Movies

అందానికి చిరునామా…మధుబాల

How hollywood tried to lure madhubala into the west

థియేటర్ ఆర్ట్స్ అనే అమెరికన్ పత్రిక 1952 ఆగస్టు సంచికలో మధుబాలపై ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. ‘ది బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద వరల్డ్’ అనే శీర్షికతో – అప్పటికి కేవలం 19 ఏళ్లే ఉన్న మధుబాలను ‘అభిమానులనే కాదు భక్తుల్ని’ కలిగిన నటి అని పేర్కొంది ఆ పత్రిక! ‘గత పదేళ్లుగా భారతదేశానికి నాలుగే తెలుసు. జాతీయోద్యమం, స్వాతంత్య్రం, సినిమా, మధుబాల. ఆమె సరసన నిలబడిన హీరోని చూస్తే, పురుషుడు గొప్పవాడన్నదో భ్రమ అని తేలిపోతుంది. మధుబాల చిత్రాలకై బర్మా, మలయా, ఇండోనేషియా, తూర్పు ఆఫ్రికాల్లో అభిమానులు వెర్రెత్తి చూస్తారు’ – అని ఆ పత్రిక కొనియాడింది.‘అలాంటి అందాల కుందనపు బొమ్మను దర్శించుకోవాలంటే ముంబై వెళ్లండి – హాలీవుడ్ స్టార్లు ఉండే లాస్ ఏంజెల్స్‌లోని బావర్లీ హిల్స్ కాదు’ అంటాడు ఆ వ్యాసం రాసిన డేవిడ్ కార్‌‌ట. ఈ ఆర్టికల్ చదివిన ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు ఫ్రాంక్ కాప్రా పరిగెత్తుకుని ముంబై వచ్చాడు. మధుబాలను దర్శించుకున్నాడు. ఈ సౌందర్యమూ, నటనావైదుష్యమూ ప్రపంచానికి తెలియాలన్నాడు. హాలీవుడ్‌లో నటించమని ప్రాధేయపడ్డాడు. కాని మధుబాల తండ్రి కుదరదని స్పష్టం చేశాడు. కూతురి ఆరోగ్యం గురించి అతనికి తెలుసు కదా!