Sports

రెజ్లింగ్ స్వర్ణం గెలిచిన భారతీయ జట్టు

Indian Wrestler Ravi Dahia Wins Gold At Wrestling Tournament

ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సత్తాచాటారు. గ్రీకోరోమన్‌ పురుషుల 57 కేజీల విభాగంలో రవి దహియా స్వర్ణం సాధించగా.. స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా (65 కేజీలు) రజతానికి పరిమితమయ్యాడు. శనివారం జరిగిన ఫైనల్‌ పోరులో రవి దహియ 10-0తో హిక్మతుల్లా (తజకిస్థాన్‌)పై విజయం సాధించగా.. బజరంగ్‌ 2-10తో టకూటో ఒటోగురు (జపాన్‌) చేతిలో ఓటమిపాలయ్యాడు. భారీ అంచనాల మధ్య బరిలో దిగిన బజరంగ్‌ ఆకట్టుకోలేక పోయాడు. ఓవరాల్‌గా శనివారం భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజత పతకాలు వచ్చా యి. 97 కేజీల ఫైనల్లో సత్యవర్త్‌ కడియాన్‌ 0-10 మెజ్తబా (ఇరాన్‌) చేతిలో ఓడగా.. 79 కేజీల ఫైనల్లో గౌరవ్‌ బలియాన్‌ 5-7తో అర్సాలన్‌ బుడాజపోవ్‌ (కిర్గిస్థాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు.