NRI-NRT

ట్రంప్ భారత పర్యటనపై TNI ప్రత్యేక కథనాలు

Donald J Trump India 2020 Visit - Gallery And Special News

* భారత్‌కు చేరుకున్న ట్రంప్‌ — రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు చేరుకున్నారు. ఆయన విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది.

Image result for trump india trip 2020

Image result for trump india trip 2020

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మాంసం అంటే చాలా ఇష్టం. అలాగే మెక్‌డొనాల్డ్స్ ఉత్పత్తులు, డైట్ కోక్ వంటివి ఎక్కువగా ఇష్టపడతారు. రెండ్రోజుల భారత పర్యటనలో… ఆయనకు కేంద్ర ప్రభుత్వం… వెజిటేరియన్ (శాఖాహారం) ఆహారాల్ని ఇవ్వబోతోంది. ఫార్చూన్ లాండ్ మార్క్ హోటల్‌లో ప్రముఖ చెఫ్ సురేష్ ఖన్నా… ఈ ఆహార పదార్థాల్ని ప్రిపేర్ చేస్తున్నారు. మొదటిసారి భారత్ వస్తున్న ట్రంప్‌కి సురేష్ ఖన్నా… ప్రధాని మోదీ చెప్పినట్లుగా… గుజరాతీ ఆహార పదార్థాల్ని అహ్మదాబాద్‌లో వండుతున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ తర్వాత ట్రంప్ ముందుగా వెళ్లేది… సబర్మతీ ఆశ్రమానికే. అక్కడ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులకూ హై టీ, చిన్నపాటి అల్పాహారం ఇవ్వబోతున్నారు. ఈ హై టీ, అల్పాహారం చేసిపెట్టే విషయాన్ని ఆదివారం మాత్రమే సురేష్ ఖన్నాకు సమాచారం ఇచ్చారు. అందువల్ల టీతో పాటూ…రుచికరమైన ఫార్చూన్ కుకీస్ (బిస్కెట్లు), అలాగే గుజరాత్‌లో ఫేమస్ అయిన నైలాన్ ఖమాన్ దోఖ్లాను ఇస్తున్నారు. అలాగే… బ్రకోలీ, మొక్కజొన్న పొత్తుల సమోసా, సిన్నమోన్ యాపిల్ పై (దాల్చినచెక్క యాపిల్ పై – పిజ్జా లాంటిది), కాజీ లర్కీ వంటివి అల్పాహారంగా ఇస్తున్నారు. వీటితోపాటూ… అల్లం, మసాలా చాయ్ కూడా తయారుచేస్తున్నట్లు సురేష్ ఖన్నా తెలిపారు. ఈ అల్లం, మసాలా చాయ్ అంటే ప్రధాని మోదీకి చాలా ఇష్టం. ఆహారాల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. ఇదివరకు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు అదిరిపోయే ఐటెమ్స్ పెట్టించేవారు. అప్పట్లో చాలా మంది ప్రముఖులకు సురేష్ ఖన్నా… మోదీ చెప్పిన ఐటెమ్స్ ప్రిపేర్ చేసి పెట్టారు. గత 17 ఏళ్లుగా ఆయనే ఇవన్నీ చేస్తున్నారు. అందువల్లే ఈసారి కూడా సురేష్ ఖన్నాకే మోదీ ఛాన్స్ ఇచ్చారు. ఈ హై టీ తీసుకున్న తర్వాత… ట్రంప్, ప్రధాని మోదీ కలిసి… మోతేరా క్రికెట్ స్టేడియంలో జరిగే నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు.

Image result for trump india trip 2020

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో విందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిరాకరించినట్లు సమాచారం. ట్రంప్‌ భారత పర్యటన నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్‌ మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా ఇవ్వనున్న విందుకు పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలకు ఆహ్వానం పంపారు. అయితే ఈ విందుకు హాజరయ్యేందుకు మన్మోహన్‌ తొలుత అంగీకరించినప్పటికీ తర్వాత మనసు మార్చుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు సింగ్‌తో పాటు రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నభీ అజాద్‌ సైతం ఈ విందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ అధినాయకురాలు సోనియాకు విందుకు ఆహ్వానం రాకపోవడంపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ విందుకు హాజరవ్వడం లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ ఇప్పటికే స్పష్టం చేశారు.

Image result for trump india trip 2020

* అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అంటే ప్రత్యేకత కోరుకొంటారు. ఆయన పర్యటిస్తున్నారంటే ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలో ఉండాల్సిందే. చాలా మంది అమెరికా అధ్యక్షులు వచ్చినా జరగనివి ట్రంప్‌ వచ్చారంటే జరిగిపోతాయి. తాజ్‌మహల్‌ విషయంలో కూడా అటువంటిదే చోటు చేసుకొంది. దాదాపు 300 సంవత్సరాల తర్వాత అందులోని సమాధుల నమూనాలను శుభ్రపర్చారు. వీటికి క్లేపాక్‌ ట్రీట్‌మెంట్‌ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆ సమాధులకు ఒకరకమైన మట్టితో చిక్కటి పూతవేసి తర్వాత వాటిని డిస్టిల్‌ వాటర్‌తో శుభ్రపరిచారు. సాధారణంగా ముఖానికి పూతగా వేసుకొనేందుకు వాడే ఒకరకమైన మట్టిని దీనికి వినియోగించారు.

Image result for trump india trip 2020

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు దిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌ నుంచి బయల్దేరి ఈ ఉదయం అహ్మదాబాద్‌ చేరుకున్న ట్రంప్‌, మెలానియా దంపతులు తొలి రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత అంతర్జాతీయ విమానాశ్రయంలో చేరుకున్న ట్రంప్‌, మెలానియా దంపతులకు అపూర్వ స్వాగతం లభించింది. వేలాది మంది ప్రజలు ప్రపంచ అగ్రరాజ్య అధిపతికి అడుగడుగునా స్వాగతం పలికారు. అనంతరం సబర్మతి ఆశ్రమానికి చేరుకున్న ట్రంప్‌ అక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మహాత్మాగాంధీ చిత్ర పటానికి వస్త్రమాలను వేశారు. అనంతరం ట్రంప్‌, మెలానియా చరఖాను తిప్పారు. సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాసి సంతకం చేశారు. అక్కడి నుంచి మోతెరా మైదానానికి చేరుకొని ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం విమానంలో ఆగ్రాకు బయల్దేరారు. తాజ్‌మహల్‌ అందాలను తిలకించిన ట్రంప్‌ దంపతులు.. ఆ పురాతన పాలరాతి కట్టడం విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి దిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. ఈ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో దిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో ట్రంప్‌తో పాటు ఆయన కుమార్తె, ఇవాంక, అల్లుడు కుష్నర్‌ ఉన్నారు.

Image result for trump india trip 2020

Image result for trump india trip 2020

* భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజ్‌మహల్‌ను వీక్షించారు. ఈ సందర్భంగా సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. ‘భారత మహోజ్వల సంస్కృతి, భిన్నత్వంలో ఏకత్వానికి తాజ్‌మహల్‌ తార్కాణంగా నిలుస్తోంది. ఈ కట్టడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.”

Image result for ivanka trump india trip 2020