Food

ప్రతిరోజు కూరగాయలు తీసుకుంటే వృద్ధాప్యంలో మతిమరుపు ఉండదు

Eating Vegetables Everyday Prevents Dementia

ఆస్ట్రేలియా… సిడ్నీలో జరిగిన ఓ పరిశోధన అందర్నీ ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాల్ని ఇంటర్నేషనల్ జర్నల్ ఆప్ పబ్లిక్ హెల్త్‌లో రాశారు. ఆస్ట్రేలియా పరిశోధకులు మొత్తం 1,39,000 మంది ముసలివాళ్లను పరిశీలించారు. వాళ్లు తినే ఆహారం, వాళ్ల మెమరీ పవర్, వాళ్ల గుండె పనితీరు, డయాబెటిస్ స్థాయి వంటి అంశాల్ని చెక్ చేశారు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తినేవారికి మెమరీ పవర్ బాగా ఉన్నట్లు గుర్తించారు. ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు వంటివి ఎక్కువగా తినేవారికి జ్ఞాపక శక్తి బాగా ఉంటోందని తెలిసింది. వాళ్లు ముసలివాళ్లైనప్పటికీ… వాళ్ల గుండె ఆరోగ్యవంతంగా ఉంటోంది అని పరిశోధకుల్లో ఒకరైన… సిడ్నీలోని యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చర్ ల్యూనా జు తెలిపారు. వయసు పెరిగే గొద్దీ ఎక్కువ ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం అత్యవసరమని ఆమె చెబుతున్నారు.

ఆస్ట్రేలియాలో చాలా మంది డైమెన్షియా సమస్యతో చనిపోతున్నారు. జ్ఞాపక శక్తి తగ్గిపోవడమన్నది… ఈ వ్యాధి ప్రారంభ దశ. డైమెన్షియా వచ్చిన వారు ఏదీ సరిగా గుర్తుంచుకోలేరు. ఏ అంశంపైనా సరిగా నిర్ణయం తీసుకోలేరు. సరిగా చదవలేరు, సరిగా ఆలోచించలేరు. మాట్లాడేటప్పుడు ఏదేదో మాట్లాడేస్తుంటారు. దేనిపైనా పూర్తిగా దృష్టి కేంద్రీకరించలేరు. ఒకటి అనుకొని మరొకటి చేస్తారు. ఆ తర్వాత అరే ఇదేంటి ఇలా చేశాను అనుకుంటారు. రోజురోజుకూ ఈ సమస్య ఎక్కువై… ఏదో ఒక రోజు… ఏదో చేసుకోబోయి… ఏ సూసైడో చేసుకుంటారు. లేదంటే… వేర్వేరు రకాలుగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలా డైమెన్షియా వచ్చిన వారు… 2 నుంచీ 8 రకాల బ్రెయిన్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక దురదృష్టం కొద్దీ డైమెన్షియా ఉండేవారికి… గుండె జబ్బులు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటివి ఎక్కువగా ఉంటాయి.

అసలీ సమస్యలేవీ రాకుండా… రెగ్యులర్‌గా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, కాయల్ని ఎక్కువగా తినాలంటున్నారు పరిశోధకులు. వీటిలో సహజ సిద్ధంగా మన శరీర మెటబాలిజంను సెట్ చేసే శక్తి ఉందంటున్న పరిశోధకులు… రోజువారీ రైస్, గోధుమలు వంటివి తింటూనే… ఆహారంలో ఇవి కూడా తప్పనిసరిగా ఉండేలా చేసుకోమంటున్నారు. సీజన్ వారీగా లభించే పండ్లను తినడం వల్ల… సీజనల్ వ్యాధుల్ని ఎదుర్కోవడమే కాకుండా… బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టే అవకాశాలు మెరుగవుతాయంటున్నారు. అలాగే… ప్రోటీన్స్ ఉండే ఆహారం కూడా రెగ్యులర్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు. వయసులో ఉన్నప్పటి నుంచే ఇలాంటి ఆహార నియమాలు పాటిస్తే… వృద్ధాప్యంలో మతిమరపు, హార్ట్ సమస్యలు, డయాబెటిస్ వంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయంటున్నారు.