Politics

ఎల్వీ సెలవు ఇంకాస్త పొడిగించారు

YS Jagan Govt Extends LV Subrahmanyam Leave

ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం సెలవు గడువును పెంచుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు నెల రోజుల పాటు ఆయన సెలవు గడువును పొడిగిస్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల రోజుల పాటు ఆయనకు సగం వేతనం అందుతుంది. 2019 నవంబర్‌లో చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను ఆకస్మికంగా బదిలీ చేసింది ప్రభుత్వం. ఇది పెనుదుమారానికి దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పట్లో తాత్కాలిక సీఎస్ నీరబ్ కుమార్ కు ఎల్వీ సుబ్రహ్మణ్యం అప్పగించారు. తనను బదిలీ చేసిన బాపట్లలో హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ బాధ్యతలను ఆయన స్వీకరించలేదు. డిసెంబర్ 6వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. ఆ తర్వాత నెల నెలా సెలవును పొడిగించుకుంటున్నారు. తాజాాగా ఆయన పెట్టుకున్న లీవ్‌ను ప్రభుత్వం అంగీకరించింది.