ScienceAndTech

టోల్ ఫ్రీ వెనుక రహస్యం ఇది

How Does Toll Free Number Work-Telugu Technology News

ఏదైనా అత్యవరసర సమయంలో టోల్‌ఫ్రీనెంబర్లకు ఫోన్లు చేస్తుంటాం. అయితే ‘దెర్ ఈజ్ నోఫ్రీ లంచ్’ అని ఆంగ్లంలో ఒక సామెత ఉంది. ఏదీ ఉచితంకాదనేది దానర్థం. వినియోగదారుల్ని ఆకర్షించడానికి, వినియోగ వస్తువుల్ని లేదా సేవల్ని మార్కెట్ చేసి లాభాలు గడించడానికిఈ టోల్‌ఫ్రీ నెంబర్లను ప్రకటిస్తుంటారు. పది అంకెల మొబైల్ నెంబరు ఒక్కో వ్యక్తికీవిశిష్టంగా ఉన్నట్లే టోల్‌ఫ్రీ నెంబరు కూడా ఒక్కో సంస్థకి విశిష్టంగా ఉంటుంది.విమాన ప్రయాణాన్ని కోరుకునే ప్రయాణికులు తమ విమానంలో ప్రయాణిస్తే సంబంధిత సంస్థకువేల రూపాయల లాభం వస్తుంది. పది మందికీ ఉచితంగా టోల్‌ఫ్రీకి కాల్ చేసే సదుపాయంకలిగిస్తే అందులో ఒకరు విమాన టికెట్ కొనుకున్నా సంస్థ లాభపడినట్లే. ఆ టెలిఫోన్బిల్లు ప్రయాణికుడు కాకుండా సంస్థ భరించినా వారికేమి లేదు. టోల్‌ఫ్రీ నంబరు ఇచ్చే సంస్థే వినియోగదారుడు ఫోన్ చేసిమాట్లాడటం వల్ల వచ్చే బిల్లును టెలిఫోన్ సంస్థకు కడుతుంది.ఉదాహరణకు మన ప్రభుత్వవిమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వాళ్లకు 18001801407 అనేది టోల్‌ఫ్రీ నంబరు. ఇక్కడ మొదటి 1800 అనేది భారతదేశంలో టోల్‌ఫ్రీ నంబరు అనే దానికి సంకేతం. మిగిలిన ఏడుఅంకెలూ ఎయిర్ ఇండియాకు చెందిన నెంబరు. మీరు హైదరాబాదు నుంచి ఢిల్లీకి వెళ్లడానికిసిద్ధపడ్డారనుకుందాం. మిమ్మల్ని తమ విమానంలో ప్రయాణించేలా ప్రోత్సహించేందుకు పైనంబరును మీకు ఎయిర్ ఇండియా వారు ఇచ్చారు. మీరు ఫోను చేస్తే ఆ బిల్లుకు ఆయన రెండులేదా మూడు రూపాయలను బిఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ సంస్థకు ఎయిర్‌ఇండియానే కడుతుంది.అందువల్ల మీరు వారి విమానంలో ప్రయాణించారనుకోండి, వాళ్లకి కనీసం 500 అయినా లాభం కలిగించినవారవుతారు.

See the source image