ణేశ్వరంలో ఘృష్ణేశ్వరుడుగా ఆయా పేర్లతో క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కగా భక్తకోటి సందర్శిస్తూ తరిస్తున్నారు.
**‘శివార్చనతో తరించిన భక్తులెందరో..
ధూర్జటి అనే మహాకవి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం’ అనే శతకాన్ని రచించి శివుని కృపకు పాత్రుడై శివైక్యం చెందాడు. మార్కండేయుడు శివలింగార్చన చేసి చిరాయువును (చిరంజీవి) పొందాడు. అర్జునుడు శివునితో యుద్ధం చేసి అతని ప్రీతిని పొంది అతని నుంచి తిరుగులేని పాశుపతాస్త్రాన్ని సాధించాడు. సత్కీరుడు నూరు పద్యాలతో స్తుతించి శివసాయుజ్యాన్ని పొందాడు. శ్రీకాళహస్తిలో తిన్నడు (్భక్త కన్నప్ప), సాలె పురుగు, పాము, ఏనుగు శివలింగార్చన గావించి శివానుగ్రహాన్ని సాధించగా, వాటి పేరుతోనే శ్రీకాళహస్తిగా వెలసి ప్రసిద్ధి కెక్కింది. బాణాసురుని సహస్ర లింగార్చనకు ఆటంకం కలుగకుండా, అతని వాకిట స్వయంగా శివుడు కాపలాదారుగా ఉన్నాడు. ఇలా శివారాధనలతో భక్తశిఖామణులెందరో శివ సాయుజ్యాన్ని పొంది చరితార్థులైనారు. ఈ నేపథ్యంలో, శివానుగ్రహం పొందడానికి శివరాత్రి కంటే మహా మహిమాన్వితమైన పర్వదినం మరొకటి లేదు. యజ్ఞ యాగాదులు ఒక ఎతె్తైతే శివరాత్రి నాడు శివార్చన ఒక్కటి ఒక ఎత్తు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అర్ధరాత్రి వేళ ఈశ్వరుడి లింగోద్భవం జరిగి గొప్ప ‘మహాశివరాత్రి’ ఏర్పడినందున ఆ దినం రాత్రి ‘అతిరాత్ర యాగం’ నిర్వహిస్తారు. ‘అతిరాత్రం’ అంటే రాత్రిని జయించమని అర్థం. చీకటితో పోలుస్తూ చెప్పే అజ్ఞానం, దుఃఖం, బాధ వంటి ప్రతికూల పరిస్థితులను అతిరాత్రం జయిస్తుంది. విశ్వ సామరస్యాన్నీ, సకల జీవరాశి సంక్షేమాన్నీ ఆ యాగం కాంక్షిస్తుంది.
**తిరుమల క్షేత్రపాలకుడు శివయ్య’
తి.తి.దే ఆధ్వర్యంలో ఉన్న ఏకైక శైవ క్షేత్రం కపిల తీర్థం. పరమేశ్వరుడు తిరుమల క్షేత్ర పాలకుడు కావడమే ఇందుకు కారణం.శివస్తోత్రాలతో మారుమోగే ప్రసిద్ధ దేవాలయాలుమహాశివరాత్రి నాడు ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచారామాలు, కాశీ, రామేశ్వర తదితర ప్రసిద్ధ దేవాలయాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, కాళేశ్వరం, వేములవాడ, అమరారామం, కాకతీయుల వేయి స్తంభాల గుడి (హన్మకొండ) రామప్ప దేవాలయం, గణపేశ్వరాలయం (గణపురం కోట గుళ్లు) తదితర శైవ పుణ్యక్షేత్రాలన్నీ జగజ్జేగీయమానంగా, అపర కైలాస శిఖరంగా ప్రకాశిస్తూ.. శివదర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ.. భక్తకోటి ఓం నమః శివాయః.. శంభోశంకర.. హరహర మహాదేవ స్తోత్రాలతో.. శివనామస్మరణలతో.. భజనలతో.. నగర సంకీర్తనలతో.. జయజయ శివశివ.. ఓంకార నాదాలతో… ఆలయాల గంటల ధ్వనులతో మారుమోగుతూ శివభక్తి పారవశ్యాన్ని కలిగిస్తూ శివైక్య మార్గాన నడిపిస్తున్నాయి.. ఓం నమః శివాయః *
2.మయూరవాహనంపై శ్రీశైలనాథుడు
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల నాలుగో రోజు సోమవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లు భక్తులకు మయూర వాహనంపై దర్శనమిచ్చారు. సంప్రదాయాన్ని అనుసరించి తితిదే తరఫున ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో సింఘాల్‌ పట్టువస్త్రాలు సమర్పించారు.
