WorldWonders

మాస్కుల మాటున ముద్దులు

Newly Weds Kiss Behind Masks In Manila

కరోనా వైరస్ భయం ఇప్పుడు పెళ్లిళ్లకు కూడా పాకింది. ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఓ సామూహిక వివాహ కార్యక్రమంలో వధూవరులు సర్జికల్ మాస్కులు ధరించి ముద్దులు పెట్టుకున్నారు. బాకోలోడ్ కోస్తా తీరంలో గురువారం ఈ సామూహిక వివాహ వేడుకలు జరిగాయి. కరోనా వైరస్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఇస్తున్న మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. దీంతో వధూవరులంతా సంప్రదాయ వస్త్ర ధారణతో పాటు విధిగా మాస్కులు ధరించి వచ్చారు. ‘‘మాస్కులు ధరించి ముద్దులు పెట్టుకోవడం కొంచెం ఇబ్బందే అయినా… తప్పదు మరి.. ఈ కార్యక్రమం జనంతో కిటకిటలాడిపోయింది..’’ అని ఈ కార్యక్రమానికి హాజరైన జాన్ పాల్ ఇన్వెంటర్ అనే వ్యక్తి పేర్కొన్నారు. వేలంటైన్స్ డే తర్వాత సామూహిక వివాహాలు చేసుకోవడం మనీలాలో ఓ సంప్రదాయంగా వస్తోంది. 2013లో అత్యధికంగా 2,013 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి.కాగా ఇప్పుడు   వధూవరులు మాస్కులు ధరించిన ముద్దాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.