Movies

సిద్ధపడలేదు

Tapsee Speaks Of Her Filmfare Award And Speech Preparation

ఇటీవల నిర్వహించిన 65వ ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో తాప్సీ మొదటిసారి ఉత్తమ నటి(క్రిటిక్స్‌) అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ‘శాండ్ ఖీ అంఖ్‌’ చిత్రానికి గాను తాప్సీ, భూమి ఫడ్నెకర్‌ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది నిర్వహించిన ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం గురించి సోషల్‌మీడియాలో వేదికగా వెల్తువెత్తిన విమర్శలపై తాప్సీ తనదైన శైలిలో స్పందించారు. తాజాగా తాప్సీ ఓ అవార్డలు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ‘2016 నుంచి అవార్డులను సొంతం చేసుకుంటే స్టేజ్‌పై ఏం మాట్లాడాలనే విషయంలో స్పీచ్‌ సిద్ధం చేసుకునేదాన్ని. గడిచిన నాలుగేళ్లలో స్టేజ్‌పై మాట్లాడే అవకాశం నాకు రాలేదు. ఈ ఏడాది మాత్రం నేను ఎలాంటి స్పీచ్‌ను సిద్ధం చేసుకోలేదు. కానీ నేను స్టేజ్‌పై మాట్లాడాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాల సమయం తీసుకున్నప్పటికీ అవార్డు గెలుపొందడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇంతకు మించి నేను ఏం చెప్పగలను’ అని తాప్సీ అన్నారు.

See the source image