NRI-NRT

ఫ్రిస్కో రోడ్డు ప్రమాదంలో ఆవుల దివ్య దుర్మరణం

Hyderabadi Couple Divya Avula And Raja Dead In Car Crash In Frisco-ఫ్రిస్కో రోడ్డు ప్రమాదంలో ఆవుల దివ్య దుర్మరణం

అమెరికాలో మరో రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో ఫ్రిస్కోలోని FM423-DeWebb Blvd జంక్షన్ వద్ద ఫోర్డ్ ట్రక్కు ఎకురా కారును ఢీకొన్న ఘటనలో ఆవుల దివ్య(34), గవిని రాజా(41), ప్రేమనాథ్ రామనాధం(42) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరూ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం తమ కుమార్తె రియాను డ్యాన్స్‌ క్లాస్‌ వద్ద విడిచిపెట్టారు. తిరిగి వస్తున్న మార్గంలో స్థానికంగా నిర్మాణం చేపట్టిన తమ సొంత ఇంటిని పరిశీలించేందుకు విజయవాడ ప్రాంతానికి చెందిన స్నేహితుడు ప్రేమ్‌నాథ్‌ రామనాథం (42)ను తీసుకెళ్లారు.  ఫోర్డ్ వాహనాన్ని నడుపుతున్న మైనర్ బాలుడు….జంక్షన్ వద్ద మలుపు తిరుగుతున్న దివ్య కారును ఢీకొట్టగా ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. కారును దివ్య నడుపుతున్నారు. మైనర్ బాలుడికి కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు ఫ్రిస్కో పోలీసులను సంప్రదించవల్సిందిగా వారు కోరారు. దివ్య, రాజా ఇరువురుది హైదరాబాద్. వీరు ముషీరాబాద్ ప్రాంతంలోని గాంధీనగర్‌కు చెందినవారు. వీరి మృతిపట్ల DFW ప్రవాసులు తమ సానుభూతిని వెలిబుచ్చారు.Hyderabadi Couple Divya Avula And Raja Dead In Car Crash In Frisco-ఫ్రిస్కో రోడ్డు ప్రమాదంలో ఆవుల దివ్య దుర్మరణం
https://www.nbcdfw.com/news/local/3-dead-1-hospitalized-in-frisco-crash-sunday-night/2316799/