Health

ముడత చర్మానికి మంచినీటి చిట్కా

ముడత చర్మానికి మంచినీటి చిట్కా

ముఖం కళ లేకుండా నిర్జీవంగా ఉంటే తేలిగ్గా తీసుకోవద్ధు బహుశా శరీరంలో నీటిశాతం తగ్గిందేమో… ఒక్కసారి గమనించుకోండి. శరీరానికి అవసరమైనన్ని నీళ్లు తాగకపోవడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. ఇంకా అనేక రకాల సమస్యలూ వస్తాయి. అవేమిటంటే…

*** తాగకపోతే…
* ఎండకు ముఖచర్మం కందిపోయి ముఖం మీద మచ్చలు ఏర్పడతాయి.
* కంటి కింది చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల అక్కడి చర్మం ముడతలు పడుతుంది.
* నీళ్లు తగినన్ని తాగని వారిలో ముక్కు దగ్గరి చర్మం మృదువుగా లేకుండా పెళుసుబారినట్టుగా మారిపోతుంది. బ్లాక్‌హెడ్స్‌ వంటివి ఇబ్బంది పెడతాయి.
* వేడి నుంచి ఉపశమనం కోసం నీళ్లకు బదులుగా శీతలపానీయాలు తాగుతారు. అది ఎంత మాత్రం మంచిది కాదు. ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.

*** తాగితే…
* నీళ్లు పుష్కలంగా తాగేవారిలో మాడు పొడిబారకుండా ఉంటుంది. దాంతో దురదలు, చుండ్రు లాంటి సమస్యలు దరిచేరవు.
* నీళ్లు, కొబ్బరినీళ్లు వంటివి తాగడం వల్ల శరీరంలో పొటాషియం, ఎలక్ట్రోలైట్‌ స్థాయులు సరిపడినంతగా ఉంటాయి. దాంతో నీరసం నిస్సత్తువ ఆవరించవు. కళ్లు పొడిబారకుండా ఉండటానికి ఇవెంతో అవసరం.
* భోజనానికి ఇరవై నిమిషాల ముందు రెండు కప్పుల నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
* నీళ్లు తాగేవారిలో చర్మం ముడతలు పడదు. మచ్చలూ ఏర్పడవు.