Movies

పాటలు-సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

AR Rahman Becomes Lyricist For 99 Songs

మ్యూజికల్‌ రొమాంటిక్‌ చిత్రం ‘99 సాంగ్స్‌’తో సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ మరో కొత్త అవతారంలో పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత, రచయితగానూ ఆయనే వ్యవహరిస్తుండటం విశేషం. అయితే కొత్త బాధ్యతల నిర్వహణ చాలా సవాలుగా ఉందని ఈ ఆస్కార్‌ అవార్డు గ్రహీత అంటున్నారు. ఈ సినిమా మ్యూజిక్‌ లాంచ్‌ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘ఒక చిత్రానికి సంగీతం మాత్రమే సమకూరుస్తున్నపుడు ఆలోచనలను పంచుకోవడానికి అనుభవం ఉన్న దర్శకుడు, పాటల రచయిత, నిర్మాత వంటి వారు ఉంటారు. కానీ ఈ చిత్రంలో నేనే రచయితను. రచయితలు రాసేవి నిర్మాతలకు నచ్చాలి. ఇక్కడ అది కూడా నేనే… నేను ఓకే అన్నా దర్శకుడికి నచ్చకపోవచ్చు. అందుకే మేము ప్రతి పాటను మూడు నుంచి నాలుగు వెర్షన్లలో చేశాము. మూడు నెలల క్రితం వరకు మేము పడ్డ కష్టానికి ఫలితం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాం … ఇది చాలా చక్కని అనుభవం.’’ అని వివరించారు.