Business

బిరియానీ బిజినెస్‌లతో భారీ లాభాలు

Youth invoking novel ideas in biriyani business

యువత ఫుడ్ ఇండస్ట్రీ పై క్రేజ్ పెంచుకుంటున్నారు. కొత్త కొత్త స్టార్టప్స్ తోఆహారప్రియులను ఆకట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివిన విద్యార్థులు కూడా ఉద్యోగాలు చెయ్యకుండా ఫుడ్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందుతున్నారు.

డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉండాలే కానీ బోలెడంత మార్కెట్ మన్న కళ్ల ఎదుటే ఉంది. ఇటీవల ఐటీ శాఖ వారు పంజాబ్‌లోని లూథియానా ఓ పకోడీ వ్యాపారి దుకాణాల్లో తనిఖీ నిర్వహించారు. భారీగా పన్ను ఎగ్గొడుతున్నట్టుగా తేలడంతో వెంటనే అతడితో రూ.60 లక్షలు పన్ను కట్టించారు అధికారులు. దీన్ని బట్టి సాంప్రదాయ ఫుడ్ బిజినెస్ లో ఆదాయం ఏ స్థాయిలో ఉందనేది ఆలోచించవచ్చు. అయితే చేసే పనిలో కొత్త కాన్సెప్ట్ ఉంటే చాలు సక్సెస్ మీ వెంటే ఉంటుంది. చదువు ఏదయినా పరవాలేదు బిజినెస్ అయితే బెస్ట్ అని ఎక్కువ మంది యువకులు నేడు బిజినెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే యువత ఫుడ్ ఇండస్ట్రీ పై క్రేజ్ పెంచుకుంటున్నారు. కొత్త కొత్త స్టార్టప్స్ తోఆహారప్రియులను ఆకట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివిన విద్యార్థులు కూడా ఉద్యోగాలు చెయ్యకుండా ఫుడ్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందుతున్నారు. అంతే కాదు తమతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. చిన్న చిన్నగా మొదలు పెట్టి క్లిక్ అయ్యాక రెస్టారెంట్లు ఓపెన్ చేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఈట్స్, ఫుడ్ పాండా లాంటి ఆన్ లైన్ బిజినెస్ పోర్టల్స్ తో కూడా టై అప్ అయి వారి యొక్క బిజినెస్ ని విస్తరించుకుంటున్నారు. కొత్త ధోరణిలో ఆలోచించి ఏదయినా చెయ్యలనుకే వారికి ఫుడ్ బిజినెస్ బాగా కలిసొస్తుంది.

అయితే ఇఫ్పుడు తాజాగా ఫుడ్ బిజినెస్ లో బిర్యానీ(Dum Biryani) సెంటర్లు చక్కటి ఆదాయం అందిస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో మంచి ఆదాయం బిర్యానీ సెంటర్ల ద్వారా యువత పొందుతున్నారు. అయితే యువతలో ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి. ఎంత లాభం వస్తుంది అనే అవగాహన కొరవడింది. అందుకే ఈ బిజెనెస్ పై సమగ్ర వివరాలు చూద్దాం. నిజానికి రెస్టారెంట్లలో మంచి నాణ్యమైన బిర్యానీ(Dum Biryani) తినాలంటే ఒక ప్లేటుకి సుమారు 200 దాకా ఖర్చు అవుతుంది. అయినప్పటికీ రెస్టారెంట్స్, హోటల్స్ లో మాంసం, నూనెలు, మసాలా నాణ్యతపై కస్టమర్లలో ఇప్పటికే అనుమానమే ఉంది. అయితే చక్కగా ఇంటి వద్దే నాణ్యమైన నెయ్యి లేదా నూనె, ఫ్రెష్ చికెన్, క్వాలిటీ బాస్మతీ బిర్యానీని అతి తక్కువ ధరకే ఎక్కవు క్వాంటిటీతో అందిస్తే మీకు మంచి లాభంతో పాటు నిరంతం ఆదాయం మీకు లభిస్తుంది.

అర కేజీ బాస్మతీ బియ్యం ధర రూ.50, అర కేజీ చికెన్ రూ.100, మసాలా దినుసులు, ఇతర పదార్థాల ఖర్చు రూ.50, ఒక కేజీ బిర్యానీకి దాదాపు 200 ఖర్చు అవుతుంది. అంటే ఒక కేజీ బిర్యానీతో మూడు ప్లేట్లుగా విభజించి అమ్మకానికి పెట్టవచ్చు. ఒక ప్లేటు బిర్యానీకి రూ.100 ధర నిర్ణయించినా మూడు ప్లేట్లకు రూ.300 సంపాదించవచ్చు. అంటే ఒక కేజీ బిర్యానీపై సుమారు వంద రూపాయల లాభం వస్తుంది. ఈ లెక్కన రోజుకి పది కేజీల బిర్యానీ అమ్మినా…మీకు పెట్టుబడి మీద లాభం సుమారు రూ. 2000 దాకా లభిస్తుంది. అయితే క్వాలిటీ తగ్గకుండా మెయిన్ టెయిన్ చేయడంతో పాటు ఫుడ్ ట్రక్ ద్వారా బిర్యానీ సెంటర్ నడిపితే మీకు షాపు అద్దెతో పాటు లేబర్ ఖర్చులు కలిసి వస్తాయి.