WorldWonders

ఆదిలాబాద్‌లో పెద్దపులి సంచారం

Tiger in adilabad district scares citizens

ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. జైనథ్‌ మండలం నిరాల గ్రామ శివారులో బేల-ఆదిలాబాద్‌ ప్రధాన రహదారిపై రాత్రి పులి కనిపించింది. పెద్దపులి సంచరిస్తుండగా ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. లక్ష్మీపూర్‌ కెనాల్‌లో నీళ్లు తాగడానికి పులి వచ్చినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. పెద్ద పులి సంచారంతో నీరాల పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భీంపూర్‌ మండలం నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోయిందని భావిస్తున్న సమయంలో మళ్లీ పులి సంచరించడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు చెబుతున్నారు.