3.తిరుపతిలో 20న మహాసరస్వతి యాగం
తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, విద్యావిభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20న పది వేల మంది విద్యార్థులతో మహాసరస్వతి యాగం నిర్వహించనున్నారు. తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్‌ మైదానంలో గురువారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు యాగం చేపడతారు. త్వరలో జరగనున్న వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు విజయం సాధించాలని శ్రీసరస్వతి అమ్మవారిని ప్రార్థించేందుకు ఈ క్రతువు తలపెట్టారు. తితిదే, ప్రభుత్వ విద్యాసంస్థలు, ధార్మిక సంస్థల్లో 8, 9, 10 తరగతులు.. ఇంటర్‌, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు యాగంలో పాల్గొనవచ్చు. విద్యార్థులకు విద్యా కంకణాలు, పుస్తకం, పెన్నులను తితిదే అందజేస్తుంది.
4.మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు
మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 18 నుంచి 23 వరకు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 315 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ప్రకటించింది. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఐఎస్‌సదన్‌, కేపీహెచ్‌బీ, మియాపూర్‌, నేరేడ్‌మెట్‌, ఉప్పల్‌ క్రాస్‌రోడ్స్‌, వనస్థలిపురం నుంచి బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. భక్తుల కోసం ‌www.tsrtconline.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్లో టికెట్లు రిజర్వు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
5.శాస్త్రోక్తం.. శంభుని ధ్వజారోహణం
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరుని ధ్వజారోహణ ఘట్టాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ధ్వజస్తంభానికి ఓ వైపున వినాయకుడు, మరో వైపున శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, భక్తకన్నప్ప, చండికేశ్వరుని ఉత్సవమూర్తులను ఉంచారు. శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత సోమస్కంధమూర్తి ఉత్సవమూర్తులతో పాటు ఉమాదేవి సమేత చంద్రశేఖరస్వామి కొలువుదీరిన త్రిశూలాన్ని ఉంచారు.
6.రేపటి నుంచి తిరుమలలో గాజు నీళ్ల సీసాల విక్రయం
తిరుమల శ్రీవారి భక్తులకు బుధవారం నుంచి 750 మి.లీ. గాజు నీటిసీసాలను అందుబాటులోకి తెస్తున్నట్లు తితిదే ఆరోగ్యాధికారి ఆర్‌.ఆర్‌.రెడ్డి తెలిపారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. గాజుసీసాలతో పాటు ఖరీదైన రూ.350 వీన్‌ వాటర్‌బాటిల్‌ను, రాగి, మట్టి సీసాలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.
7. పరమశివుడికి బెర్తు ఒక్క రోజే: ఐఆర్‌సీటీసీ
కాశీ-మహాకాళ్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు విజయవంతం కావాలని కోరుకుంటూ పూజ కోసం ఒక బెర్తుపై పరమశివుడి చిత్రపటాలను తాత్కాలికంగా సిబ్బంది ఉంచారని, అది ఆ ఒక్కసారికే పరిమితమని రైల్వే అనుబంధ సంస్థ- ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ప్రారంభోత్సవం రోజు సాధారణ ప్రయాణికుల్ని అనుమతించలేదని, ఈ నెల 20న రైలు వాణిజ్య ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చినప్పుడు శివుడి పేరిట అలాంటి బెర్తు ఉండదని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆదివారం ఈ రైల్లో బి-5 పెట్టెలో 64వ నంబరు బెర్తును శివుడి పేరున కేటాయించడం, శాశ్వత ప్రాతిపదికన అలా చేయాలని యోచిస్తున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించడం తెలిసిందే. ఈ చర్యను ప్రశ్నిస్తూ ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ సోమవారం ట్వీట్‌ చేశారు. దీంతోపాటు భారత రాజ్యాంగ పీఠిక ఫోటోను ప్రధానమంత్రి కార్యాలయానికి ట్యాగ్‌ చేశారు.

8. మేడారం హుండీల్లో తడిసిన కానుకలు
మేడారం జాతరలో భక్తులు అమ్మవార్ల హుండీల్లో వేసిన కానుకలు తడిసి ముద్దయ్యాయి. హన్మకొండలోని తితిదే కల్యాణ మండపంలో ఆరో రోజు సోమవారం హుండీ ఆదాయం లెక్కింపు కొనసాగింది. జాతర సమయంలో కురిసిన వర్షం కారణంగా హుండీల్లో నీరు చేరి కానుకలు తడిశాయి. హుండీలను తెరిచి చూడగా ఎక్కువ సంఖ్యలో నోట్లు బూజు పట్టాయి. సోమవారం నోట్లను కుప్పలుగా పోసి ఒక్కొక్కటిగా విడదీయడానికి వాలంటీర్లు ఇబ్బంది పడ్డారు. తడిసి ముద్దగా మారిన నోట్లను విడదీస్తున్న క్రమంలో చాలా నోట్లు చిరిగి పోతున్నాయి.
