NRI-NRT

పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటరు సందర్శించిన తానా ప్రతినిధులు

23rd TANA Conference-2021 TANA Convention Philadelphia Pennsylvania-Jay Talluri-Ravi Potluri

2021 జులై 2,3,4 తేదీల్లో నిర్వహించనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 23వ ద్వైవార్షిక మహాసభల ప్రాంగణమైన పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటరును తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, వేడుకల సమన్వయకర్త పొట్లూరి రవి నేతృత్వంలోని బృందం శుక్రవారం నాడు సందర్శించింది. పెద్దసంఖ్యలో హాజరు కాబోయే అతిథులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా సభాస్థలి వద్ద ఏర్పాట్లను వీరు పర్యవేక్షించారు.