భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కె శిక్షణ యుద్ధ విమానం ఆదివారం గోవా తీరంలో కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ క్షేమంగా బయటపడ్డారని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. రోజువారీ శిక్షణలో భాగంగా బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై విచారణకు ఆదేశించామని భారత నౌకాదళం వెల్లడించింది. గత నవంబరులోనూ ఇదే రకానికి చెందిన విమానం కూలిన విషయం తెలిసిందే. అప్పుడు పక్షులు అడ్డురావడంతో ఇంజిన్ మొరాయించి ప్రమాదం సంభవించింది. అయితే పైలట్ల చాకచక్యంతో జనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. వారు కూడా వెంటనే బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు.
కుప్పకూలిన మిగ్ విమానం
Related tags :