Sports

అమ్మ నిర్మాత. భార్య నటి. తానే నటుడు.

Yuvraj Singh To Star In A WebSeris Along With His Wife And Produced By His Mom

అభిమానులకు శుభవార్త! టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ మరోసారి అందరినీ అలరించబోతున్నాడు. ఐతే ఈ సారి బ్యాటు, బంతితో కాదు. తన నటనతో. అవును, యువీ ఓ వెబ్‌సిరీస్‌లో నటించనున్నాడు. అసోంకు చెందిన డ్రీమ్‌హౌజ్‌ ప్రొడక్షన్స్‌ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తోంది. యువీ సోదరుడు జొరావర్‌ సింగ్‌ది ప్రధాన పాత్ర. అతడి సతీమణి హజెల్‌ కీచ్‌ సైతం కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇక యువీ తల్లి షబ్నమ్‌ సింగ్‌ ఈ వెబ్‌సిరీస్‌ నిర్మాణంలో భాగమవుతుండటం ప్రత్యేకం.