Business

యూపీలో భారీగా బంగారు గనులు

Huge acreage of gold mines identified in uttar pradesh-యూపీలో భారీగా బంగారు గనులు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3,000 టన్నులకుపైగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ), ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్ర భూగర్భ, గనుల శాఖ అధికారులు నిర్ధారించారు. జిల్లాలోని సోన్‌పహాడీ, హార్దీ ప్రాంతాలలో ఈ బంగారు గనులు విస్తరించి ఉన్నట్టు అధికారులు తెలిపారు. సోన్‌పహాడీలో 2700 టన్నులు, హార్దీలో 650 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు జీఎస్‌ఐ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ నిక్షేపాలను తవ్వితీసే మైనింగ్‌ కార్యక్రమాన్ని లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన సర్వే కొనసాగుతోంది. ఈ-టెండరింగ్‌ ద్వారా వేలం నిర్వహణకు ఏడుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఇక్కడ బంగారంతో పాటు యురేనియం నిల్వలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.