9. పంచాంగము 18.02.2020
సంవత్సరం: వికారి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: కృష్ణ బహుళ
తిథి: దశమి సా.06:10 వరకు
తదుపరి ఏకాదశి
వారం: మంగళవారం ( భౌమ వాసరే)
నక్షత్రం: జ్యేష్ఠ ఉ.09:11 వరకు
తదుపరి మూల
యోగం: హర్షణ ఉ.08:42 వరకు
తదుపరి వజ్ర
కరణం: విష్టి ప.02:36
వర్జ్యం: లేదు
దర్ముహూర్తం: 09:00 – 09:47
రాహు కాలం: 03:24 – 04:51
గుళిక కాలం: 12:30 – 01:57
యమ గండం: 09:35 – 11:02
అభిజిత్ : 12:07 – 12:53
సూర్యోదయం: 06:41
సూర్యాస్మయం: 06:18
వైదిక సూర్యోదయం: 06:45
వైదిక సూర్యాస్తమయం: 06:15
చంద్రోదయం: రా.02:24
చంద్రాస్తమయం: ప.01:49
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
దిశ శూల: ఉత్తరం
చంద్ర నివాసం: తూర్పు
దయానంద సరస్వతి జయంతి
శ్రీ వాలాజాపేట వేంకట్రమణ భాగవతార్ జయంతి
10. రాశిఫలం – 18/02/2020
తిథి:
బహుళ దశమి సా.5.41
నక్షత్రం:
జ్యేష్ఠ ఉ.8.45
వర్జ్యం:
కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
దుర్ముర్తం:
ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి రా.1048 నుండి 11.36
రాహు కాలం:
మ.3.00 నుండి 4.30 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధన లాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలధికమవుతాయి.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అకాల భోజనాదులవల్ల అనారోగ్య మేర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో నుండుట అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. మనోద్వేగానికి గురిఅవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. క్రొత్త పనులు ప్రారంభించరాదు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ఆర్థిక ఇబ్బందులుండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. క్రొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధన లాభయోగముంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్ర్తిలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ఋణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభ వార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) క్రొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసికానందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధన నష్టమేర్పడే అవకాశముంది. వృత్తిరీత్యా క్రొత్త సమస్యలనెదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది.
11. తిరుమల\|/సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు మంగళవారం,
18.02.2020
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 15C°-29C°
• నిన్న 76,017 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 03 కంపార్ట్మెంట్
లలో సర్వదర్శనం కోసం
భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
04 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 23,136 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 2.85 కోట్లు,

• నిన్న 16,539 మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• ఫిబ్రవరి 21న గోగ‌ర్భ
తీర్థంలోని క్షేత్ర‌పాల‌కునికి
మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు,
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ఠ నరశార్దూల
కర్తవ్యం దైవమాహ్నికమ్‌
తా: కౌసల్యాదేవికి
సుపుత్రుడవగు ఓ
రామా! పురుషోత్తమా!
తూర్పు తెల్లవారుచున్నది.
దైవ సంబంధములైన
ఆహ్నికములను
చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free
#18004254141
12. వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర
కల్యాణవెంకన్నకు బంగారు తిరుక్కోర‌ము, 2 వ‌జ్రాల భావ‌లీలు బ‌హూక‌ర‌ణ‌
తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర మంగ‌ళ‌వారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి తిరుప‌తి జెఈవో పి.బసంత్‌కుమార్ దంప‌తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఆభరణాలు అందించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా గరుడసేవ నాడు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళుతున్నట్టు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సుమారు రూ.50 ల‌క్ష‌లు విలువైన 983.750 గ్రాముల బరువు గల ఆభరణాలను బ‌హూక‌రించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇందులో 529.750 గ్రాముల బ‌రువైన ప్ర‌భ ఆకారం క‌లిగిన ర‌త్నాలు చెక్కిన బంగారు తిరుక్కోర‌ము, 454 గ్రాముల బ‌రువు గ‌ల 2 వ‌జ్రాల భావ‌లీలు ఉన్నాయ‌ని వివ‌రించారు.
ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారం, ఆభరణాలను తిరుమల శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, పేష్కార్ లోక‌నాథం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనానికి తీసుకొచ్చారు. ఈ లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండరామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్రసాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.