DailyDose

గుంటూరు జిల్లాలో జవాను ఉన్మాద చర్య-నేరవార్తలు

Telugu Crime News Roundup Today: Indian Army Soldier Fires At Lady

* చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామం లో నాటు తుపాకీతో కాల్పుల జరిపిన ఆర్మీ జవాన్. సెలవుల కోసం ఇంటికి వచ్చిన జవాన్. కాల్పుల్లో గాయపడ్డ రమాదేవి అనే మహిళ. కాల్పులకు లవ్ ఫెయిల్యూర్ కారణమని భావిస్తున్న పోలీసులు. కాల్పులు జరిపి పరారైన జవాన్ కోసం గాలిస్తున్న పోలీసులు

* వెబ్‌సైట్ల ద్వారా పేర్లు నమోదు చేసుకున్న వారికి సైబర్‌ నేరస్థులు ఫోన్లు చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు, చిరునామాలు తెలుసుకున్న అనంతరం రెండు, మూడు రోజుల్లో తమ వినియోగదారులు నేరుగా ఫోన్‌ చేస్తారని చెబుతున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లోని ఫ్లాట్లు, శివార్లలోని రిసార్టులకు యువతులు ఆహ్వానిస్తారని, వారు తెలిపిన ప్రాంతం వివరాలు చెబితే కారు పంపుతామని వివరిస్తున్నారు. ఆ వెంటనే బాధితులకు యువతుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ‘మీరు మా ఫ్లాట్‌కు రండి… కలిసి భోంచేద్దాం… నాకు మద్యం తాగే అలవాటుంది.. మీకూ ఇష్టమేనా’ అంటూ వారు వల వేస్తారు. ప్రస్తుతం తమ వద్ద క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు లేనందున మీరే మద్యం, మంచి ఆహారం తీసుకురండి.. అంటూ పురమాయిస్తారు. తానున్న చోట హోటళ్లు లేవని యువకులు బదులిస్తే… తన స్నేహితురాలి ఖాతాకు నగదు బదిలీ చేస్తే మీరు వచ్చేసరికి ఆహార పానీయాలు సిద్ధం చేసి ఉంచుతామని యువతులు నమ్మిస్తున్నారు. ఆ ఖాతాల్లోకి బాధితుడు నగదు బదిలీ చేయగానే.. సైబర్‌ నేరస్థులు, అప్పటి వరకూ మాట్లాడిన యువతి ఫోన్లు స్విచ్చాఫ్‌ చేస్తున్నారు. ఇలా సికింద్రాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి రూ.95 వేలు, మాదాపూర్‌లో ఓ యువకుడు రూ.65 వేల నగదు బదిలీ చేశారు.

* మీడియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని తిరుపతి క్రైం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. క్రైం సిఐ చల్లనిదొర కధనం మేరకు వరంగల్ కు చెందిన భానుప్రసాద్ అనే యువకుడు గతంలో కరీంనగర్ లో ఓ జాబ్ కన్సల్టెన్సీని నడిపేవాడు. అయితే అక్కడ నష్టం రావడంతో చిత్తూరుజిల్లా రామచంద్రాపురం మండలం ఎస్టీ కాలనీకి మకాం మార్చాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకొని అక్కడే జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల ఎపి 24×7 న్యూస్ ఛానల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓఎల్ ఎక్స్ లో ప్రకటన ఇచ్చాడు. తనను ఎవరైతే సంప్రదిస్తారో వారి పోన్ నెంబర్లతో ఓ వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశాడు. ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు చెల్లించాలని, అలా చెల్లించిన వారికి ఐడి కార్డు, లోగో ఇస్తామని నమ్మించాడు. తన భార్య పేరిట ఉన్న అకౌంట్ లో డబ్బులు జమచేయాలని సూచించారు. ఈ విషయం ఎపి 24×7 న్యూస్ ఛానల్ వారి దృష్టికి రాగా వారు ఈనెల 18వ తేదీన ఫిర్యాదు చేశారు. సదరు భానుప్రసాద్ మొబైల్ కదలికల ఆధారంగా అతన్ని ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే ఎవరూ నమ్మొద్దని ఈ సందర్భంగా క్రైం సిఐ చల్లనిదొర నిరుద్యోగులకు సూచించారు.

* మహారాష్ట్రలోని అకోలాలో జాతీయస్థాయి యువ బాక్సర్ పవన్ రౌత్(19) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అకోలాలో తన హాస్టల్ గదిలో శుక్రవారం ఉదయం పవన్ రౌత్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని కోచ్ సతీష్ చంద్ర భట్ తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్ పోటీల్లో పవన్ రౌత్ మహారాష్ట్ర తరపున ప్రాతినిథ్యం వహించాడని కోచ్ సతీష్ చెప్పారు. నాగ్‌పూర్‌కు చెందిన పవన్ రౌత్ అకోలాలోని స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతూనే అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. కాగా, శుక్రవారం అకోలోలానే జరిగే ఒక టోర్నమెంట్‌లో పాల్గొనాల్సి ఉండగా.. అతడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అనారోగ్యంతో పవన్ రౌత్ శిక్షణకు రాలేదని, శుక్రవారం  ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కోచ్ తెలిపారు. ఈ ఘటనపై మహారాష్ట్ర క్రీడా మంత్రి సునీల్ కేదార్ విచారం వ్యక్తం చేశారు. పవన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

* మనస్తాపంతో ఓ మహిళ … ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శ‌నివారం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. కోట మండలం ఊనుగుంటపాలెంకు చెందిన నాగార్జున, రాణి భార్యభర్తలు. వీరికి ప్రదీప్‌ (5), సుధీర్‌ (2) సంతాపం. కాగా కొంతకాలంగా నాగార్జున నెల్లూరులోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. అతడు అక్కడే ఉంటూ…వారంలో ఒకరోజు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. అయితే తమను కూడా నెల్లూరుకు తీసుకు వెళ్లాలంటూ కొద్దిరోజులుగా రాణి భర్తను కోరుతోంది.

* ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.ఈ ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు.  ఆపరేషన్‌ ప్రహార్‌లో భాగంగా పోలీసులు, మావోయిస్టులు మధ్య తొండమార్కా, దుర్మా, బడేకదేవాల్‌ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలు దాదాపు 30 గంటల పాటు ఆపరేషన్‌ ప్రహార్‌ను చేపట్టాయి. ఘటనా స్థలంలో మావోయిస్టుల నుంచి ఆయుధాలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

* కర్ణాటక రాష్ట్ర శాసనసభ స్పీకర్ జర్నలిస్టులపై నిషేధాస్త్రాన్ని ప్రయోగించారు. జర్నలిస్టులు లెజిస్లేచర్స్ హౌస్ లోపలకు ప్రవేశించకుండా నిషేధ ఉత్తర్వులను  కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కజేరి జారీ చేశారు. ఈ మేర స్పీకర్ తాజాగా అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. ‘‘ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్టులు ఎప్పుడూ లెజిస్లేచర్స్ హౌస్ లోపలకు ప్రవేశించ రాదు’’ అంటూ స్పీకర్ ఆదేశాల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నపుడు శాసనసభ్యులు లెజిస్లేచర్స్ హౌస్ కు వస్తుంటారని, జర్నలిస్టులు లెజిస్లేచర్స్ హౌస్ కు వచ్చి వారిని కలుస్తూ వారి గోప్యతకు భంగం కలిగిస్తున్నందున ఈ నిషేధం విధించామని స్పీకర్ పేర్కొన్నారు.