Sports

మద్రాసులో సింధు అకాడమీ

Madras Badminton Academy - Telugu Sports News

ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు పేరిట చెన్నైలో ఓ బ్యాడ్మింటన్అకాడమీ ఏర్పాటు కానుంది. హార్ట్‌‌ఫుల్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ అకాడమీ నిర్మాణ పనులకు సింధు బుధవారం పునాది రాయి వేసి ప్రారంభించింది. కొలప్పాక్కం స్కూల్లో నిర్మించే ఈ సెంటర్‌‌ రెండేళ్ల లోపు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఎనిమిది కోర్ట్, వెయ్యి మంది సిట్టింగ్ కెపాసిటీ, జిమ్, ఫిజియో, మెడిటేషన్ తోపాటు యోగా సెంటర్లను అకాడమీలో ఏర్పాటు చేస్తున్నారు. అకాడమీకి తన పేరు పెట్టడం పట్ల సింధు ఆనందం వ్యక్తం చేసింది. ఇక్కడి నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్ టోర్నమెంట్లు ఆడే స్థాయికి ప్లేయర్స్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అకాడమీ పని చేస్తుందని తెలిపింది.